iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: విష్ణుప్రియ చీర గురించే సోనియా దిగజారుడు మాటలు.. అసలు విషయం ఇదే!

  • Published Sep 11, 2024 | 12:57 PM Updated Updated Sep 11, 2024 | 12:57 PM

Bigg Boss Telugu 8- Soniya Cheap Comments On Vishnupriya: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ- సోనియా మధ్య జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటిగా వారి మధ్య గొడవలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ గొడవల్లో విష్ణుప్రియాపై సోనియా చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఏంటో చూడండి.

Bigg Boss Telugu 8- Soniya Cheap Comments On Vishnupriya: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ- సోనియా మధ్య జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటిగా వారి మధ్య గొడవలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ గొడవల్లో విష్ణుప్రియాపై సోనియా చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఏంటో చూడండి.

  • Published Sep 11, 2024 | 12:57 PMUpdated Sep 11, 2024 | 12:57 PM
Bigg Boss 8: విష్ణుప్రియ చీర గురించే సోనియా దిగజారుడు మాటలు.. అసలు విషయం ఇదే!

సోనియా ఆకుల.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా నెటిజన్స్ కూడా తెగ తిట్టేసుకుంటున్న పేరు. ఏమంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందో.. మొదటి రోజు నుంచి టన్నుల కొద్దీ నెగిటివిటీని పంచుతోంది. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఒకవేళ వాళ్లు తనకు నచ్చినట్లు ఉండరు అనుకుంటే మాత్రం.. వారిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తోంది. మరీ ముఖ్యంగా విష్ణుప్రియపై అయితే నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తోంది. ఆమె కుటుంబం గురించి కూడా మాటలు అనేసింది. ఇవన్నీ పక్కన పెడితే.. సోనియా దిగజారుడు తనానికి ఈ సినారియో ఒక మచ్చుతునక అని చెప్పాలి. నామినేషన్స్ లో విష్ణుప్రియ గురించి ఎంత దిగజారిపోయి కామెంట్స్ చేసింది అంటే.. అక్కడ జరిగింది ఒకటి అయితే.. ఈమె ఇంకోలా కామెంట్స్ చేసింది. అసలు సంబంధం లేకుండా మాటలు అని విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా చీప్ కామెంట్స్ చేసింది.

సోనియా- విష్ణుప్రియ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదేమో.. నాకు మాత్రం ఫ్యామిలీ చూస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే అది కేవలం సోనియా ఆటకు ట్రైలర్ మాత్రమే. అంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. నామినేషన్స్ సమయంలో విష్ణుప్రియ పర్సనాలిటీ మీద కొన్ని కామెంట్స్ చేసింది. విష్ణుకి డ్రెస్సింగ్ కూడా రాదని.. ఇష్టమొచ్చినట్లు డ్రెస్సులు వేసుకుని అన్ కంఫర్ట్ గా ఫీలవుతున్నా కూడా వారి పక్కనే నిల్చుంటుంది అంటూ చెప్పింది. ఇన్ డైరెక్ట్ గా తన డ్రెస్సింగ్ తో హౌస్ లో ఉన్న కుర్రాళ్లను రెచ్చ గొట్టిద్ది అనే అర్థం వచ్చేలాగానే సోనియా మాటలు ఉన్నాయి. అయితే విష్ణుప్రియ అలా ఎక్కడ చేసింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అలా అన్ కంఫర్ట్ గా ఫీలైన వ్యక్తి ఎవరో కూడా సోనియా రివీల్ చేయలేదు. ఎదుకంటే అసలు అలాంటి ఒక ఘటన జరగలేదు. జరిగింది ఒకటైతే.. సోనియా దానిని మరోలా చూపించింది.

అసలు జరిగింది ఏంటంటే.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కేవలం 3 బాత్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ బాత్ చేసిన తర్వాత అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవాలి అంటే కచ్చితంగా అక్కడ మాత్రం కుదరదు. కానీ, ఎలాగో అక్కడే తిప్పలు పడుతున్నారు. బెడ్ రూమ్ లో వేసుకోవాలి అంటే అన్నీ గ్లాస్ డోర్స్ అయిపోయాయి. కచ్చితంగా లోపల ఎవరు ఉన్నా బయటకు కనిపిస్తుంది. అందుకే బాత్ రూమ్స్ లోనే డ్రెస్సింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆదివారం ఎపిసోడ్ కోసం విష్ణుప్రియ చీర కట్టుకుంది. అయితే వాష్ రూమ్ లో చీర కట్టుకోవడం అనేది అసాధ్యం. అందుకే బెడ్ రూమ్ లో ఇబ్బంది పడుతూనే చీర కట్టుకుంటూ ఉంది.

విష్ణుప్రియ చీర కట్టుకునే సమయంలో పొరపాటున ఆదిత్య ఓం ఆ రూమ్ లోకి వెళ్లాడు. విష్ణుని చూసి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. తర్వాత ఆమె వెళ్లి ఆదిత్యకు సారీ కూడా చెప్పింది. అక్కడితో ఆ విషయం అయిపోయింది. ఆ సమాచారం తెలుసుకున్న సోనియా.. విష్ణుప్రియ గురించి ఇలాంటి దిగజారుడు మాటలు అనేసింది. ఆదిత్య రూమ్ లోకి వెళ్లి వణికిపోయాడు అంటూ నిఖిల్- అభయ్ లకు చెప్పింది. అసలు సంబంధం లేకుండా నామినేషన్స్ లో జరిగింది ఒకటి అయితే.. ఇంకో అర్థం వచ్చేలా మాట్లాడేసింది. ఆడవాళ్ల కోసం పోరాటం చేస్తాను.. అందుకే లా చదివాను అని చెప్పిన సోనియా ఒక అమ్మాయి గురించి ఇంత దిగజారుడు మాటలు ఎలా మట్లాడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సోనియా ఆట తీరు మాత్రం చిరాకు తెప్పించేలాగే ఉంది. ఇప్పటికే సోనియా మీద కావాల్సినంత నెగిటివిటీ వచ్చేసింది. ఇప్పటికైనా సోనియా అసలు విషయం గ్రహిస్తే బాగుంటుందేమో? తనకు ఇంత అవమానం చేసినా కూడా దానిని సింపథీ కోసం వాడుకోకుండా.. డేరింగ్ గా ముందుకు వెళ్తున్న విష్ణుప్రియకు మంచి సపోర్ట్ లభిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet