iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: సోనియా లవ్ స్టోరీ.. కాబోయే వాడిది అమెరికా అంట.. అసలు ట్విస్ట్ ఏంటంటే ?

  • Published Sep 19, 2024 | 12:28 PM Updated Updated Sep 19, 2024 | 12:28 PM

Bigg Boss 8 Telugu- Sonia Love Story: రీసెంట్ గా స్టార్ట్ అయినా తెలుగు బిగ్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. గడిచిన రెండు వారాలలో బాగా హైలెట్ అవుతూ ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే.. ఈ క్రమంలో సోనియా తాజాగా తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అదేంటో చూసేద్దాం.

Bigg Boss 8 Telugu- Sonia Love Story: రీసెంట్ గా స్టార్ట్ అయినా తెలుగు బిగ్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. గడిచిన రెండు వారాలలో బాగా హైలెట్ అవుతూ ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే.. ఈ క్రమంలో సోనియా తాజాగా తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 19, 2024 | 12:28 PMUpdated Sep 19, 2024 | 12:28 PM
Bigg Boss 8: సోనియా లవ్ స్టోరీ.. కాబోయే వాడిది అమెరికా అంట.. అసలు ట్విస్ట్ ఏంటంటే ?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చూస్తూనే ఉన్నాము. ఇక సోషల్ మీడియాలో కూడా.. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు , రొమాన్స్ లు ఇలా అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. వీరిలో ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే. మొదట సోనియా నిఖిల్ మధ్యలో ట్రాక్ నడిచినట్లుగా చూపించారు. ఇక ఇప్పుడైతే అటు నిఖిల్ , ఇటు పృథ్వి ఇద్దరితోను క్లోజ్ గానే ఉంటుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఎపిసోడ్ నిఖిల్ తో తన లవ్ స్టోరీ గురించి హింట్ ఇచ్చింది ఈ అమ్మడు. అదే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా వైఎస్ అంటే ఎవరు.. యష్ వీర్ ఆ అంటూ చెప్పి చెప్పనట్లుగా చెప్పారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సోనియా లవ్ స్టోరీపై క్లారిటీ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో సోనియా ప్రేరణ మాట్లాడుకుంటున్నపుడు.. సోనియా తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. “నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. కానీ, రెండున్నరేళ్లుగా మేము కలిసి వర్క్ చేస్తున్నాం. నేను స్టార్ట్ చేసిన ఎన్‌జీఓకి వెబ్‌సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు. అలానే ఆయన కూడా ఓ స్పాన్సర్. ఆయన నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత చాలా చేంజస్ వచ్చాయి. నా గోల్స్ కు ఇబ్బంది అవుతుందని ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని. కానీ , తను వచ్చాకే అది మారింది”. అంటూ చెప్పుకొచ్చింది. దీనితో ప్రేరణ మరి ఇందులో అంత కాంప్లికేషన్ ఏముంది.. పెళ్లి చేసుకొవచ్చుగా అని చెప్పింది. “అతనికి ఇప్పటికీ డిపెండెన్సీ ఉంది. అతను నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే ” అంటూ చెప్పుకొచ్చింది. మరి డిపెండెన్సీ ఏంటి అని ప్రేరణ అడుగుగా.. సోనియా ఆమె చెవిలో ఎదో గుసగుసలాండింది. దీనితో ప్రేరణ వెరీ నైస్ క్యూట్.. నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది అంటూ చెప్పింది. ఇంతకీ ఆ చెవిలో చెప్పిన మ్యాటర్ ఏంటంటే యష్ వీర్ కు ఆల్రెడీ డైవర్స్ అయింది. కానీ ఇప్పటికి కాస్త డిపెండెన్సీ ఉన్నట్లు.. అది అంతా క్లియర్ అయ్యాకా తన డెసిషన్ చెప్పనున్నట్లు చెప్పుకొచ్చింది సోనియా.

ఇక నిన్నటి ఎపిసోడ్ తో సోనియా లవ్ స్టోరీ కాస్త అందరికి తెలిసిపోయింది. మరి ఈ డిస్కషన్ ఎందాకా దారి తీస్తుందో చూడాలి. ఒకవేళ ఫ్యామిలీ వీక్ వరకు సోనియా ఉంటే కనుక.. యష్ వీర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకావం కూడా లేకపోలేదు . నాగార్జున యష్ వీర్ టాపిక్ తీసిన దగ్గర నుంచి.. సోషల్ మీడియాలో సోనియా-యష్ వీర్ ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి . ఇక ప్రస్తుతం సోనియా చెప్పిన లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటె మరో వైపు హౌస్ లోను సోనియాతో ఒకటి రెండు ట్రాక్స్ నడుస్తున్నాయి. కానీ ఏది క్లారిటీ లేదు. రోజులు గడిచే కొద్దీ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతాయో.. ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరో ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరి సోనియా చెప్పిన లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş