iDreamPost
android-app
ios-app

బుద్ది మార్చుకోని యష్మీ.. మణికంఠపై బూతు పురాణం..!

  • Published Sep 16, 2024 | 12:58 PM Updated Updated Sep 16, 2024 | 12:58 PM

బిగ్ బాస్ 8 రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలి వారంలో బెజవాడ బేబక్క.. సెకండ్ వీక్ శేఖర్ భాషా బయటకు వచ్చారు. ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున కొంత మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యారు. వారిలో ఒకరు యష్మీ. ఆమె మంచి కోసమే చెప్పినప్పటికీ.. బుద్ది మార్చుకోలేదు యష్మీ.

బిగ్ బాస్ 8 రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలి వారంలో బెజవాడ బేబక్క.. సెకండ్ వీక్ శేఖర్ భాషా బయటకు వచ్చారు. ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున కొంత మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యారు. వారిలో ఒకరు యష్మీ. ఆమె మంచి కోసమే చెప్పినప్పటికీ.. బుద్ది మార్చుకోలేదు యష్మీ.

  • Published Sep 16, 2024 | 12:58 PMUpdated Sep 16, 2024 | 12:58 PM
బుద్ది మార్చుకోని యష్మీ.. మణికంఠపై బూతు పురాణం..!

గొడవలు, కొట్లాటలు, ఎలిమినేషన్స్, ఎమోషన్లతో బిగ్ బాస్ హౌస్ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ ఎంటర్ టైన్ మెంట్ షోలో బిగ్ బాస్ ఇంట్లోకి జంటగా అడుగుపెట్టిన బెజవాడ బేబక్క.. శేఖర్ భాషా వారం గ్యాప్‌లోనే ఎలిమినేట్ అయ్యారు. ఈ వీకెండ్ హోస్ట్ నాగార్జున కొంత మంది కంటెస్టెంట్లపై ఫైర్ కావడంతో చాలా మంది వీక్షకుల ఇగో సాడిస్ఫై అయ్యింది. ముఖ్యంగా యష్మీ, సోనియా మాటలు, చేష్టలపై గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఓ టాస్క్ విషయంలో యష్మీ బయాస్‌గా వ్యవహరించడం, అబద్దం చెప్పినట్లు వీడియో చూపించడంతో ఒక్కసారిగా ఆమెలో ఉన్న మహానటిని బయటకు తీసుకువచ్చి.. మరో టీం కోసమే ఇలా చేశానని చెప్పడంతో.. ముందే చెప్పాలిగా అంటూ చీవాట్లు పెట్టాడు కింగ్. ఆమెను చీఫ్‌గా అన్ ఫిట్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చాడు.

ఇదే కాదు.. టాస్క్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు కూడా వీక్షకులకు చిరాకు తెప్పించింది. దీంతో నాగార్జున ఆమెపై మరింత ఫైర్ అయితే బాగుణ్ణు అని భావించారు. ఇంత చెప్పినా కూడా యష్మీ గౌడ మాత్రం తన బుద్ది మార్చుకోలేదు. మరోసారి నాగ మణికంఠపై ఫైర్ అవుతూ.. బూతు పురాణం స్టార్ట్ చేసింది. టీవీలో ప్రసారమైన ప్రోమోలో ఆమె మణిపై అబ్యూస్ లాంగ్వెస్ యూజ్ చేసింది. తాజా ప్రోమోలో కట్ చేసినప్పటికీ.. అప్పటికే కొంత మంది ఆ వీడియోను కాప్చర్ చేసేశారు. ఇంతకు ఆ ప్రోమోలో ఏముందంటే..? కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకున్న హౌస్ మేట్స్‌పై చెత్త పోయాలని చెప్పగా.. సీత, పృధ్వీని మధ్య మాటల ఫైర్ నడిచింది. నువ్వు గెలవాలన్న స్పిరిటీ నాకిష్టమని, కానీ నువ్వు ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదందీ సీత. నేనొక టీమ్‌లో ఆడినప్పుడు .. అపోజిట్ టీమ్‌ని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృధ్వీ కఠినంగానే చెప్పాడు.

ఇక యష్మీని నామినేట్ చేశాడు మణికంఠ. ఆ సమయంలో మణికంఠ.. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు.. ఎవరు కడగట్లేదు అని చూడాలని అంటాడు. అవును నాకు లగ్జరీ వచ్చినప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు అంటూ యష్మీ రిప్లై ఇచ్చే లోపు.. మణి.. వెన్ అయామ్ టాక్ ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు మణి. అంతలోనే యష్మీ నువ్వు నాదగ్గరకు వచ్చి డ్రామాలు చేస్తావు చూడు ఫ్రెండ్‌గా అంటూ మాటలు వదిలేయడంతో.. నో వే, నాకు పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే నేను రైజ్ చేస్తా అని మణికంఠ అనగానే.. నువ్వేంటీ బొక్క రైజ్ చేసేదని యష్మీ బూతులు మాట్లాడుతుంది. నువ్వు మంచిగా మాట్లాడు..నేను మంచిగా మాట్లాడుతా అంటూ ఫైర్ అయ్యాడు మణి. కానీ ఇది కడుపులో పెట్టుకుని.. నేను హౌస్ లో ఉన్నన్ని రోజులు నిన్నునామినేట్ చేస్తానని తేల్చి చెప్పింది.

తాజాగా ప్రోమోలో ఆమె తిట్టిన తిట్టు తీసేసి.. కొన్ని జోడించి రిలీజ్ చేశాడు. మొత్తానికి ఈ వారం కూడా ఎలిమినేషన్ పర్వం హాట్ హాట్‌గానే జరిగినట్లు తెలుస్తుంది. సీత.. ఫృధ్వీని, యష్మీగౌడను నామినేట్ చేసినట్ల ప్రోమోలో కనిపిస్తుంది. అలాగే సాక్స్ టాస్క్‌లో సంచాలక్‌గా సరిగా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది. సోనియాను నైనిక నామినేట్ చేసింది. మణికంఠ.. ఫృధ్వీని, యష్మీ గౌడను నామినేట్ చేశాడు. యష్మీని మణి నామినేట్ చేసింది. ఇంకా ఎవరెవరు ఎవర్నీ నామినేట్ చేశారో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet