iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నిఖిల్ కి జ్ఞానోదయం.. దెబ్బకు టైటిల్ రేసులోకి వచ్చేశాడు..

  • Published Sep 21, 2024 | 5:09 PM Updated Updated Sep 21, 2024 | 5:09 PM

Bigg Boss 8 Telugu- Nikhil Serious On Soniya: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే హౌస్ లో చాలా మంది మైండ్ గేమ్స్ ఆడుతూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నిఖిల్ మీద మైండ్ గేమ్స్ బాగా ఆడుతున్నారు. అయితే ఇప్పుడు అంతా మారిపోయినట్లు కనిపిస్తోంది. నిఖిల్ ట్రాక్ లోకి వచ్చేశాడు.

Bigg Boss 8 Telugu- Nikhil Serious On Soniya: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే హౌస్ లో చాలా మంది మైండ్ గేమ్స్ ఆడుతూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నిఖిల్ మీద మైండ్ గేమ్స్ బాగా ఆడుతున్నారు. అయితే ఇప్పుడు అంతా మారిపోయినట్లు కనిపిస్తోంది. నిఖిల్ ట్రాక్ లోకి వచ్చేశాడు.

  • Published Sep 21, 2024 | 5:09 PMUpdated Sep 21, 2024 | 5:09 PM
Bigg Boss 8: నిఖిల్ కి జ్ఞానోదయం.. దెబ్బకు టైటిల్ రేసులోకి వచ్చేశాడు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట నిజంగానే ఆసక్తిగా మారుతోంది. ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ అంతా సొంత ఆట, సొంత నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్ట్రాంగెస్ట్ హౌస్ మేట్ నిఖిల్ మలియక్కల్ ఆట ఎలా దారి తప్పిందో చూశాం. మొదటి రెండ్రోజులు నిఖిల్ ఆట చూస్తే టైటిల్ కొట్టేస్తాడు అని అంతా భయపడిపోయారు. కానీ, ఎప్పుడైతే నిఖిల్ డౌన్ అయ్యాడో అప్పుడు హౌస్ లో ఉన్న వాళ్లంతా సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిఖిల్ అయితే ఎవరు ఏం చెప్పినా వినేస్తున్నట్లు కనిపించాడు. ఆ మాట సోనియా కూడా అనేసింది. నిజానికి అలా అవ్వడానికి కారణం సోనియా అని ఆమెకు కూడా తెలుసు. ఇంట్లో ఉన్నవాళ్లు అంతా నిఖిల్ డౌన్ అయిపోయాడు అని అంటూనే ఉన్నారు. అందుకు కారణమైన సోనియాకి నిఖిల్ దూరం కాబోతున్నాడు అని అర్థమవుతోంది.

నిఖిల్ హౌస్ లో తన ఆట ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు అని చూస్తేనే తెలిసిపోతుంది. ముఖ్యంగా సోనియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాడు. ఆ విషయంలో తన క్లాన్ సభ్యులు కూడా అంత పాజిటివ్ గా లేరు. నిఖిల్ ఆటను సోనియా ఆగం చేస్తోంది అని ముందు నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ విషయంలో నిఖిల్ కి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. సోనియా విషయంలో కాస్త కఠిన నిర్ణయం తీసుకోవాలి అని నిఖిల్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. నిఖిల్ మాటలు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంక సోనియా చెప్పిందల్లా చేయడానికి తాను రెడీగా లేను అనే విషయాన్ని అయితే క్లియర్ గా చెప్పేశాడు. అభయ్ తో కూర్చుని ఉన్నప్పుడే ఈ డైలాగ్స్ అన్నీ చెప్పాడు. తను ఎవరు నా లైఫ్ ని కంట్రోల్ చేయడానికి అని క్వశ్చన్ కూడా చేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. నిఖిల్- సోనియా మధ్య చిన్న విషయం నడుస్తోంది. అతని అలవాట్ల గురించి సోనియా మార్చుకోమని చెబుతున్నట్లు కనిపించింది. అందుకోసం అన్నం కూడా తనిలేదు అని అర్థమవుతోంది. ఆ గొడవకి సంబంధించి అందరి ముందు డిస్కస్ చేయడం నిఖిల్ కి నచ్చలేదు. ఆమె భోజనం చేయలేదు అని వెళ్లి తిన్నావా అని అడుగుతాడు. అందుకు సోనియా కాస్త వెటకారంగా రియాక్ట్ అయ్యింది. అందరికంటే లాస్ట్ లో తింటాడు. ఏంటో వచ్చి తిన్నావా అని అడిగితే నేను తినేయాలా? అసలు పెద్ద సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. నేను ఒక రెండ్రోజులు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ, దేనికిలే అని మాట్లాడుతున్నాను అంటూ సోనియా కామెంట్స్ చేసింది. ఆ తర్వాత అభయ్ తో నిఖిల్ తన మనసులో ఉన్న మాటలు చెప్పుకొచ్చాడు.

సోనియా తనని కంట్రోల్ చేయాలి అని చూస్తోంది అనిపిస్తున్నట్లు నిఖిల్ చెప్పాడు. తను ఎలా ఉండాలో సోనియా ఎలా డిసైండ్ చేస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను ఎప్పుడు తినాలి? ఏం అలవాట్లు మానుకోవాలి అనేది తను డిసైడ్ చేయకూడదు కదా అని తన మనసులో ఉన్న మాటను నిఖిల్ బయటపెట్టాడు. ఇక్కడే నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోనియా వల్లే నిఖిల్ గేమ్ డల్ అయ్యిందని.. ఇప్పటికి నిఖిల్ కి జ్ఞానోదయం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై నిఖిల్ ఆట దూసుకుపోతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. నిఖిల్ మలియక్కల్ నిజంగానే సోనియా మాయలో ఉన్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş