iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నిఖిల్- పృథ్వీ- యష్మీ.. హౌస్ లో కొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

  • Published Sep 17, 2024 | 4:52 PM Updated Updated Sep 17, 2024 | 4:52 PM

Prithvi- Yashmi- Nikhil- Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో లవ్ స్టోరీలు లేవు అంటూ ఆడియన్స్ అయితే డీలా పడుతున్నారు. తాజా ప్రోమో చూస్తే హౌస్ లో ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది.

Prithvi- Yashmi- Nikhil- Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో లవ్ స్టోరీలు లేవు అంటూ ఆడియన్స్ అయితే డీలా పడుతున్నారు. తాజా ప్రోమో చూస్తే హౌస్ లో ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది.

  • Published Sep 17, 2024 | 4:52 PMUpdated Sep 17, 2024 | 4:52 PM
Bigg Boss 8: నిఖిల్- పృథ్వీ- యష్మీ.. హౌస్ లో కొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సరైన లవ్ ట్రాక్ లేదు అని ఆడియన్స్ అయితే ఫీలవుతున్నారు. ఈ సీజన్ లో విష్ణుప్రియ- పృథ్వీ మధ్య ఏదైనా లవ్ స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూశారు కానీ.. అది వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. అయితే ఇప్పుడు హౌస్ లో ఒకటి కాదు.. ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెట్ అయ్యేలా కనిపిస్తోంది. అది కన్ఫామ్ అనడానికి లేదు. కానీ, హౌస్ మేట్స్ అందరూ ఇస్తున్న ఇండికేషన్స్ చూస్తుంటే.. అది వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తోంది. అందుకు సంబంధించిన స్పేస్, స్కోప్ కూడా అక్కడ ఉంది. అసలు ఈ ట్రయాంగిల్ ఎవరి మధ్య అంటే నిఖిల్- పృథ్వీ- యష్మీ అనే చెప్పాలి. తాజా ప్రోమో చూస్తే ఇండికేషన్స్ అలాగే ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎలాంటి లవ్ స్టోరీలు అయితే లేవు. కానీ, ఇప్పుడు ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అన్నట్లు ప్రోమోలో బీజీఎంలు వేసి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒక బెడ్ రూమ్ లో నిఖిల్, నైనికా, నాగ మణికంఠ, సీత కూర్చుని ఉన్నారు. అందరూ డిస్కషన్ ఏంటి అంటే నిఖిల్ సీతతో క్లోజ్ ఉన్నాడు అని. కానీ, వాళ్లందరు మాత్రం నిఖిల్ కి యష్మీకి మధ్య ఏదో ఉంది అన్నట్లుగా కామెంట్స్ చేశారు. అయితే నిఖిల్ మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. విష్ణు కూడా నిఖిల్ ఎక్కువగా యష్మీతోనే ఫ్లర్ట్ చేశాడు అని చెప్పుకొచ్చింది. అందుకే యష్మీని పిలిచి ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలి అని చూశారు. యష్మీ మాత్రం తనతో ఎప్పుడు మామూలుగా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, దానిని బిగ్ బాస్ ఎడిటర్ లవ్ మ్యూజిక్ తో కవర్ చేశాడు.

ఇంక పృథ్వీకి సంబంధించి యష్మీ అంటే నీకు ఇష్టం కదా అని సోనియా అడుగుతుంది. అందుకు అతను అలా ఏం లేదు అన్నట్లుగానే చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ, నీకు యష్మీకి సంథింగ్ ఏదో ఉంది అంటూ సోనియా కామెంట్ చేస్తూ ఉంటుంది. పృథ్వీ రియాక్షన్ ని ప్రోమోలో క్లియర్ గా అయితే చూపించలేదు. ఈ సంఘటనలో కూడా ఎడిటర్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. మనసా అనే మ్యూజిక్ వేయగానే అంతా వీళ్ల మధ్య నిజంగానే ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు. అయితే అక్కడ అలాంటిది ఏమీ లేదు అని అర్థమవుతోంది. వాళ్లు మొదటి నుంచి ఫ్రెండ్స్ లాగానే కనిపించారు. ఇప్పటికే అలాగే ఉన్నట్లుగా ఉంది. ఇంక ప్రోమో చూస్తే.. క్యాబేజీలతో నత్తల టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్కులో ప్రేరణ సంచాలక్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. నాగ మణికంఠను కొన్ని కామెంట్స్ కూడా చేసింది. మరి.. హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet