iDreamPost
android-app
ios-app

షాకింగ్.. ఈ వారం హౌస్ నుంచి తేజ ఎలిమినేషన్!

  • Published Nov 03, 2023 | 3:55 PM Updated Updated Nov 03, 2023 | 3:55 PM

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ లో ఎప్పుడూ ఎలిమినేషన్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం ఒకరోజు ముందు నుంచే నెట్టింట ఎలిమినేషన్ రచ్చ మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ లో ఎప్పుడూ ఎలిమినేషన్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం ఒకరోజు ముందు నుంచే నెట్టింట ఎలిమినేషన్ రచ్చ మొదలైంది.

  • Published Nov 03, 2023 | 3:55 PMUpdated Nov 03, 2023 | 3:55 PM
షాకింగ్.. ఈ వారం హౌస్ నుంచి తేజ ఎలిమినేషన్!

వీకెండ్ రాగానే హౌస్ లో మస్తీ కంటే కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్నే ఎక్కువ వెంటాడుతూ ఉంటుంది. ఈ వీక్ లో మొత్తం రతికా రోజ్, శోభాశెట్టి, టేస్టీ తేజా డేంజర్ జోన్ లో ఉన్నారని చెబుతున్నారు. వీరిలో ఎవ్వరూ ఊహించని విధంగా టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇది బయట ఉన్న ప్రేక్షకులకు మాత్రమే కాదు.. హౌస్ మేట్స్ కి కూడా చాలా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో బాగా ఫామ్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అంటే ఎవరైనా షాకవ్వాల్సిందే. తేజా విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.

సాధారణంగా శనివారం మధ్యాహ్నం నుంచి హౌస్ లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై లీకులు వస్తాయి. కానీ, ఇప్పుడు మాత్రం టేస్టీ తేజానే ఎలిమినేట్ అవుతాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకు ఒక ఫార్ములా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో రతికా రోజ్, టేస్టీ తేజా, శోభాశెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరిలో తేజానే ఎలిమినేట్ అవుతాడనే విషయం వైరల్ అవుతోంది. అందుకు కొన్ని కారణాలు చెబుతున్నారు. రతికా రోజ్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి వచ్చింది. ఆమె మొదటి వారం అసలు ఆడింది లేదు. కానీ, రెండో వారం నుంచి యాక్టివ్ అయ్యింది. యావర్, అమర్ దీప్ లతో గొడవలు కూడా పెట్టుకుంది.

ఇంక శోభాశెట్టి ఈ వీక్ కెప్టెన్ అయ్యిందని చెబుతున్నారు. కెప్టెన్ అయినా కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వరు అనడానికి లేదు. కానీ, ఎందుకో తేజాని హౌస్ నుంచి పంపేస్తారు అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ముగ్గురిలో తేజాకే ఎక్కువ ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తేజాని నిజంగానే ఎలిమినేట్ చేస్తే అతని ఎలిమినేషన్ ఫెయిరా? అన్ ఫెయిరా అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. హౌస్ లో గేమ్ పరంగా తేజాకి ఎలాంటి వంక పెట్టడానికి లేదు. కానీ, మనోడు అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం మాత్రం గట్టిగానే నెగిటివ్ అయ్యింది. అలాగే సందీప్ మాస్టర్ చెప్పారనే నామినేట్ చేశాను అంటూ చెప్పిన మాటలను సందీప్ మాస్టర్ ఖండించిన విషయం తెలిసిందే. తేజా అలాంటి మాటలు అంటాడని నేను అనుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇలాంటి కొన్ని సంఘటనలు తేజాకి బాగా మైనస్ అయ్యాయి. ఆట మరింత ముందుకు సాగే సమయంలో ఫిజికల్ గా తేజా ఆడటం దాదాపుగా కష్టమనే చెప్పాలి. నిజానికి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా హౌస్ లోకి వచ్చిన తేజా ఇప్పుడు 9 వారాలు హౌస్ లో కొనసాగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే తేజా ఎలిమినేట్ అయ్యాడా? లేదా అనే విషయం అధికారికంగా తెలియాలి అంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇప్పటివరకు జరుగు ప్రచారాల్లో మాత్రం టేస్టీ తేజానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మరి.. టేస్టీ తేజాని ఎలిమినేట్ చేస్తే అది ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom