Tirupathi Rao
Bigg Boss 8 Telugu- Sonia vs Vishnu Priya- Kirrak Seetha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో గొడవలు అయితే బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా సోనియా చుట్టూ కాంట్రవర్సీలు బాగా తిరుగుతున్నాయి. తాజాగా సీత- విష్ణుప్రియ vs సోనియా గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
Bigg Boss 8 Telugu- Sonia vs Vishnu Priya- Kirrak Seetha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో గొడవలు అయితే బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా సోనియా చుట్టూ కాంట్రవర్సీలు బాగా తిరుగుతున్నాయి. తాజాగా సీత- విష్ణుప్రియ vs సోనియా గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే 3 గొడవలు- 6 ఆర్గుమెంట్లతో పర్వాలేదు అనిపిస్తోంది. సాధారణంగానే బిగ్ బాస్ లో ఆదివారాన్ని ఫన్ డే అంటారు. కానీ, నిజానికి అసలు మజా సోమవారం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్ జరుగుతాయి కాబట్టి. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటే అసలు సిసలైన ఆట ఉంటుంది. అలాగే అక్కడే చాలా మంది వారి ముసుగు తీసి ఆట ఆడతారు. అలాంటి ఒరిజినాలిటీ కంటెంట్, గొడవలు అన్నీ సోమవారం రోజునే జరుగుతాయి. తాజాగా నామినేషన్స్ లో చాలానే రచ్చ జరిగింది. అయితే ఆ నామినేషన్స్ లో సీత- విష్ణు ప్రియ vs సోనియా ఆకుల మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే అసలు ఈ ట్రయాంగిల్ రచ్చలో తప్పు ఎవరిదో చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో కిరాక్ సీత ఎంతో క్లారిటీగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె ఏం మాట్లాడినా కూడా చాలా క్లియర్ గా చెప్తోంది. అలాగే నామినేషన్స్ లో గొడవ వాదన జరిగినప్పుడు సోనియాకికి గట్టిగానే ఇచ్చి పడేసింది. సీత చెప్పిన పాయింట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. ఎందుకంటే పాయింట్ టూ పాయింట్ చాలా బాగా చెప్పింది. అలాగే సోనియాకి మాటల్లో సరైన పోటీ ఇచ్చింది సీత అనే చెప్పాలి. ఒకానొక టైమ్ లో సీత అయితే సోనియా నోరు కూడా మూయించినంత పని చేసింది. ఎక్కడా తగ్గకుండా తాను చెప్పాలి అనుకున్నది చెప్పేసింది. సోనియా హౌస్ లో చాలా రూల్స్ చెప్తోంది.. అదేంటో తను మాత్రం ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదు. సీత విషయంలో సోనియా రెండు నాల్కల ధోరణి కూడా కనిపించింది. మొదట సీతకు మెచ్యూరిటీ లేదు అని చెబుతూనే.. తాను అసలు మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు అంది. మళ్లీ సీతకు మెచ్యూరిటీ రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పడం గమనార్హం. ఇక్కడ సోనియా బాగా దొరికిపోయింది.
విష్ణు ప్రియృ- సోనియా ఆకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అని బాగానే ట్రై చేస్తున్నారు. నిజానికి విష్ణుప్రియకు ఎంతో మంచి ఆపర్చునిటీ వచ్చింది. సోనియాని కార్నర్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని పాపం విష్ణు వాడుకోలేకపోయింది. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించి ఎంతో పద్ధతిగా మాట్లాడింది. ఎక్కడా కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసే మాటలు అస్సలు మాట్లాడలేదు. కానీ, సోనియా మాత్రం నామినేషన్స్ సమయంలో బ్రేక్ దొరికితే అక్కడ కుటుంబాల గురించి కూడా కామెంట్ చేసింది.
మా ఫ్యామిలీ చూస్తుంది.. ఎలా పడితే అలా నేను ఉండలేను అంటూ నీతులు చెప్పింది. కానీ, ఆమెనే నిఖిల్ తో ఎంతో క్లోజ్ గా కనిపించింది. ఈ విషయంలో కూడా సోనియా కేవలం మాటలు చెప్తుంది కానీ, పాటించదు అనే అభిప్రాయాలు, విమర్శలు వస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్య జరిగిన వాదనల్లో, గొడవలో అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్నను లేవనెత్తితే మాత్రం.. కచ్చితంగా సోనియా వైపే ఎక్కువ తప్పులు కనిపిస్తున్నాయి. తాను తప్పితే ఎవరూ మెచ్యూర్ కాదు, ఎవరికీ స్వతహాగా ఆలోచించే అంత బుర్రలేదు అనే ధోరణిలో ఆమె మాటలు ఉంటున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సోనియా మీద నెగిటివిటీ అయితే బాగానే పెరుగుతోంది. మరి.. ఈ ముగ్గురి మధ్య జరిగిన గొడవల్లో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.