iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: మణికంఠపై ట్రోల్స్.. చెప్పిన స్టోరీలేంటి? చేస్తున్న పనులేంటి అంటూ..

  • Published Sep 18, 2024 | 12:59 PM Updated Updated Sep 18, 2024 | 12:59 PM

Bigg Boss 8 Telugu- Trolls On Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి నాగ మణికంఠ మీద పాజిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పొగిడిన ఆడియన్సే పెదవి విరుస్తున్నారు. మణికంఠ ఆటపై విమర్శలు చేస్తున్నారు.

Bigg Boss 8 Telugu- Trolls On Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి నాగ మణికంఠ మీద పాజిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పొగిడిన ఆడియన్సే పెదవి విరుస్తున్నారు. మణికంఠ ఆటపై విమర్శలు చేస్తున్నారు.

  • Published Sep 18, 2024 | 12:59 PMUpdated Sep 18, 2024 | 12:59 PM
Bigg Boss 8: మణికంఠపై ట్రోల్స్.. చెప్పిన స్టోరీలేంటి? చేస్తున్న పనులేంటి అంటూ..

బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఎప్పుడు హైప్ వస్తుంది? ఎవరు ఎప్పుడు కింద పడిపోతారు అనే విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఎక్కువ శాంత వాళ్ల ప్రవర్తన వల్లే అది జరుగుతుంది. ఒక్కోసారి హౌస్ మొత్తం ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేస్తే మాత్రం అది కాస్త నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. అయితే ఒక్కోసారి కంటెస్టెంట్ గతం కూడా అతనికి ప్లస్ కావచ్చు. పాజిటివిటీని తెచ్చి పెట్టచ్చు. అలాంటి అవకాశం నాగ మణికంఠకు దక్కింది. అతని గతం విని అంతా కనెక్ట్ అయిపోయారు. మొదటి వారం మొత్తం నాగ మణికంఠకు మంచి పాపులారిటీ దక్కింది. ఇంక రెండో వారం సింపథీ అనేది పక్కన పెట్టేసి ఆట మీద ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత అందరూ మెచ్చుకున్నారు. మణికంఠ గాడిలో పడ్డాడు అనుకున్నారు. మళ్లీ గాడి తప్పుతున్న అతని ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

నాగ మణికంఠ హౌస్ లో అందరితో కాస్త కలివిడిగానే ఉంటున్నాడు. అయితే ఎవరితో కలిసి ఉంటాడో వారిని టార్గెట్ చేసినట్లు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. మొదట విష్ణుప్రియతో కలిసి ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత పాయింట్స్ వెతుక్కుని నామినేట్ చేశాడు. ఆ తర్వాత యష్మీతో కలిసి ఉన్నాడు. ఫ్రెండ్ అనే ముసుగులో తన హార్ట్ బ్రేక్ చేశాడు అంటూ యష్మీ కూడా ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఏది అన్ ఫెయిర్ అనడానికి ఉండదు. ఎవరి స్ట్రాటజీ వారిది. అయితే ఇప్పుడు తాజాగా మణికంఠ మీద వస్తున్న విమర్శలు ఏంటంటే.. అతను రాము రెమోలా మారిపోయాడు అంటున్నారు. ఎందుకంటే హౌస్ లో ఉన్న వారికి కిస్సులు, హగ్గులు ఇస్తూ నానా హంగామా చేస్తున్నాడు.

నాగ మణికంఠ సోనియాకి ముద్దు పెట్టాడు. ఆమె సోఫాలో కూర్చుని పాట పాడిన తర్వాత ఆమెకు ముద్దు పెట్టాడు. అక్క అక్క అని పిలుస్తాడు ఆ అభిమానంతో అలా చేశాడు అనుకుందాం. ఆ తర్వాత నైనికా కూర్చుని ఉంటే.. ఆమెను పలకరించి.. నీ వస్తువుల మీద ఈగ కూడా వాలనివ్వను అంటూ హగ్ చేసుకుని తల మీద ముద్దు పెట్టుకుని వెళ్లాడు. ప్రేరణ కుర్చీలో కూర్చుని ఉంటే నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడతావ్ అంటూ హగ్ చేసుకుంటాడు. ఇంక యష్మీ విషయం అయితే వేరే లెవల్. ఆమెను నామినేట్ చేసినందుకు హర్ట్ అయ్యిందని కూల్ చేయడానికి వెళ్లాడు. ఆమెను హగ్ చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె అక్కడ అన్ కంఫర్ట్ గా ఫీలవుతూ వచ్చింది. ఆ విషయాన్ని నేరుగానే చెప్పింది. చేయి తీ అని కూడా అంది. కానీ, మణికంఠ రెండోసారి కూడా హగ్ చేసుకున్నాడు.

ఈ సీన్స్ చూసిన తర్వాత నాగ మణికంఠ ఆట తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఫ్రెండ్ షిప్ అనే ముసుగులో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆడియన్స్ హితవు పలుకుతున్నారు. ఇతని ప్రవర్తన ఇలాగే ఉంటే హౌస్ లో కొనసాగడం దాదాపుగా అసాధ్యం అని చెప్పాల్సింది. నాగ మణికంఠ అస్సలు మనుషులు, రిలేషన్స్ అంటే పడవు అని చెప్పి ఇప్పుడు ఇలా అందరికీ హగ్గులు ఇస్తూ పోతుంటే.. అతను రియలా? ఫేకా అనే అనుమానం వస్తోంది. మరోవైపు యష్మీ అయితే తనకు నచ్చడం లేదు అని చెప్పేస్తోంది. ఇదంతా నాగ మణికంఠకు నెగిటివ్ అయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంది. మరి.. మణికంఠ మారతాడో? కంటిన్యూ చేస్తాడో చూడాలి. నాగ మణికంఠ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom