iDreamPost
android-app
ios-app

నిఖిల్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉంది.. అమ్మాయిలే అసూయ పడేలా..!

  • Published Sep 13, 2024 | 10:53 AM Updated Updated Sep 13, 2024 | 10:53 AM

Bigg Boss Telugu 8- Nikhil Maliyakkal Dance In Saree: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో గొడవలతో హీటెక్కిపోయి ఉంది. అందుకే బిగ్ బాస్ కాస్త కూల్ చేయడానికి స్పిన్ ది బాటిల్ అనే టాస్క్ ఇచ్చాడు. అందులో కంటెస్టెంట్స్ నవ్వులు పూయించారు.

Bigg Boss Telugu 8- Nikhil Maliyakkal Dance In Saree: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో గొడవలతో హీటెక్కిపోయి ఉంది. అందుకే బిగ్ బాస్ కాస్త కూల్ చేయడానికి స్పిన్ ది బాటిల్ అనే టాస్క్ ఇచ్చాడు. అందులో కంటెస్టెంట్స్ నవ్వులు పూయించారు.

  • Published Sep 13, 2024 | 10:53 AMUpdated Sep 13, 2024 | 10:53 AM
నిఖిల్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉంది.. అమ్మాయిలే అసూయ పడేలా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ 3 గొడవలు, 6 ఆర్గుమెంట్లతో హీటెక్కిపోయి ఉంది. ఎవరిని కదిలించినా కూడా కెమెరా స్పేస్ కోసం అవసరం లేకపోయినా కూడా తెగ గొడవలు పడుతూ కనిపిస్తున్నారు. తమ తప్పు ఉన్నా కూడా దబాయించడం మాత్రం బిగ్ బాస్ లోనే చూస్తూ ఉంటాం. లక్కీ చీఫ్ యష్మీని అందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పాలి. ఇంక హౌస్ లో ఏది తప్పు? ఏది ఒప్పు అని చెప్పే పరిస్థితి లేదు. టాస్కులు, డబ్బులు, బువ్వ కోసం గట్టిగానే యుద్ధాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ హౌస్ వాతావరణాన్ని కాస్త తేలిక పరచడానికి ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్ ప్రతి సీజన్ లో ఉంటూనే ఉంటుంది.

బిగ్ బాస్ అంటే ఎప్పుడూ కొట్టుకోవడం, టాస్కులు ఆడటమే కాదు.. ఒక్కోసారి సరదాగా సమయాన్ని గడపడం కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ సీజన్ ఇంటి సభ్యులకు తొలి ఫన్నీ టాస్కు ఇచ్చారు. అందరినీ గార్డెన్ ఏరియాలో గుండ్రంగా కూర్చోబెట్టి ‘స్పిన్ ది బాటిల్’ టాస్క్ పెట్టారు. ఆ బాటిల్ ఎవరివైపు వస్తే.. వాళ్లు ట్రూత్ ఆర్ డేర్ ని సెలక్ట్ చేసుకోవాలి. అలా ట్రూత్ సెలక్ట్ చేసుకుంటే వాళ్లు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డేర్ సెలక్ట్ చేసుకుంటే వారికి చెప్పిన పనిని చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కో ఇంటి సభ్యుడు ఎంచుకున్నది.. చేసిన పనులను చూపిస్తూ ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చాలానే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.

ముఖ్యంగా లక్కీ చీఫ్ యష్మీ డేర్ సెలక్ట్ చేసుకుంటే.. చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంటో చెప్పండి అని వచ్చింది. అప్పుడు తన క్లాన్ సభ్యులు మొత్తం గొల్లున నవ్వేశారు. ఎందుకంటే చెప్పిన అబద్ధాల్లో ఏది పెద్దదో సెలక్ట్ చేసుకోవడం కష్టం అన్నట్లు చెప్పుకొచ్చారు. చికెన్ దొంగతనం చేసి.. తనకి తెలియదు అని బుకాయించిన సందర్భంగా అభయ్ గుర్తుచేశాడు. ఇలా యష్మీ టాపిక్ రాగానే అందరూ పగలబడి నవ్వేశారు. ఇంక నైనికా డేర్ సెలక్ట్ చేసుకుంటే.. ఎవరైనా మేల్ కంటెస్టెంట్ ని తీసుకెళ్లి పూల్ లో పడేయాలి అని శేఖర్ బాషా చెప్పాడు. అందుకని అతడ్నే లాక్కెల్లి పూల్ లో పడేసింది. తను కూడా పడిపోయింది. ఇంక ఆదిత్య ఓం కూడా డేర్ సెలక్ట్ చేసుకున్నట్లు ఉన్నాడు. ఆదిత్యకు లిప్ స్టిక్ వేసి.. బుగ్గలకు కూడా కలర్ వేసి అమ్మాయిలా రెడీ చేశారు. మనోడు పిల్లిలా నడుచుకుంటూ(క్యాట్ వాక్) వస్తుంటే ఇంటి సభ్యులు షాకైపోయారు.

ఇంక అసలు సిసలు సర్ ప్రైజ్ నిఖిల్ ఇచ్చాడు. నిఖిల్ కూడా డేర్ సెలక్ట్ చేసుకున్నట్లు ఉన్నాడు. అందుకని నిఖిల్ కి మేకప్ వేసి.. చీర కట్టి ఒక స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ లా రెడీ చేశారు. వాళ్లు రెడీ చేయడం ఒకెత్తు అయితే.. మనోడు ఇచ్చిన లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో నిఖిల్ అదరగొట్టేశాడు. పైగా ఊరమాస్ స్టెప్పులు వేసి పిచ్చెక్కించాడు. నిఖిల్ పర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. గేమ్ లో కనిపించడం లేదు అంటూ వచ్చిన కామెంట్స్, నెగిటివ్ థాట్స్ మొత్తం ఒక్క టాస్క్ తో కొట్టుకుపోయినట్లు అయ్యింది. మరి.. నిఖిల్ చీర కట్టి స్టెప్పులేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş