iDreamPost
android-app
ios-app

లాహిరీ లాహిరీ లాహిరీలో హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా..? త్వరలో గుడ్ న్యూస్‌తో రాబోతున్నాడు..!

  • Published Aug 10, 2024 | 3:24 PM Updated Updated Aug 10, 2024 | 3:24 PM

లాహిరి లాహిరీ లాహిరీలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన యుపీ కుర్రాడు ఆదిత్య ఓం. ఈ మూవీ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాాలేమీ లేవు. అయినప్పటికీ అలుపెరగని పోరాటయోధుడిలా తన పోరాటాన్ని చేస్తున్నాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట.

లాహిరి లాహిరీ లాహిరీలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన యుపీ కుర్రాడు ఆదిత్య ఓం. ఈ మూవీ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాాలేమీ లేవు. అయినప్పటికీ అలుపెరగని పోరాటయోధుడిలా తన పోరాటాన్ని చేస్తున్నాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట.

  • Published Aug 10, 2024 | 3:24 PMUpdated Aug 10, 2024 | 3:24 PM
లాహిరీ లాహిరీ లాహిరీలో హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా..? త్వరలో గుడ్ న్యూస్‌తో రాబోతున్నాడు..!

లాహిరి లాహిరీ లాహిరీలో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన మరో హీరో ఆదిత్య ఓం. తొలి మూవీతోనే మంచి మార్కులు వేసుకున్నాడు. రవితేజలా ఎనర్జిటిక్ ఫెర్ఫామర్. యాక్టింగ్ స్కిల్ పుష్కలం కానీ.. ఇండస్ట్రీలో ఇదొక్కటే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అందుకే ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల నుండి కొనసాగుతున్నా.. ఫస్ట్ మూవీ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ లేక సతమతమౌతున్నాడు. అలా అని తన ప్రయాణాన్ని ఆపలేదు. సక్సెస్ రాకపోతుందా అని దండ చేయత్ర చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన ఫేట్ మార్చుకునేందుకు రూట్ మారుస్తున్నాడని తెలుస్తుంది. త్వరలో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టబోతున్నాడట ఈ బాయ్ నెక్ట్స్ డోర్ హీరో. బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టనున్నాడని జబర్దస్త్ మాజీ నటుడు మహిధర్ వెల్లడించాడు.

బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొంత మంది పేర్లను వెల్లడించాడు జజర్దస్త్ మహిధర్. సీరియల్ యాక్టర్స్ ఏక్ నాథ్- హారిక, అంజలి పవన్, ప్రేరణ, రీతూ చౌదరి, ఆర్పీ, జబర్దస్త్ నరేష్ లేదా రియాజ్, జబర్దస్త్ పవిత్ర, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, సోనియా సింగ్, కుషిత కల్లపు, అలాగే యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు చేసిన యువ సామ్రాట్ వస్తున్నారని చెబుతున్నాడు. రాజేష్ మహా సేన కూడా రాబోతున్నాడని మహిధర్ చెబుతున్నాడు. వీరితో పాటు ఆదిత్య ఓం కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంకా అగ్రిమెంట్స్ ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ఇందులో మరో విశేషం ఏంటంటే..? లాహిరీ లాహిరీ లాహిరీలో తనతో యాక్ట్ చేస్తున్న రస్నా బేబి అంకితను కూడా ఈ షోలోకి తీసుకు రావాలని అనుకుంటున్నాడట ఆదిత్య ఓం. ఇదే నిజమైతే మరోసారి రీల్ కపుల్ .. బిగ్ బాస్ హౌస్‌లోకి సందడి చేసే అవకాశం ఉంది.

అయితే ఆదిత్య ఓం మినహాయించి.. మిగిలిన కంటెస్టెంట్స్ అంతా యంగర్స్ కావడం గమనార్హం. వీరందరి పోటీ తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. అంతేకాకుండా వీళ్లంతా సోషల్ మీడియా ద్వారా లేక బుల్లితెరపై సందడి చేస్తున్న వారే. ఆదిత్య ఓంకి 90 కిడ్స్ మాత్రమే తెలిసిన యాక్టర్. ఈ తరానికి అందగా తెలియదు. అయితే గత సీజన్ 7లో శివాజీలా అందరికీ ఓ గైడ్‌లా మారతాడేమో చూడాలి. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. లాహిరీ లాహిరీ లాహిరీతో ధనలక్ష్మీ ఐలవ్ యూ, ప్రేమించుకున్నాం,పెళ్లికి రండీ, ఆఖరీ పేజీ, సలాం హైదరాబాద్, నాతో నేను వంటి చిత్రాలతో పాటు హిందీలో కూడా బంధూక్, అలీఫ్ వంటి చిత్రాల్లో చేశాడు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు ఫిల్మ్ ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్, డైరెక్టర్ కూడా. మరీ ఈ బిగ్ బాస్ సీజన్‌లోకి ఎంటరైతే.. ఏ మాత్రం అలరిస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Aditya Om (@theadityaom)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom