iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కి అఖిల్ సపోర్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

  • Published Oct 03, 2023 | 6:27 PM Updated Updated Oct 03, 2023 | 6:27 PM
  • Published Oct 03, 2023 | 6:27 PMUpdated Oct 03, 2023 | 6:27 PM
Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కి అఖిల్ సపోర్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాత్రమే కాదు.. సీజన్ గురించి సోషల్ మీడియాలో చర్చ కూడా గట్టిగానే సాగుతోంది. హౌస్ లో ఉన్న వారికి ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు, ఇంతకముందు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వాళ్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు మొదటి నుంచి అఖిల్ సార్థక్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడంతో అఖిల్ పై నెట్టింట బాగానే ట్రోల్స్ నడుస్తున్నాయి. అఖిల్ కూడా ఆ ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెబుతున్నాడు. ట్రోలర్స్ స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు.

బిగ్ బాస్ హౌస్ కి రెండుసార్లు వెళ్లి వచ్చిన వ్యక్తిగా అఖిల్ సార్థక్ కు గేమ్ మీద గట్టి అవగాహనే ఉంటుంది. అందుకేనేమో హౌస్ లో ఉన్న సెలబ్రిటీలకు కాకుండా పల్లవి ప్రశాంత్ కు తన సపోర్ట్ తెలియజేశాడు. అలాగే అతను బాగా ఆడాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అఖిల్ సార్థక్ పై కొత్త ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రెండుసార్లు హౌస్ లోకి వెళ్లి నువ్వు రన్నర్ గానే తిరిగి వచ్చావు. ఇప్పుడు నువ్వు పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తున్నావు. అతను కూడా రన్నర్ కావాలి అని కోరుకుంటున్నావా? అటూ ప్రశ్నించడమే కాకుండా.. ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ ట్రోల్స్ కు సమాధానం చెబుతూ ప్రశాంత్ రన్నర్ అయితే నేను మస్త్ హ్యాపీగా ఫీలవుతా అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.

“థాంక్యూ సోమచ్ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నందుకు. నువ్వు రెండోసారి రన్నర్ అయ్యావ్.. ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్నావ్. ప్రశాంత్ కూడా రన్నర్ అయితే ఎలా అంటున్నారు. ప్రశాంత్ రన్నర్ అయితే ఖుషీ నేను.. విన్నర్ అయితే ఇంకా హ్యాపీ. ఇలాంటి ట్రోల్స్ అన్నీ నేను బొచ్చడు చూశాను. కొందరి పీఆర్స్ ఎప్పుడో నాలుగో సీజన్ ప్రోమోలు తీసుకొచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. నేను అసలు కేర్ కూడా చేయను. థాంక్యూ సో మచ్ నాకు మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. కాస్త క్రియేటివ్ గా చేయండి. కాస్త క్రియేటివ్ గా ఆలోచించి ట్రోల్ చేయండి. పర్లేదు నేను అవన్నీ చూసేసినా. రెండుసార్లు రన్నర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఒక్కరోజు హౌస్ లోకి వెళ్లి చూపీ. వాడు మగోడు ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లిండు. వెళ్లి ఏదోఒకటి చేస్తున్నాడు. నీకు దమ్ముంటే నువ్వు కూడా వెళ్లి చూపించు.

పల్లవి ప్రశాంత్ ని ఇప్పటికి కూడా మెచ్చుకుంటా. ఎందుకంటే ఆడే గేమ్ క్లియర్ గా ఆడుతున్నాడు. మళ్లీ మా సీజన్ 4 గుర్తులన్నీ చూపించినందుకు థాంక్యూ సోమచ్. మీరు సీజన్ 4ని మర్చిపోలేకపోతున్నారు. ఇలాగే మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను థాంక్యూ సోమచ్” అంటూ అఖిల్ సార్థక్ చాలా స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. అలాగే మరో వీడియోలో ఎంత డబ్బు తీసుకున్నావ్ అని వస్తున్న ట్రోల్స్ పై కూడా అఖిల్ రియాక్ట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తుంటే ఎంత తీసుకున్నావ్ అని ట్రోల్ చేస్తున్నారు. నేను బిగ్ బాస్ సీజన్ 4లో డబ్బు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఓటీటీ సీజన్ కి డబ్బు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశాను. అఖిల్ ని డబ్బుతో కొనలేరు అంటూ కౌంటర్ చేశాడు. మరి.. అఖిల్ సార్థక్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝔸𝕜𝕙𝕚𝕝 𝕊𝕒𝕣𝕥𝕙𝕒𝕜 ℕ𝕒𝕚𝕕𝕦 (@akhilsarthak_official)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş