Bigg Boss 8: అభయ్ నవీన్ ఎలిమినేషన్! ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచింది..

Bigg Boss 8 telugu- Abhay Naveen Elimination: అభయ్ నవీన్ హౌస్ నుంచి ఎలిమినేషన్ తప్పదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతని మాటలు మాతమేర కాదు.. అభయ్ నవీన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంప ముంచింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు అభయ్ నవీన్ చేసిన తప్పేంటి?

Bigg Boss 8 telugu- Abhay Naveen Elimination: అభయ్ నవీన్ హౌస్ నుంచి ఎలిమినేషన్ తప్పదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతని మాటలు మాతమేర కాదు.. అభయ్ నవీన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంప ముంచింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు అభయ్ నవీన్ చేసిన తప్పేంటి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారానికి సంబంధించి నామినేషన్స్ లో మొత్తం 8 మంది ఉన్నారు. ఏడుగురు ఇంటి సభ్యులు ఓట్లు వేయడం వల్ల వచ్చారు. కానీ, చీఫ్ గా ఉన్న అభయ్ నవీన్ మాత్రం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. నిజానికి నిఖిల్ నామినేషన్స్ లోకి వెళ్లి ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేవాడు. కానీ, అభయ్ రెండు నిమిషాలు కూడా ఆలోచన చేయకుండా.. నామినేట్ అవ్వు అని అడక్కుండానే నేను నామినేట్ అవుతాను. నా ఫాలోయింగ్ ఏంటో చూసుకోవాలి అన్నాడు. మరి ఆ ఫాలోయింగ్ వర్కౌట్ అయ్యిందా? అసలు అభయ్ నవీన్ ఎలిమినేషన్ జరుగుతుందా? సీక్రెట్ రూమ్ లో ఏమైనా పెడతారా? ఏం జరగబోతోందో చూద్దాం.

అభయ్ నవీన్ మొదటి రెండు వారాలు చాలా బాగా ఆడాడు. ఎంతో మెచ్యూర్డ్ గా కనిపించాడు. ఇంట్లో సభ్యులు కూడా అదే చెప్పారు. అభయ్ నవీన్ ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు అని కితాబు ఇచ్చారు. అందుకే ఎక్కువ మంది ఇంటి సభ్యులు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ, చీఫ్ అయిన తర్వాత అభయ్ నవీన్ ఆట తీరే కాదు.. మాట తీరు కూడా మారిపోయింది. ఎందుకో గేమ్ విషయంలో చిల్ అయిపోయాడు అనిపించింది. పోరాడాల్సిన దగ్గర వేదాంతం వల్లిస్తున్నాడు. అసలు గేమ్ లో పోరాడకుండా కెమెరాలు ఉన్నాయిలే చూసుకుంటాయి అంటూ కూర్చుండి పోయాడు. తన టీమ్ లో ఉన్న అమ్మాయిలు ప్రాణం పెట్టి ఆడుతుంటే.. అభయ్ మాత్రం సోఫాలో, కుర్చీలో కూర్చుని రూల్స్ చెప్తున్నాడు. అమ్మాయిలు దెబ్బలు కూడా తిని తెచ్చిన గుడ్లను కాపాడలేకపోయాడు.

చాలా మంది అనుకుంటూ ఉండచ్చు.. బిగ్ బాస్ ని తిట్టిన తర్వాత అభయ్ ని హౌస్ లో ఉంచరు అని. నిజానికి అభయ్ నవీన్ నామినేషన్స్ లోకి వచ్చినప్పటి నుంచి డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. బిగ్ బాస్ కి సంబంధించి సడెన్ గా నామినేషన్స్ లోకి వచ్చేవాళ్లు సేవ్ అవ్వడం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో తరచూ ఆడియన్స్ కంట్లో పడితేనే ఓట్లు పడతాయి. అంతేకాకుండా.. ఆట మీద కూడా ఆధారపడి ఉంటుంది. మూడోవారంలో హౌస్ లో అభయ్ ఆడింది ఏమీ లేదు. ఎక్కడా కూడా పోరాటం చేసింది లేదు. అందుకే అభయ్ కి అంత స్థాయిలో ఓట్లు పడినట్లు అనిపించలేదు. దానికి తోడు నోటికి పని చెప్పి ఇష్టారీతిన మాటలు జారాడు. బిగ్ బాస్ ని మాత్రమే కాకుండా.. షోని, టాస్కులను కండక్ట్ చేసే వారిని, ఎడిటింగ్ చేసేవారిని కూడా వదలకుండా నోటికొచ్చింది వాగేశాడు.

ఏదో సరదాకి అన్నాను అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, అన్నిసార్లు అన్న తర్వాత అది సరదాగా అన్నట్లు ఎక్కడా అనిపించలేదు. మొత్తానికి టాస్కుల్లో ఎక్కడా పర్ఫామ్ చేయకపోగా.. అదనంగా బిగ్ బాస్ ని బూతులు తిడుతూ అభయ్ నవీన్ లేనిపోని కష్టాలను కొనితెచ్చుకున్నాడు. ముఖ్యంగా అభయ్ అంత స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం నామినేషన్స్ లో లేకపోవడం కూడా ఎలిమినేషన్ కి కారణంగా చెప్పచ్చు. మొత్తానికి మూడో వారం అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు రావడం మాత్రం పక్కా అంటున్నారు. అయితే ఆదివారం ఎపిసోడ్ పూర్తైతే గానీ అధికారికంగా క్లారిటీ రాదు. మరి.. అభయ్ నవీన్ ఎలిమినేషన్ సరైందే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments