iDreamPost
android-app
ios-app

Bigg Boss8: బిగ్ బాస్ హౌస్ లోకి మరో సారి ఆ ముగ్గురు కన్ఫర్మ్..

  • Published Sep 20, 2024 | 6:29 PM Updated Updated Sep 21, 2024 | 8:05 AM

Bigg Boss Season 8 wild Card Entry contestants: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గురించి..ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే.. అక్కడ జరుగుతున్నది మరొకటిలా అనిపిస్తుంది. ఈ క్రమంలో హౌస్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ.. ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bigg Boss Season 8 wild Card Entry contestants: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గురించి..ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే.. అక్కడ జరుగుతున్నది మరొకటిలా అనిపిస్తుంది. ఈ క్రమంలో హౌస్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ.. ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 20, 2024 | 6:29 PMUpdated Sep 21, 2024 | 8:05 AM
Bigg Boss8: బిగ్ బాస్ హౌస్ లోకి మరో సారి ఆ ముగ్గురు కన్ఫర్మ్..

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రియాలిటీ షో.. విజయవంతగా మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికే ఇద్దరు హౌస్ మేట్స్ బై బై చెప్పేశారు . ప్రస్తుతం హౌస్ లో మరీ అంత ఇంట్రెస్టింగ్ గా అయితే ఏమి కొనసాగడం లేదు. ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే.. అక్కడ జరుగుతున్నది మరొకటిలా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో ఓల్డ్ కంటెస్టెంట్స్ రానున్నారని.. ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచేసింది. మరి హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ ఎవరో చూసేద్దాం.

గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి ఎంటర్ అయినా అంబటి అర్జున్.. అప్పటివరకు హౌస్ లో ఉన్న లెక్కల్ని లైన్ లో పెట్టాడు. అసలు ఏ అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి .. డైరెక్ట్ గా టాప్ 5 లో నిలిచాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు మరో అంబటి అర్జున్ అయితే కనిపించలేదు. అలానే అశ్విని కూడా ఉన్నది కొద్దీ రోజులే అయినా కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇక దీనితో ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండనుందని ఆల్రెడీ అందరిని అర్థమైపోయింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈసారి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ కాకుండా ఓల్డ్ కంటెస్టెంట్స్ నే రంగంలోకి దింపనున్నారు. అందులో మొదటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 3 లో మెరిపించిన జబర్దస్త్ రోహిణి.. ఇప్పుడు హౌస్ లో పెద్దగా కామెడీ లేకపోవడంతో.. రోహిణిని పంపిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రోహిణితీతో పాటు.. సీజన్ 4లో అలరించిన ముక్కు అవినాష్. కూడా ఎంట్రీ ఇవ్వనున్నారట.

ఇక ఈ ఇద్దరితో పాటు.. మొట్టమొదటి సీజన్ హౌస్ మెట్ అయినా హరితేజ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మధ్య కాలంలో హరి తేజ సోషల్ మీడియా లో బాగానే వైరల్ అవుతుంది. అలాగే ఆమె అందిస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కనుక హరి తేజ ఎంట్రీ ఇచ్చిందంటే దుమ్ము దులిపేస్తుంది. పైన చెప్పిన ఈ ముగ్గురు అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్. ఇక వీరు కాకుండా రీతూ చౌదరి.. గోరింటాకు ఫేమ్ కావ్య.. కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఇద్దరు కనుక ఎంట్రీ ఇస్తే సీన్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ కావ్య జంట గురించి తెలియనిది కాదు. ఇక రీతూ విష్ణు ప్రియ కూడా జిగిడి దోస్తులు. వీళ్ళు ఎంట్రీ ఇచ్చాకా ఏమౌతుందో చూడాలి. మరి.. బిగ్ బాస్ కి సంబంధించిన ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap