iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: వీడియో: హౌస్ కి టార్గెట్ అయిన సోనియా.. పోరాడి గెలుస్తుందా?

  • Published Sep 19, 2024 | 12:16 PM Updated Updated Sep 19, 2024 | 12:16 PM

Bigg Boss 8 Telugu- Housemates Targeted Soniya Akula: బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు వచ్చాయంటే గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక క్లాన్ మీద ఒకరు విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సందర్భం లేకపోయినా కూడా మాటలు జారేస్తున్నారు.

Bigg Boss 8 Telugu- Housemates Targeted Soniya Akula: బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు వచ్చాయంటే గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక క్లాన్ మీద ఒకరు విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సందర్భం లేకపోయినా కూడా మాటలు జారేస్తున్నారు.

  • Published Sep 19, 2024 | 12:16 PMUpdated Sep 19, 2024 | 12:16 PM
Bigg Boss 8: వీడియో: హౌస్ కి టార్గెట్ అయిన సోనియా.. పోరాడి గెలుస్తుందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లిస్ట్ తీస్తే.. సోనియా పేరు కచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు హౌస్ లో సోనియా ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్ లాగానే కనిపించింది. కానీ, ఎప్పుడైతే నాగార్జున కాస్త జాగ్రత్తగా ఆడమంటూ హింట్ ఇచ్చారో అప్పటి నుంచి సోనియా కాస్త దూకుడు తగ్గించింది అనే చెప్పాలి. ఆటలో కావచ్చు.. మాటలో కావచ్చు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే సోనియా ఇప్పుడు హౌస్ లో చాలామందికి టార్గెట్ గా మారిపోయింది. అవకాశం దొరికితే ఆమెపై విజృంభించేందుకు అంతా రెడీగా ఉన్నారు. తన టీమ్ మెంబర్ అనుకున్న అభయ్ కూడా సోనియాకి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ప్రభావతి 2.0 టాస్క్ లో సోనియా హౌస్ మొత్తానికి టార్గెట్ అయినట్లు కనిపిస్తోంది.

ప్రభావతి 2.0 ఆటకు సంబంధించి మొదటి రౌండ్ లో శక్తి క్లాన్ 66 ఎగ్స్ కలెక్ట్ చేశారు. అలాగే కాంతారా క్లాన్ 34 ఎగ్స్ కలెక్ట్ చేశారు. ఈ టాస్క్ ఇంకా కొనసాగుతోంది. ఇందులో ఎక్కువ మంది ఫిజికల్ కూడా అవుతున్నారు. అలాగే ఎక్కువ పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. మొదటి రౌండ్ లో విజయం సాధించినందుకు శక్తి క్లాన్ కు స్పెషల్ పవర్ దక్కింది. ఆ పవర్ తో కాంతారా క్లాన్ నుంచి నబీల్ ని తప్పించారు. శక్తి క్లాన్ మరింత పవర్ ఫుల్ గా మారిపోయింది. ఈ ఆటలో ఫిజికల్ ఎక్కువ అవుతున్నారు అని.. ఒకరి ఎగ్స్ జోలికి ఒకరు రావొద్దు అని రూల్ పెట్టుకున్నారు. అందుకే కాంతారా క్లాన్ వాళ్ల బుట్టలను వదిలేసి వెళ్లారు. కానీ, సోనీయా మాత్రం వెళ్లి వాళ్ల గుడ్లను తీసుకొచ్చింది. దాంతో అసలు గొడవ స్టార్ట్ అయ్యింది.

తాజా ప్రోమో చూస్తే.. అభయ్ కూడా సోనియా గురించి ప్రేరణతో డిస్కస్ చేయడం చూశాం. నిఖిల్ ఇటు రావొద్దు.. మేము రాము అని చెబుతుంటే.. సోనియా అలా చెప్పద్దు అంటూ ఆపుతోంది అని చెప్పాడు. అలాగే సంచాలక్ గా ఉన్న నబీల్ రూల్స్ చెబుతున్నప్పుడు సోనియా కాస్త గట్టిగా మాట్లాడింది. ఇంక నబీల్ కూడా సీరియస్ అయ్యాడు. బెదిరించినట్లు చెప్పకు.. మెల్లగా చెప్పు నేను వింటాను అంటూ క్లాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత సీతతో కూడా నబీల్ సోనియా గురించి డిస్కస్ చేస్తూ కనిపించాడు. ఆమెను కావాలంటే అండి అని పిలుస్తాను. అంతేగానీ.. ఇలా పెద్దగా అరవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు.

యష్మీ కూడా సోనియాపై రెండ్రోజులుగా సీరయస్ గా ఉంది. మీరు తీసుకెళ్తే మేం తీసుకెళ్లమా అంటూ వాళ్ల బుట్టను తీసుకెళ్లింది. ఆ తర్వాత యష్మీ- నిఖిల్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. ప్రేరణ కూడా అక్కడ మావాళ్లు ఎవరూ లేరు అని చెప్పింది. కానీ, సోనియా మొత్తం ఎగ్స్ తీసుకోవడంతోనే గొడవ స్టార్ట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు హౌస్ లో ఉన్న మెజారిటీ సభ్యులకు సోనియా టార్గెట్ గా మారిపోయింది. మరి.. ఈ యుద్ధంలో సోనియా నిలబడుతుందా? నిలబడి గెలుస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom