iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్‌ని బూతులు తిట్టిన యూట్యూబర్ అన్వేష్.. వీడియో వైరల్

  • Published Sep 11, 2023 | 11:58 AM Updated Updated Sep 11, 2023 | 11:58 AM
  • Published Sep 11, 2023 | 11:58 AMUpdated Sep 11, 2023 | 11:58 AM
పల్లవి ప్రశాంత్‌ని బూతులు తిట్టిన యూట్యూబర్ అన్వేష్.. వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. మునుపటి సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పవర్ అస్త్రం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చామని నాగార్జున వెల్లడించారు. ఆట సందీప్ ఈ పవర్ అస్త్రాన్ని దక్కించుకున్నారు. కాగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జోన్ లో మొత్తం 8 మంది ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. కిరణ్ వెళ్లిపోతుంటే షకీలా ఏడ్చేసింది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. కిరణ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిందని షకీలా వెల్లడించింది. మొత్తానికి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ తో ఆట మరింత ఇంట్రస్టింగ్ గా సాగింది.

ఇదిలా ఉంటే హోస్ లో రతికా రోజ్ ని, పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ హైప్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. పల్లవి ప్రశాంత్ అయితే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అంటున్నారు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడో అప్పటి నుంచి అతనిపై విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ పై యూట్యూబర్ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంత్ ని బూతులు తిడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బిగ్ బాస్ లో వెళ్లే ముందు ప్రశాంత్ తనను కాంటాక్ట్ చేశాడని.. ‘అన్నా ఏడుపొచ్చేస్తుందన్న.. సపోర్ట్ చేయన్న’ అని ప్రాధేయపడ్డట్టు అన్వేష్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. సపోర్ట్ చేయమని తనకు ఎన్నో మెసేజ్ లు పెట్టాడని అన్వేష్ అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానని చెప్పగానే.. నాశనమైపోతావ్ రా అని చెప్పినట్లు అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు. అప్పుడు ప్రశాంత్.. ‘అక్కడికెళ్తే పేరొస్తుంది. రైతు గురించి అందరికీ తెలుస్తుందని అన్నాడని అన్వేష్ చెప్పుకొచ్చారు. దానికి అన్వేష్.. ‘రైతు అందరికీ తెలుసురా.. నువ్వెళ్ళి ఏం చేస్తావురా.. నేనేం సపోర్ట్ చేయను’ అని చెప్పానని అన్నారు. అంతేకాదు ప్రశాంత్ మంచోడు కాదని.. రైతు గురించి చెప్తానని చెప్పి హౌస్ లోకి వెళ్ళాక హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్లతో ఉంటున్నాడని బూతులు తిట్టారు. రైతు ఏం చేస్తే దేశానికి ఉపయోగం అని చెప్పడం మానేసి.. ‘నా గుండె నీ దగ్గరుంది.. నా గుండె ఏం చెప్తుందో చెప్పు’ అంటున్నాడని ప్రశాంత్ ని అన్వేష్ బూతులు తిట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ప్రశాంత్ ని అన్వేష్ తిట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom