Tirupathi Rao
Nagarjuna Comments On Prerana and Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ లో శనివారం వచ్చింది అంటే.. క్లాసుల పర్వం మొదలవుతుంది. ఈసారి అది కాస్త గట్టిగానే జరిగింది. ముఖ్యంగా ప్రేరణ- విష్ణుప్రియకి ఆ డోసు కాస్త ఎక్కువగానే పడింది.
Nagarjuna Comments On Prerana and Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ లో శనివారం వచ్చింది అంటే.. క్లాసుల పర్వం మొదలవుతుంది. ఈసారి అది కాస్త గట్టిగానే జరిగింది. ముఖ్యంగా ప్రేరణ- విష్ణుప్రియకి ఆ డోసు కాస్త ఎక్కువగానే పడింది.
Tirupathi Rao
శనివారం రోజున వారం మొత్తం హౌస్ లో ఏం జరిగింది అనే విషయాలను హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తారు. ఎవరు బాగా ఆడారు.. ఎవరు నోరు బాగా వాడారు అనే విషయాలు అప్పుడే బయటకు వస్తాయి. అలాగే వారి మైండ్ లో నాటుకుపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, క్లారిఫికేషన్ కూడా ఆ రోజునే వస్తుంది. అయితే ఈసారి నాగార్జునకు పెద్ద పనే పెట్టారు. ఎందుకంటే హౌస్ లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఉన్న వాళ్లంతా ఏదో ఒక తప్పు చేసిన వాళ్లే. అయితే మరీ ముఖ్యంగా విష్ణుప్రియ- ప్రేరణ మాత్రం హద్దులు దాటేశారు అని చెప్పాలి. ఆ తర్వాత పృథ్వీ కూడా పదే పదే అదే తప్పు చేస్తూ కనిపిస్తున్నాడు. పృథ్వీకి కూడా ఇచ్చిపడేశాడు. కానీ, ఎక్కువ మాత్రం విష్ణు- ప్రేరణకే పడ్డాయి. అసలు వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
ప్రేరణ ఈ వారం బాగా బ్యాడ్ అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే మొదట నాగ మణికంఠ మీద, ఆ తర్వాత విష్ణుప్రియ మీద నోరు పారేసుకుంది. ఇంక టాస్కులో సీత మీద అయితే కాలుకూడా చేసుకుంది. దానికి తోడు కొన్ని అబద్ధాలు కూడా చెప్పింది. వాటికి అదనంగా విష్ణుప్రియను క్యారెక్టర్ లెస్ అంటూ అనేసింది. అందుకు నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. మొదట ఆమె దోశ వేసిన ఇష్యూని చూపించి క్లారిటీ ఇచ్చారు. విష్ణు కావాలనే ఏమీ లేనిదాన్ని అంత సీన్ చేసింది అని ప్రూవ్ చేశారు. అయితే ప్రేరణకు దోశ వేసే ఉద్దేశం లేదు అనే విషయాన్ని మాత్రం కప్పిబుచ్చారు.
అక్కడితో ప్రేరణకు సపోర్ట్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ, ఆ తర్వాత వెంటనే క్యారెక్టర్ లెస్ అనే పాయింట్ ని రైజ్ చేశారు. అక్కడితే ప్రేరణకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తాను ఆ పదాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అంటే సెల్ఫిష్ గా చేస్తోంది అని ఆ ఉద్దేశంతో అన్నాను అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే సెల్ఫిష్ అనే అనచ్చు కదా, ఫేక్ అనచ్చు కదా, మాస్క్ వేసుకుని ఆడుతున్నావ్ అనచ్చు కదా అని నాగార్జున ప్రశ్నించాడు. అందుకు ప్రేరణ దగ్గర ఆన్సర్ లేదు. అసలు క్యారెక్టర్ లెస్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించగా ఆమె వద్ద సమాధానం లేదు. కాబట్టి మాటలు జాగ్రత్తగా వాడాలి అని హితవు పలికాడు. అలాగే విష్ణుప్రియకు కూడా క్లాస్ పడింది. పుణ్య స్త్రీ అన్న సమయంలోనే వార్నింగ్ ఇచ్చాను.. ఇప్పుడు పతివ్రత వరకు వచ్చేశావు అంటే సీరియస్ అయ్యాడు.
అసలు వాళ్లు వాడుతున్న పదాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా.. మీ భాష చూస్తుంటే కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్లలా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి నాగార్జున ఈ మాట అనగానే సదరు కుళాయి దగ్గర కొట్లాటకు దిగేవాళ్ల మనోభావాలు దెబ్బతిని ఉండచ్చు. ఎందుకంటే గుడ్ల టాస్కులో హౌస్ మేట్స్ అంత దారుణంగా కొట్టుకున్నారు. మొత్తానికి విష్ణు- ప్రేరణకు కాస్త గట్టిగానే గడ్డిపెట్టారు. వాటికి అదనంగా గుడ్లు కూడా తనిపించారు. అలా వాళ్ల గొడవ అయితే సద్దుమణిగిపోయింది. కానీ, వాళ్లు మాత్రం జన్మలో మళ్లీ నోరు జారకుండా నాగార్జున ఇచ్చిన వార్నింగ్ బాగుంది.