iDreamPost
android-app
ios-app

Raj Tarun: ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ షోకి వెళ్తా.. రాజ్ తరుణ్ కామెంట్స్ వైరల్!

  • Published Sep 12, 2024 | 9:38 PM Updated Updated Sep 12, 2024 | 9:44 PM

Raj Tarun: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆట కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్..ఓ కంటెస్టెంట్ కోసం అవసరమైతే బిగ్ బాస్ లోకి వెళ్తా అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

Raj Tarun: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆట కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్..ఓ కంటెస్టెంట్ కోసం అవసరమైతే బిగ్ బాస్ లోకి వెళ్తా అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

  • Published Sep 12, 2024 | 9:38 PMUpdated Sep 12, 2024 | 9:44 PM
Raj Tarun: ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ షోకి వెళ్తా.. రాజ్ తరుణ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆట కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. హౌస్ లో ఉన్న గ్రూపులు చాలవని.. బిగ్ బాస్ కూడా మూడు గ్రూపులు చేశాడు. ఏ సీజన్ లో లేనిది.. తిండి కోసం కూడా కొట్లాటలు పెట్టేశాడు. ఎవరికి ఏం కావాలన్న దానిని ఆడి గెలుచుకోవాల్సిందే అని చెప్పాడు. ఇలా విభిన్నమైన టాస్క్ లు ఇస్తూ షోను  మంచి ఆసక్తికరంగా మారుస్తున్నారు. ఇప్పటికే బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింది. ఇది ఇలా ఉంటే.. బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ లకు పలు పలు విధాలుగా మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఓ కంటెస్టెంట్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆ కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ షోలోకి వెళ్తాని తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని తనకంటూ ఓ గుర్తింపు సంపాదించాడు. ఇటీవలే పురుషోత్తముడు, తిరగబడరా సామీ వంటి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు బాక్సీఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో  తాజాగా రాజ్ తరుణ్ “భలే ఉన్నాడే” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో రాజ్ కి జోడీగా యంగ్ బ్యూటీ మనీష కందుకూరు నటించింది. ఈ సినిమాకు శివ సాయి వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్ అయినా శేఖర్ భాషా ప్రస్తావన రావడంతో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.  శేఖర్ భాషా తనకి సరైన సమయంలో ఆధారాలతో వచ్చి సహాయం చేశాడని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా శేఖర్ భాషా నిజం కోసం నిలబడ్డాడని రాజ్ తరుణ్ అన్నాడు. అలాంటి తనకోసం వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తానని ఇంటర్వ్యూ తెలిపాడు. శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని తెలిపాడు. గతంలో పలు సినిమాల ప్రమోషన్స్ లో శేఖర్ బాషాను ఒకట్రెండు సార్లు మాత్రమే కలిశాని తెలిపాడు. అంతేత తప్ప అతడితో తనకు ఎలాంటి స్నేహం లేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

కానీ శేఖర్ భాషా మాత్రం తనకోసం ఎంతో చేశాడని, ఈ క్రమంలోనే తనకి మంచి మిత్రుడిగా మారాడని పేర్కొన్నాడు. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే..ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసింది. కొన్ని రోజుల క్రితం లావణ్య అనే యువతితో ప్రేమ పెళ్లి విషయాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూకు సంబంధించి ఏదో ఒక విషయంలో బయటకు వస్తుంది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ విషయంలో రాజ్ తరుణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist