iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: శేఖర్ భాషా ఎలిమినేషన్.. రెండు వారాలకి ఎంత సంపాదించాడంటే?

  • Published Sep 16, 2024 | 1:08 PM Updated Updated Sep 16, 2024 | 1:29 PM

Bigg Boss 8 Shekhar Basha Remuneration: బిగ్ బాస్ 8 నుంచి రెండో వారంలో ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దాంతో అతడు 2 వారాలకు ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Bigg Boss 8 Shekhar Basha Remuneration: బిగ్ బాస్ 8 నుంచి రెండో వారంలో ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దాంతో అతడు 2 వారాలకు ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 16, 2024 | 1:08 PMUpdated Sep 16, 2024 | 1:29 PM
Bigg Boss 8: శేఖర్ భాషా ఎలిమినేషన్.. రెండు వారాలకి ఎంత సంపాదించాడంటే?

బుల్లితెర మెగా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులను అలరిస్తూ రెండో వారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇసారి  కాస్త వెరైటీగా ఈ షో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తొలి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఊహించని విధంగా ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తీసుకొచ్చిన ఓ కొత్త రూల్ వల్ల అతడు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అతడు రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ఎంత సంపాదించాడు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి రెండు వారాలకు శేఖర్ భాషా ఎంత వెనకేశాడు ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ 8లో ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేషన్ ను ఎవ్వరూ ఊహించలేదు. తన కామెడీతో, పంచులతో హౌస్ మెంట్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. రోజురోజుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతూ వచ్చాడు. దాంతో చాలా వారాల పాటు ఇతడు హౌస్ లో ఉండటం ఖాయం అని అందరూ భావించారు. కానీ.. ఊహించని రూల్ వల్ల అతడు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఓటింగ్ లో చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ భాషా నిలిచారు. అయితే ఎలిమినేట్ ఎవరు కావాలి? ఎవరు? హౌస్ లో ఉండాలో ఆడియెన్స్ కాకుండా.. మిగతా కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో సీత తప్ప మిగతా వాళ్లందరు శేఖర్ భాషా హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించారు. దాంతో అతడు హౌస్ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

కాగా.. ఉన్న రెండు వారాలు తన కామెడీతో అందరిని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. అతడి పంచులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఎంటర్ టైన్ చేస్తూనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతూ వచ్చాడు. ఇదే మిగిలిన హౌస్ మెంట్స్ కు అనిపించి ఎలిమినేట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను శేఖర్ భాషా బాగానే వెనకేసినట్లు కనిపిస్తున్నాడు. ఇతడికి వారానికి రూ. 2.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో 2 వారాలకు కలిపి రూ. 5 లక్షల పారితోషికం తీసుకున్నాడట. దాంతో తక్కువ రోజులకే ఎక్కువ మెుత్తం బానే వెనకేశాడే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే శేఖర్ భాషా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మరి శేఖర్ భాషా ఎలిమినేషన్ పై, అతడు తీసుకున్న రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet