iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: వరంగల్ కుర్రాడు నబీల్ vs ప్రేరణ.. గొడవలో తప్పు ఎవరిదంటే?

  • Published Sep 17, 2024 | 2:11 PM Updated Updated Sep 17, 2024 | 2:11 PM

Bigg Boss 8 Telugu- Nabeel vs Prerana Who Is Right: బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మూడో వీక్ నామినేషన్స్ లో నబీల్- ప్రేరణ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో నబీల్ బాగా హైలెట్ అయ్యాడు. కాస్త అంటే కాస్త కూడా జంకకుండా ప్రేరణకు మాత్రమే కాకుండా హౌస్ మేట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu- Nabeel vs Prerana Who Is Right: బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మూడో వీక్ నామినేషన్స్ లో నబీల్- ప్రేరణ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో నబీల్ బాగా హైలెట్ అయ్యాడు. కాస్త అంటే కాస్త కూడా జంకకుండా ప్రేరణకు మాత్రమే కాకుండా హౌస్ మేట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

  • Published Sep 17, 2024 | 2:11 PMUpdated Sep 17, 2024 | 2:11 PM
Bigg Boss 8: వరంగల్ కుర్రాడు నబీల్ vs ప్రేరణ.. గొడవలో తప్పు ఎవరిదంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సోమవారం అంటే ఫన్ డేనే. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్ ఉంటాయి. ఈ వారం నామినేషన్స్ కూడా వాడీ వేడిగానే సాగాయి. ఒకరిపై ఒకరు నోరేసుకు పడిపోయారు. ఒకరంటే ఒకరికి ఎంత కోపం ఉందో ఈ నామినేషన్స్ లో చూపించేశారు. ముఖ్యంగా వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిదీ బాగా హైలెట్ అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే అతను చెప్పాలి అనుకున్న పాయింట్ ని క్లియర్ గా చెప్పేశాడు. అలాగే ప్రేరణతో గట్టి గొడవే జరిగింది. ఇద్దరూ కాసేపు కేకలు కూడా వేసుకున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? ఆ గొడవలో తప్పు ఎవరిది? నబీల్ చెప్పిన పాయింట్స్ కరెక్టేనా? చూద్దాం.

నబీల్ కి ప్రేరణతో గొడవ స్టార్ట్ అయ్యింది సాక్స్ టాస్కులో అనే చెప్పాలి. ఆ టాస్క్ తర్వాత చాలా మంది మధ్య గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రేరణ చాలా మందికి ఎనిమీగా మారిపోయింది. ఆ టాస్కు వల్ల నామినేషన్స్ లో కూడా నిలిచింది. ముఖ్యంగా నబీల్ కి ఆ టాస్కులో అన్యాయం జరిగింది అని అందరం చూశాం. అదే పాయింట్ మీద నబీల్ ప్రేరణను నామినేట్ చేశాడు. అందుకు ప్రేరణ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. కానీ, నబీల్ పాయింట్ కరెక్ట్ అని అందరికీ తెలుసు. అక్కడే ప్రేరణ కాస్త వాయిస్ రైజ్ చేసింది. ఇంక నబీల్ కి తిక్క లేచింది. అరిస్తే గెలుస్తాం అంటే.. ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అంటూ కేకలు వేశాడు. అయితే అరువు అంటూ ప్రేరణ కాస్త రెచ్చగొట్టింది.

సాధారణంగానే నబీల్ కి కాస్త సహనం ఎక్కువ అని అందరికీ తెలిసిందే. అతను మొదటి నుంచి ఎంతో పేషన్స్ ని అయితే ప్రదర్శిస్తున్నాడు. ఎక్కడా కూడా అనవసరంగా నోరు పారేసుకున్న సందర్భం అయితే లేదు. కానీ, ఈసారి నబీల్ కాస్త గట్టిగానే మాట్లాడాడు. ప్రేరణ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆమె అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే కాస్త ఫన్నీ ఇమిటేషన్స్ కూడా చేశాడు. ప్రేరణ కూడా కేకలు వేసింది. అయితే నబీల్ ను ఇన్ని రోజులు సైలెంట్ గా తన ఆట తాను ఆడుకుంటూ పోయే కుర్రాడు అనుకున్నారు. కానీ, తాను ఆటే కాదు.. వేట కూడా చేయగలడు అని హెచ్చరిక అయితే జారీ చేశాడు. తన జోలికి వస్తే.. ఎవరైనా సరే ఊరుకునేది లేదు అంటూ నబీల్ మెసేజ్ పాస్ చేశాడు.

నబీల్ హెచ్చరిక కేవలం ఒక్క ప్రేరణకు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరికీ కూడా నబీల్ ఒక మేసేజ్ అయితే పంపాడు. నోరేసుకు పడిపోతే తానేమీ దడుచుకునే టైప్ కాదు అంటూ చెప్పాడు. నామినేషన్స్ మొత్తంలో నబీల్ వర్సెస్ ప్రేరణ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ గొడవలో నబీల్ తప్పు ఏమీ కనిపించలేదు. తనకు ప్రేరణ వల్ల అన్యాయం జరిగింది. అదే పాయింట్ తో నామినేట్ చేశాడు. టోటల్ ఫెయిర్ అనే అనిపించింది. మరి.. నబీల్- ప్రేరణ గొడవలో ఎవరిది తప్పు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş