Bigg Boss 8: బిగ్ బాస్ లోకి విష్ణు ప్రియ.. ట్రోల్ చేస్తోన్న నెటిజనులు.. కారణమిదే!

Bigg Boss 8 Trolling On Vishnu Priya: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం నాడు ప్రారంభమైంది. ఇక హౌజులోకి కంటెస్టెంట్ గా వెళ్లిన విష్ణు ప్రియపై బయట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వివరాలు..

Bigg Boss 8 Trolling On Vishnu Priya: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం నాడు ప్రారంభమైంది. ఇక హౌజులోకి కంటెస్టెంట్ గా వెళ్లిన విష్ణు ప్రియపై బయట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వివరాలు..

బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం అనగా సెప్టెంబర్ 1 నాడు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుమారు 100 రోజుల పాటు షో జరగనుంది. ఈసారి కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఇవ్వలేదు. ఎప్పటిలానే సీరియల్, సోషల్ మీడియా సెలబ్రిటీలను బిగ్ బాస్ లోకి తీసుకొచ్చారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. జంటలుగా పంపించారు. సీజన్ 8 అన్ లిమిటెడ్ అంటూ ప్రచారం చేసిన షో నిర్వాహకులు అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ డేనే భారీ షాకులు ఇచ్చారు. దానిలో భాగంగా అసలు ఈ సీజన్‌ మొత్తానికి కెప్టెన్ అనేవాళ్లు ఉండరని.. ఎవరికీ ఇమ్యునిటీ కూడా ఉండదని చెప్పారు. నో రేషన్ అని అన్నారు. అంటే టాస్క్‌లు గెలిస్తేనే రేషన్ వస్తుందని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. అలానే ఈ సారి నో ప్రైజ్ మనీ అని మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే ప్రైజ్ మనీ కూడా పెంచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్‌దే అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి వెళ్లారు. వీరిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఉంది. ఈ సారి హౌజ్ లో గ్లామర్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది విష్ణు ప్రియే అని.. అంటే ఆమె చాలా రోజుల పాటు ఉంటుందని అంటున్నారు.  మరి విష్ణు ప్రియ ఎలా ఉంటుందో.. ఏం చేస్తుందో.. ఎలా ఆడుతుందో ఇవన్నీ రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇక పోతే బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన విష్ణు ప్రియ మీద బయట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆమె పాత వీడియోలను వైరల్ చేస్తూ.. అప్పుడలా.. ఇప్పుడిలా.. డబ్బుల కోసమే కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

గతంలో విష్ణు ప్రియ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ..  ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. బయట ప్రపంచం ఎంతో అందంగా ఉంది.. అలాంటప్పుడు బిగ్ బాస్ కు వెళ్లి.. ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి.. మన ఇంట్లో వాళ్లుంటారు.. వాళ్లని చూసుకోవాలి అన్నది. అలానే తాను బిగ్ బాస్ పర్సన్‌ని కానని.. తాను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఆ షో చూడలేదని.. అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయనని.. తాను ఎప్పుడూ ఆ షోకి వెళ్లనని రాసిస్తానంటూ  విష్ణు ప్రియ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాంతో జనాలు కోట్లు ఇచ్చినా వెళ్లను అన్నవు.. మరి ఇది ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ విష్ణు ప్రియ ఓటింగ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అంటున్నారు.

Show comments