iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: విష్ణుప్రియను ఏడిపించేసిన ప్రేరణ.. మరీ ఇంత దారుణమా?

  • Published Sep 18, 2024 | 12:19 PM Updated Updated Sep 18, 2024 | 12:19 PM

Bigg Boss 8 Telugu- Vishnu Priya Cried- Prerna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట కాస్త ఆసక్తిగానే సాగుతోంది. హౌస్ లో గొడవలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ప్రేరణ- విష్ణుప్రియ గొడవ అయితే మరో మెట్టు ఎక్కేసింది.

Bigg Boss 8 Telugu- Vishnu Priya Cried- Prerna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట కాస్త ఆసక్తిగానే సాగుతోంది. హౌస్ లో గొడవలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ప్రేరణ- విష్ణుప్రియ గొడవ అయితే మరో మెట్టు ఎక్కేసింది.

  • Published Sep 18, 2024 | 12:19 PMUpdated Sep 18, 2024 | 12:19 PM
Bigg Boss 8: విష్ణుప్రియను ఏడిపించేసిన ప్రేరణ.. మరీ ఇంత దారుణమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట కాస్త ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే హౌస్ లో ఇప్పుడిప్పుడే అసలు ఎవరు ఏంటి అనేది బయటపడుతోంది. దాదాపుగా అందరూ మాస్కులు తీసేసి ఆడుతున్నారు అనే భావన కలుగుతోంది. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లు కూడా టాస్కుల్లో తెగ కొట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే.. యష్మీ- నిఖిల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నిఖిల్ అయితే యష్మీని అరవకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా యష్మీ తగ్గే టైప్ కాదు అని అందరికీ తెలిసిందే. నిఖిల్ ని కూడా నేను అరుస్తాను అంటూ కేకలు వేసింది. అయితే పక్కకు వెళ్లి అరుచుకో అంటూ విదిలించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడవడం అందరినీ కలచివేసింది.

విష్ణుప్రియ తన ఆటతో, తన మెచ్యూరిటీతో బిగ్ బాస్ హౌస్ లో మంచి పేరు తెచ్చుకుంది. సాధ్యమైనంత వరకు విష్ణు తప్పుగా మాట్లాడటం, ఎవరినైనా రెచ్చగొట్టడం చేయలేదు. తనకు ఆకలి వేసి ఉన్న 5 గుడ్లలో ఒక రెండు గుడ్లు తినింది. అది ఆమె చేసిన మహా పాపం అయిపోయింది. అందుకు ప్రేరణ నామినేషన్స్ లో కూడా గొడవ చేసింది. నామినేట్ చేసి 12 మంది తినాల్సిన గుడ్లలో రెండు గుడ్లు నువ్వు తినేశావ్ అంటూ పాయింట్ చెప్పుకొచ్చింది. అందుకు విష్ణుప్రియ కాస్త బాధ పడింది. ఆ తర్వాత విష్ణు బ్రెయిన్ లెస్ పీపుల్ అనేసింది. అందుకు ప్రేరణ సూపర్ ఫాస్ట్ గా యూజ్ లెస్ పీపుల్ అనేసింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది అనుకున్నారు. కానీ, అది కొనసాగుతూనే ఉంది. ఆ విషయం ఇప్పుడు కిచెన్ దాకా వచ్చేసింది. తిండి విషయంలో ప్రేరణ తనను అవమానించింది అంటూ విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది.

అసలు ఏం జరిగింది అంటే.. ప్రేరణ దోశలు పోస్తోంది. విష్ణుప్రియ కోసం దోశలు తీసుకొచ్చేందుకు నాగ మణికంఠ ప్లేట్ తీసుకెళ్తే ప్రేరణ దోశలు వేసింది. అయితే ఆమె వేసిన విధానం మాత్రం అస్సలు నచ్చలేదు అంటూ విష్ణుప్రియ బాధ పడింది. తినే విషయంలో ఇలా ఎలా చేస్తారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వేసి ఇచ్చిన విధానం.. విసిరేసినట్లుగా చేయడం నచ్చలేదు అంటూ విష్ణుప్రియ ఏడ్చేసింది. ఎవరికైనా ఫుడ్డే కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. వీళ్లిద్దరి మధ్యలో ఉన్న నాగ మణికంఠ కూడా అక్కడి పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రేరణ అతనిపై కూడా అరిచేసింది. యాటిట్యూడ్ చూపించొద్దు అని అంటే.. పో వెళ్లు అంటూ అనేసింది. మొత్తానికి విష్ణుప్రియ అయితే బాగా ఏడ్చేసింది. ఈ విషయంలో ప్రేరణ తప్పు చేసింది అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio