iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ నాగమణికంఠ వైఫ్ షాకింగ్ పోస్ట్.. విడాకులకు కారణం ఇదే

  • Published Sep 17, 2024 | 12:33 PM Updated Updated Sep 17, 2024 | 12:33 PM

Bigg Boss Manikanta Wife Priya: ప్రస్తుతం బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటికే విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది . ఈ క్రమంలో హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి అసలు నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంఠ వైఫ్ షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి.

Bigg Boss Manikanta Wife Priya: ప్రస్తుతం బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటికే విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది . ఈ క్రమంలో హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి అసలు నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంఠ వైఫ్ షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 17, 2024 | 12:33 PMUpdated Sep 17, 2024 | 12:33 PM
బిగ్ బాస్ నాగమణికంఠ వైఫ్ షాకింగ్  పోస్ట్.. విడాకులకు కారణం ఇదే

బుల్లి తెర తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. హౌస్ లోకి ఎంటర్ అయినా రెండు మూడు రోజుల నుంచే కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , వాదోపవాదాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో వారి వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే కంటెస్టెంట్స్ లో ఒకడైన నాగమణికంఠ కు సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ పై మాత్రం అందరికి మరింత ఆసక్తి నెలకొంది. హౌస్ లో అతను చెప్పిన పాస్ట్ కు సంబంధించి.. ఇటీవల సోషల్ మీడియాలో అతని పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అతని వైఫ్ ప్రియా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేయడంతో.. మళ్ళీ ఈ మ్యాటర్ తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

మణికంఠ వైఫ్ ప్రియ షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది. ‘సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది’. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు.. కన్నబిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో.. అందరికి అర్థమయ్యేలా ఓ ఫోటోను షేర్ చేస్తూ ‘చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది’ అంటూ పోస్ట్ ను షేర్ చేసింది. దీనితో మణికంఠకు ప్రియ కు ఉన్న గొడవల విషయం అందరికి చెప్పేసినట్లు అయింది.

హౌస్ లోకి వచ్చిన నాగమణికంఠ మొదటి వారంలోనే.. తన ఫ్యామిలీ కష్టాల గురించి చెప్పాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం , తన తల్లి రెండో వివాహం చేసుకోవడం, కొన్నాళ్ళకు తల్లి కూడా క్యాన్సర్ కారణంగా చనిపోవడం. ఆ తర్వాత తన స్టెప్ ఫాథర్ వలన అనేక అవమానాలు పడి.. ఇంట్లో నుంచి వచ్చేసి ఒంటరిగా ఉన్నానని చెప్పాడు. తన తల్లి చనిపోయే ముందు.. నీ కడుపున మళ్ళీ పుడతానని చెప్పడంతో ప్రియా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే వారికి కొన్నాళ్ళకు కూతురు పుట్టింది. ఫ్యామిలీతో పాటు యుఎస్ లో ఉన్న మణికంఠకు సరైన సంపాదన లేకపోవడంతో అవమానాలు మొదలయ్యాయి. దీనితో అతని వైఫ్ ఇండియాకు వెళ్ళిపోమందని .. ఒంటరివాడినయ్యానని.. బిగ్ బాస్ లాంచింగ్ డే రోజున చెప్పుకొచ్చాడు. అప్పుడు కట్ చేసిన వీడియో కూడా ఈ రకంగానే ఉండడంతో.. అప్పుడే అతనిపై అందరికి సింపతీ క్రియేట్ అయింది. చాలా మంది ఆమె గురించి నెగెటివ్ గానే అనుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు అందరికి తెలిసిన కథే.

కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం.. ఆమె గురించి పాజిటివ్ గా చెప్పడం మొదలుపెట్టాడు. విధి ఆడిన వింత నాటకంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నాం తప్పితే.. ప్రియ అంటే తనకి ప్రాణం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చాలా సందర్భాలలో ఆమె గురించి అడపా దడపా ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నాడు. తీరా ఇప్పుడు చూస్తే మణికంఠ వైఫ్ షాకింగ్ పోస్ట్ తో అందరికి ట్విస్ట్ ఇచ్చింది. దినోత్ అసలు వారిద్దరూ విడిపోయారా.. వారిద్దరి మధ్య ఏమైంది.. ఇదంతా నిజామా లేకా గేమ్ కోసం వారు ప్లాన్ చేసినా స్క్రిప్ట్ ఆ.. అని ఆడియన్స్ లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆల్రెడీ హౌస్ లో మణికంఠ మూడ్ స్వింగ్స్ గురించి అందరు చూస్తూనే ఉంటున్నారు. దాని వలెనే వారిద్దరి మధ్య గొడవలు వచ్చి ఉంటాయి అని మరికొంత మంది భావిస్తున్నారు. ఏదేమైనా ఒకవేళ ఫ్యామిలీ వీక్ వరకు మణికంఠ ఉంటే కనుక.. అతని భార్యను , కూతురిని హౌస్ లోకి పంపించే అవకాశం లేకపోలేదు. అసలు నిజా నిజాలు ఏమై ఉంటాయో.. వీరి గురించి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş