iDreamPost
android-app
ios-app

Amar vs Prashanth: అమర్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది?

  • Published Dec 08, 2023 | 12:24 PM Updated Updated Dec 08, 2023 | 12:24 PM

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేవి సర్వ సాధారణం. కానీ, అమర్- ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ మాత్రం సాధారణమైనది కాదు. అయితే వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేవి సర్వ సాధారణం. కానీ, అమర్- ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ మాత్రం సాధారణమైనది కాదు. అయితే వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

  • Published Dec 08, 2023 | 12:24 PMUpdated Dec 08, 2023 | 12:24 PM
Amar vs Prashanth: అమర్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేవి సర్వ సాధారణం. ఏ సీజన్ లోనే అయినా.. ఏ భాషలో అయినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ గొడవలకు ఒక పరిధి, లిమిట్ ఉండాలి. ఈ సీజన్లో అలాంటి పరిధులు కూడా దాటేస్తున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీజన్ ప్రారంభం నుంచి కొందరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వారిలో అమర్- పల్లవి ప్రశాంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. తాజా ఎపిసోడ్లో కూడా అమర్- ప్రశాంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. మరి.. ఆ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

హౌస్ లో వోట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. మొదట శోభా శెట్టి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఆ తర్వాత అర్జున్- అమర్ ఇద్దరూ రేసులోకి వచ్చారు. వారిలో ఎవరికి సపోర్ట్ ఇస్తారు అనే ప్రశ్నకు అమర్ కు ప్రియాంక- శోభా సపోర్ట్ చేశారు. అర్జున్ కు శివాజీ, ప్రశాంత్, యావర్ సపోర్ట్ చేశారు. అయితే అమర్ మాత్రం తనకు ఎందుకు సపోర్ట్ చేయరు అంటూ పాయింట్స్ అడిగాడు. ఆ విషయంలో యావర్ కు అమర్ కు గొడవ కూడా జరిగింది. నిజానికి శివాజీ, యావర్, ప్రశాంత్ లు అర్జున్ కు సపోర్ట్ చేయడంపై అంతా షాకయ్యారు. ఎందుకంటే స్టాండ్ తీసుకుంటే అర్జున్ నామినేట్ చేశాడు అంటూ వారి మనసులో ఉంది. కానీ, అమర్ తో పోలిస్తో అర్జున్ కే సపోర్ట్ చేయాలని వాళ్లు ఫిక్స్ అయినట్లు కనిపించింది.

ఆ తర్వాత బాల్స్ టాస్క్ జరిగింది. ఈ టాస్కులో మొదట శోభా- యావర్ కు గొడవ జరిగింది. శోభా దెబ్బకు యావర్ ఎలిమినేట్ అయిపోయాడు. బాగా ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత అసలు గొడవ అమర్ దీప్- ప్రశాంత్ ల మధ్య జరిగింది. సరదాగా మొదలైన ఆట కొట్టుకునే వరకు వెళ్లింది. అమర్- ప్రశాంత్ లు దూరం నుంచి బాల్స్ విసురుకోకుండా దగ్గరకు వెళ్లి అటించుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రశాంత్- అమర్ ఫిజికల్ కూడా అయ్యారు. తన గొంతు పట్టుకున్నాడని అమర్.. తనని కొరికాడంటూ ప్రశాంత్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ కెమెరాలకు చెప్పడంతో అమర్ మరింత రెచ్చిపోయాడు. పోరా అన్నీ కెమెరాలకు చెప్పు.. బ్యాడ్ చేయడమేగా నీకు తెలిసింది అంటూ కామెంట్స్ చేశాడు. ఈ దెబ్బతో ప్రశాంత్ కూడా ఫైర్ అయ్యాడు. నన్ను ఎందుకు కొరికావ్? ముఖం పగలగొడతా అన్నావ్, అరే తురే అనకు అంటూ గట్టిగా చెప్పాడు.

ఎంత గట్టిగా మెడ ఒత్తానో మెడికల్ రూమ్ కి వెళ్దాం పదా అంటూ ప్రశాంత్ అన్నాడు. అందుకు ముందు అమర్ వద్దు అని.. ఆ తర్వాత పదా వెళ్దాం అంటూ లేచాడు. ప్రశాంత్ ని మెయిన్ డోర్ వద్ద నెట్టాడు కూడా. మెడికల్ రూమ్ డోర్ దగ్గర కూడా ప్రశాంత్ ని లాగాడు. కానీ, అమర్ నుంచి ఇలాంటి బిహేవియర్ ఎవరూ ఊహించలేదు. ఇలా చేస్తాడు అనుకోలేదు. ఈ గొడవలో అమర్ దీప్ కచ్చితంగా తప్పు చేశాడు అనే చెప్పాలి. తోటి కంటెస్టెంట్ తో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇంక కోపంలో తనని తాను ఏదైనా చేసుకుంటాను.. రెచ్చగొట్టకు అని అన్న మాటలు మాత్రం ఫ్రస్ట్రేషన్ లో చెప్పినవే అని అర్థమవుతోంది. మాటలు ఎన్ని అనుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, అమర్ చేతల్లోకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ అమర్ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ, అవి కేవలం మాటలతో ఆగి ఉంటే అమర్ ని ఎవరూ తప్పుబట్టే వాళ్లు కాదు. మరి.. అమర్- ప్రశాంత్ మధ్య గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş