iDreamPost
android-app
ios-app

Naga Manikanta: నాగమణికంఠ భార్యపై దారుణైన ట్రోల్స్.. నెటిజన్లపై అతడి చెల్లెలు ఫైర్!

  • Published Sep 11, 2024 | 9:53 PM Updated Updated Sep 11, 2024 | 9:53 PM

Naga Manikanta: బిగ్ బాస్ సీజన్ 8లో నాగమణికంఠ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. అయితే ఆయన భార్యపై మాత్రం విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నాగమణికంఠ సోదరి..తన వదినకు మద్దతుగా నెగిటీవ్ కామెంట్స్ పెట్టిన వారిపై ఫైర్ అయ్యింది.

Naga Manikanta: బిగ్ బాస్ సీజన్ 8లో నాగమణికంఠ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. అయితే ఆయన భార్యపై మాత్రం విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నాగమణికంఠ సోదరి..తన వదినకు మద్దతుగా నెగిటీవ్ కామెంట్స్ పెట్టిన వారిపై ఫైర్ అయ్యింది.

  • Published Sep 11, 2024 | 9:53 PMUpdated Sep 11, 2024 | 9:53 PM
Naga Manikanta: నాగమణికంఠ భార్యపై దారుణైన ట్రోల్స్.. నెటిజన్లపై అతడి చెల్లెలు ఫైర్!

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే తొలివారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యిన సంగతి తెలిసింది. ఇది ఇలా ఉంటే. ఈసారి బిగ్ బాస్ హోస్ లోకి వెళ్లిన వారిలో నాగమణికంఠ ప్రత్యేకంగా ఉన్నాడు. కారణం..హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే రోజే..తన స్టోరీ చెప్పి..అందరినీ ఎమోషనల్ చేశాడు. ఇదే సమయంలో ఆయన భార్య గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. కొన్ని రోజుల తరువాత ఇటీవలే నాగమణికంఠ భార్య శ్రీ ప్రియ ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కాస్తా లావుగా ఉంటుంది. దీంతో నాగమణికంఠ భార్యపై పలువురు ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో తన వదినపై వస్తున్నట్రోల్స్ పై అతడి సోదరి కావ్య అమర్ నాథ్ ఫైర్ అయ్యింది.

సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అన్నావదినలపై ఓ వీడియో వైరల్ అవుతూ తన దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆ వీడియోకు వచ్చిన నెగెటీవ్ కామెంట్లు చూస్తే.. చాలా బాధేసిందని తెలిపింది. కితకితలు సినిమా రెండో పార్ట్ చూసినట్లు ఉందంటూ కొందరు కామెంట్స్ చేశఆరని తెలిపింది. తన వదిన గురించి ఏం తెలుసని కామెంట్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. ఎదుటి వ్యక్తి శరీరం గురించి జోకులు వేయడం సరైనది కాదని, హీనమైన చర్య అంటూ కావ్య అమర్ నాథ్ పైర్ అయ్యారు. తన వదిన సౌందర్యవతి అని, ఆమె మనస్సు ఎంతో అందమైనదని తెలిపింది.

ఆమె ప్రేమ, బలం, దయాగుణం..ఇలాంటి ఎన్నో లక్షణాలు ఆమెను మరింత అందంగా మలించాయని తెలిపింది. తన కోసం ఎప్పుడూ తన వదిన ఓ తల్లిలా నిలబడిందని చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్ చేయడం ఆపేయండని, ప్రతి ఒక్కరూ ఆయా కోణంలో అందంగానే ఉంటారని తెలిపింది. ఈ నెగిటీవ్ కామెంట్స్ పక్కన పెట్టి ప్రేమను పంచండి. ఎదుటి ఎలా ఉన్నరన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెసుకుని ప్రశంసిండి అంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక నాగమణికంఠ విషయానికి వస్తే బిగ్ బాస్ 8లోకి పదవ కంటెస్టెంట్ గా వెళ్లాడు.  ప్రస్తుతం హౌస్ లో  తనదైన తీరులో ఆడుతూ..ముందుకు సాగుతున్నాడు. ఇక అతడి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన పడిన కష్టాలు మరెవరు పడి ఉండరు. పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడం, తల్లి వేరే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె రెండో భర్త మణికంఠ విషయంలో సరిగ్గా ఉండపోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే.. నాగ మణికంఠ తల్లి  2019లో క్యాన్సర్ కారణంగా మరణించింది. ఇలాంటి బాధలోఉండగానే..అతడి జాబ్ రావడం, ఆమెరికా వెళ్లడం జరిగింది.

అదే సమయంలో మణికంఠకు వివాహం జరిగి.. ఓ పాప జన్మించింది. అయితే కొంతకాలం తరువాత నాగ మణికంఠ దంపతుల మధ్య విబేధాలు వచ్చి..విడిపోయారు. అతడు ఇండియాకు వచ్చి.. సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు సంపాదించాడు. ఇలా పాతికేళ్ల జీవితంలోనే అనేక కష్టనష్టాలను చూశాడు. హస్ లోకి  వెళ్లిన తరువాత తన భార్య గురించి అనేక విషయాలు చెప్పాడు. మొత్తంగా ఆమె నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ఎంతో కృషి చేసింది. మరీ.. నాగమణికంఠ సోదరి పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kavya Amarnadh (@kavya_amarnadh)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet