iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: సోనియాకి సరైన పోటీ యష్మీనే.. ఒక్క మాటతో నోరు మూయించేసింది..!

  • Published Sep 17, 2024 | 2:55 PM Updated Updated Sep 17, 2024 | 2:55 PM

Bigg Boss 8 Telugu- Big Fight Between Yashmi And Sonia Akula: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో కొత్త యుద్ధం అయితే మొదలైంది. సోనియా- యష్మీ మధ్య నామినేషన్స్ లో బిగ్ ఫైట్ జరిగింది. మరి.. ఈ యుద్ధంలో ఎవరు కరెక్టో చూద్దాం.

Bigg Boss 8 Telugu- Big Fight Between Yashmi And Sonia Akula: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో కొత్త యుద్ధం అయితే మొదలైంది. సోనియా- యష్మీ మధ్య నామినేషన్స్ లో బిగ్ ఫైట్ జరిగింది. మరి.. ఈ యుద్ధంలో ఎవరు కరెక్టో చూద్దాం.

  • Published Sep 17, 2024 | 2:55 PMUpdated Sep 17, 2024 | 2:55 PM
Bigg Boss 8: సోనియాకి సరైన పోటీ యష్మీనే.. ఒక్క మాటతో నోరు మూయించేసింది..!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పేరు అయినా ఎక్కువ వినిపిస్తుంది అంటే అది సోనియా అనే చెప్పాలి. ఫస్ట్ వీక్ నుంచి సోనియా ఆకుల పేరు బాగా వైరల్ అవుతూనే వచ్చింది. అయితే ఎక్కువ భాగం నెగిటివిటీ సైడ్ ఉండటం కాస్త ఇబ్బంది పెట్టే అంశం అనే చెప్పాలి. అయితే సోనియాతో నేరుగా యుద్ధం చేయడానికి ఎవరూ అంత ప్రయత్నించలేదు. ఒక్క విష్ణుప్రియానే ప్రత్యక్ష యుద్ధం చేసింది. ఆ తర్వాత సోనియానే తగ్గి ఆమెతో మంచిగా ఉండటం స్టార్ట్ చేసింది. కానీ, ఆ తర్వాత ఇప్పుడు హౌస్ లో ఇంకొకరు యష్మీతో యుద్ధానికి రెడీ అయ్యారు అంటే అది యష్మీ అనే చెప్పాలి. నిజానికి విష్ణు నేరుగా సోనియాని కంట్రోల్ చేయలేకపోయింది. కానీ, యష్మీ మాత్రం ఒకే ఒక్క డైలాగ్ సోనియా నోరు మూయించేసినంత పని చేసింది. అసలు వీళ్ల మధ్య జరిగిన గొడవ ఏంటో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే వారితో కయ్యానికి కాలు దువ్వడానికి సాధ్యమైనంత వరకు ఎవరూ ప్రయత్నాలు చేయరు. ముఖ్యంగా సోనియాలాంటి భయంకరమైన ఆర్గుమెంటల్ స్కిల్స్ ఉన్న వారితో అయితే అస్సలు గొడవకు దిగరు. కానీ, అనుకోకుండానే యష్మీ వర్సెస్ సోనియా అయితే హౌస్ లో స్టార్ట్ అయిపోయింది. సోనియా అయితే యష్మీని చాలా తక్కువ అంచనా వేసి ఆమెను టచ్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే యష్మీ చిన్న బుర్ర కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వదు అనుకున్నట్లు అనిపించింది. కానీ, ఏకంగా సోనియానే డైరెక్ట్ అటాక్ చేసేసింది. ఒకే ఒక్క డైలాగ్ తో సోనియాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెప్పాలి. అస్సలు ఎక్కడా తగ్గకుండా యష్మీ నేరుగా సోనియా మీద యుద్ధం చేసింది. అందరూ సోనియాకి కొత్త టార్గెట్ దొరికింది అనుకుంటున్నారు. కానీ, యష్మీకి సోనియా టార్గెట్ అయిపోయింది అని అర్థం చేసుకోవడం లేదు.

సోనియాకి సంబంధించి హౌస్ లో ఇన్వాల్మెంట్ కంటే కూడా.. నిఖిల్- పృథ్వీ- అభయ్ లతో డిస్కషన్స్ మీదే ఎక్కువ ఆసక్తి ఉంది. ఆ విషయాన్ని హౌస్ లో ఉన్న ఎవరూ కూడా చెప్పేందుకు ధైర్యం చేయలేదు. కానీ, యష్మీ మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండానే.. తనని చీఫ్ గా ఫెయిల్ అయ్యావు అని చెప్పిన సోనియాకి.. నువ్వు అసలు ప్రయత్నమే చేయలేదు కదా అని కౌంటర్ ఇచ్చింది. నువ్వు కనీసం టాస్కుల్లో గానీ, చీఫ్ అయ్యేందుకు గానీ ఎక్కడా ఎఫర్ట్స్ పెట్టలేదు. కానీ, నేను చీఫ్ అవ్వడమే కాదు.. అందరికీ రేషన్ కూడా తెచ్చిపెట్టాను అంటూ యష్మీ చెప్పింది. అంతేకాకుండా.. నీకు టాస్కుల మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? నిఖిల్- అభయ్- పృథ్వీతో డిస్కషన్స్ మీదే ఇంట్రెస్ట్ మొత్తం ఉంది.. అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ పాయింట్ మీద కనీసం సోనియా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆ పాయింట్ టచ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలుసు కాబట్టి. మొత్తానికి సోనియాకి కౌంటర్ ఇచ్చే ఒక కంటెస్టెంట్ అయితే హౌస్ లో ఉంది అని అర్థమైంది. మరి.. సోనియా- యష్మీ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom