బిగ్ బాస్ సెట్‌లో ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

Accident During Bigg Boss Set: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సంబంధించిన సెట్‌‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడ సిబ్బంది ఒక్కసారే షాక్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Accident During Bigg Boss Set: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సంబంధించిన సెట్‌‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడ సిబ్బంది ఒక్కసారే షాక్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత సౌత్ భాషలు కూడా ఈ షోని ప్రారంభించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలు బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.  అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ అనగానే అందమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇగ్ బాస్ హౌజ్ చాలా స్టైలిష్ గా, మోడల్ లుక్ తో తీర్చి దిద్దుతుంటారు. అప్పడప్పుడు షూటింగ్ కోసం వేసే సెట్స్ లో ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా బిగ్ బాస్ సెట్ లో ఓ ప్రమాదం చోటు చేటు చేసుకోవడంలో అందరూ ఉలిక్కి పడ్డారు. వివరాల్లోకి వెళితే..

తమిళ బిగ్ బాస్ సీజన్ 8 అక్టోబర్ 6 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. విజయ్ టీవీలో ఈ షో ప్రచారం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తుంటే సీజన్ 8 సరికొత్త రీతిలో మేకర్స్ క్రియేట్ చేసినట్లు అర్థమవుతుంది. దానికి తోడు ఇన్నాళ్లూ తమిళ బిగ్ బాస్ కు హూస్ట్ గా వ్యవహరించిన కమల్ హాసన్ స్థానంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి వస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సెట్ లో పనులు షరవేగంగా జరుగుతున్నాయి.తాజాగా సెట్స్‌లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం మేరకు.. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మొహమ్మద్ షాహీన్ ఖాన్ అనే వ్యక్తి బిగ్ బాస్ తమిళ్ 8 సెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు 20 అడుగుల ఎత్తు నుండి పడిపోయినట్లు తెలుస్తుంది.

ఈ సంఘటన చెన్నై సమీపంలోని EVP ఫిల్మ్‌సిటీలో జరిగింది. అక్కడ ఉన్న ఇతర కార్మికులు మొహమ్మద్ ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.   సిబ్బంది ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఈవీపీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే రజినీకాంత్ నటించిన కాలా మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ లో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. విజయ్ నటించిన బిగిల్ మూవీ షూటింగ్ లో క్రేన్ కిందపడి సెల్వరాజ్ అనే కార్మికుడు మరణించాడు. తాజాగా బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది.

Show comments