iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: పృథ్వీపై నోరు పారేసుకున్న అభయ్.. మరింత డేంజర్ జోన్ లోకి..!

  • Published Sep 19, 2024 | 6:03 PM Updated Updated Sep 19, 2024 | 6:03 PM

Bigg Boss 8 Telugu- Abhav vs Prithvi: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో బాగానే గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా గ్రూపు గేమర్స్ అనుకున్న వాళ్ల మధ్యే జరుగుతున్నాయి. తాజాగా అభయ్- పృథ్వీల మధ్య హౌస్ లో గొడవ స్టార్ట్ అయ్యింది.

Bigg Boss 8 Telugu- Abhav vs Prithvi: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్ లో బాగానే గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా గ్రూపు గేమర్స్ అనుకున్న వాళ్ల మధ్యే జరుగుతున్నాయి. తాజాగా అభయ్- పృథ్వీల మధ్య హౌస్ లో గొడవ స్టార్ట్ అయ్యింది.

  • Published Sep 19, 2024 | 6:03 PMUpdated Sep 19, 2024 | 6:03 PM
Bigg Boss 8: పృథ్వీపై నోరు పారేసుకున్న అభయ్.. మరింత డేంజర్ జోన్ లోకి..!

బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం ఫ్రెండ్ షిప్స్ మాత్రమే కాదు.. గొడవలు, కొట్లాటలు కూడా ఉంటాయి. అంతేకాకుండా.. ఒకసారి క్లోజ్ గా ఉన్నవాళ్లు మరోసారి దూరంగా వెళ్లిపోతారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లే గొడవలకు దిగుతారు. అలా ఇప్పటివరకు హౌస్ లో ఫ్రెండ్స్ లా ఉన్న అభయ్- పృథ్వీ శత్రువుల్లా మారిపోయినట్లు కనిపిస్తోంది. ప్రభావతి 2.0 టాస్క్ తర్వాత అభయ్ కొన్ని మాటలు హద్దులు దాటి మాట్లాడినట్లు కనిపించింది. ముఖ్యంగా పృథ్వీది లఫూట్ గేమ్ అని.. హౌస్ లోనే వరస్ట్ ప్లేయర్ అంటూ అభయ్ మాట్లాడటం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. టాస్కుల్లో ఫిజికల్ అవ్వడం కామన్ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆటను పట్టుకుని ఒక వ్యక్తిని కించ పరుస్తున్నట్లు మాట్లాడటం కాస్త నెగిటివ్ గా ఆడియన్స్ లోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కోసం కొట్లాట ముగిసిన విషయం తెలిసిందే. శక్తి క్లాన్ కి సూపర్ మార్కెట్ కి ఎంట్రీ దొరకగా.. కాంతారా క్లాన్ కి మాత్రం జనరల్ మార్కెట్ కి మాత్రమే ఎంట్రీ దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. హౌస్ లో మరోసారి కోడిగుడ్ల టాస్క్ స్టార్ట్ అయ్యింది. ప్రభావతి 2.0 టాస్క్ లో ఎప్పటిలాగానే గొడవలు గట్టిగానే జరిగాయి. ముఖ్యంగా కాంతారా క్లాన్ చీఫ్ అభయ్- శక్తి క్లాన్ లో ఉన్న పృథ్వీ మధ్య చిచ్చు రాజుకుంది. కోడిగుడ్ల టాస్క్ సమయంలో నిఖిల్ తర్వాత ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంది పృథ్వీనే. అందుకే అభయ్ టీమ్ పృథ్వీని టార్గెట్ చేశారు. అతడిని ఇద్దరు ముగ్గురు కలిసి పట్టుకున్నారు. వాళ్ల నుంచి విడిపించుకుని టాస్క్ ఆడేందుకు పృథ్వీ కాస్త ఫిజికల్ అయ్యాడు. ఆ సమయంలో తన తల గట్టిగా పట్టుకున్నాడు అంటూ ఆదిత్య ఓం గొడవ చేశాడు. అయితే గేమ్ కి రావొద్దు అంటూ పృథ్వీ వార్నింగ్ ఇచ్చాడు.

టాస్క్ కి మధ్యలో బ్రేక్ ఇచ్చిన సమయంలో అభయ్ కొన్ని కామెంట్స్ చేశాడు. అసలు లఫూట్ ఆట మొదలు పెట్టింది పృథ్వీ అంటూ కామెంట్ చేశాడు. అక్కడితో ఆగలేదు. అసలు హౌస్ లో ఉన్న ప్లేయర్స్ లో పృథ్వీ ది వరస్ట్ ప్లేయర్ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా.. హౌస్ లో బుర్ర వాడకుండా ఉండే ఒకే ఒక్క ఆటగాడు పృథ్వీ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల్లో ఒకరితో ఒకరు ఫిజికల్ అవ్వడం గతంలో జరిగిన 7 సీజన్స్ లో చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒకరు కాస్త్ ఎక్కువగానే ఫిజికల్ అవుతూ ఉంటారు. అలాగని వాళ్లని వరస్ట్ ప్లేయర్స్ అనడం కరెక్ట్ కాదు.

ముందురోజు జరిగిన బలూన్స్ టాస్క్ లో అభయ్ ఒక స్ట్రాటజీ వాడిన విషయం తెలిసిందే. నాకు రెండు బలూన్స్ ఉన్నాయి. బాక్స్ లోకి వస్తే వాటిని పగలగొడతాడు. అందుకే బయట ఉన్నాను అది నా స్ట్రాటజీ అని చెప్పాడు. అంతేకాకుండా.. సంచాలక్ పిలిస్తే నేను ఎందుకు వస్తాను అంటూ చెప్పడం గమనార్హం. ఇలాంటి గేమ్ ఆడుతూ.. అభయ్ హౌస్ లో ఉన్న పృథ్వీని వరస్ట్ అనడం బాలేదు. చీఫ్స్ ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వండి అంటే.. నాకు ఎంత మేర స్టామినా ఉందో నేను తెలుసుకుంటా అంటూ అభయ్ నామినేషన్స్ లోకి వచ్చాడు. కాస్త తొందరపాటు నిర్ణయంలాగానే కనిపించింది. ఒకవేళ ఈ వీక్ అభయ్ ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. అభయ్ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom