iDreamPost
android-app
ios-app

ఇంతకాలానికి తేజ తెగ నచ్చాడయ్యా.. శోభాకి ఇచ్చి పడేశాడు!

  • Published Oct 26, 2023 | 1:38 PM Updated Updated Oct 26, 2023 | 3:23 PM

బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున శోభాశెట్టి- టేస్టీ తేజా పేర్లు చెప్పేస్తారు. అయితే కొన్నిరోజులుగా వీళ్ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వీళ్ల మధ్య జరిగిన గొడవతో ఆ విషయం కన్ఫామ్ అయిపోయింది.

బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున శోభాశెట్టి- టేస్టీ తేజా పేర్లు చెప్పేస్తారు. అయితే కొన్నిరోజులుగా వీళ్ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వీళ్ల మధ్య జరిగిన గొడవతో ఆ విషయం కన్ఫామ్ అయిపోయింది.

  • Published Oct 26, 2023 | 1:38 PMUpdated Oct 26, 2023 | 3:23 PM
ఇంతకాలానికి తేజ తెగ నచ్చాడయ్యా.. శోభాకి ఇచ్చి పడేశాడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మంచి ఫ్రెండ్స్ ఎవరు అనగానే అంతా టేస్టీ- శోభాశెట్టి అనే చెప్తారు. ఎందుకంటే హౌస్ లో వీళ్ల బాండింగ్ అందరికీ జెన్యూన్ గా అనిపించింది. అలాగే వాళ్లు తిట్టుకోవడం, అలగడం, కొట్టుకోవడం చూసి ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే కొన్నిరోజుల నుంచి శోభాకి తేజ విషయంలో.. తేజాకి శోభా విషయంలో నెగిటివ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజా ఎపిసోడ్ లో వీళ్ల మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవలో తప్పు ఎవరిది అనే సంగతి పక్కన పెడితే.. తేజా మాత్రం అందరికీ తెగ నచ్చేస్తున్నాడు.

హౌస్ లో శోభా ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడినా నెగిటివ్ గా తీసుకోకుండా ఉండే వ్యక్తి తేజా ఒక్కడే అని చెప్పాలి. అమర్ దీప్, ప్రియాంక అయినా ఒకానొక సమయంలో శోభాని విసుక్కోవడం, లైట్ తీసుకోవడం చేస్తారేమో.. తేజా మాత్రం అలా చేయడు. కానీ, శోభాకి మాత్రం తేజా అంటే చాలా చిన్న చూపు అనే అభిప్రాయం ప్రేక్షకులకు కలుగుతోంది. ఆమె మంచి కోసం తేజా చెప్పినా కూడా నెగిటివ్ గా తీసుకుంటుంది. ఇంక ఆట విషయానికి వస్తే.. అసలు తేజాని తొక్కేయాలని చూసింది. టై బ్రేకర్ లో తేజాని కాదని.. అమర్ దీప్ కి హెల్ప్ చేయడానికి ఫిక్స్ అయింది. అలా చేస్తే తేజా ఓడిపోతాడు అని తెలిసి కూడా ఆమె అలాగే చేసింది. అక్కడే శోభా బాగా నెగిటివ్ అయ్యింది. మరోవైపు హౌస్ లో అందరికంటే ఎక్కువగా కేకలు వేస్తూ.. కొన్నిసార్లు అర్థం లేకుండా మాట్లాడుతూ శోభా బాగానే నెగిటివ్ అవుతోంది.

తాజాగా బాక్సుల టాస్క్ అయిన తర్వాత రతికాతో తేజా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా తినను అని చెప్పి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకుని వెళ్లి మాట్లాడు అని చెప్పాడు. నిజానికి అనింది అమర్ గురించే. కానీ, శోభా మాత్రం వైలెంట్ అయిపోయింది. ఒక వ్యక్తి ఏడిస్తే నీకు సరదాగా ఉందా అంటూ ప్రశ్నించింది. అమర్ చేసిన పని ఏం బాగుంది మరి? శోభా, ప్రియాంక, రతికా, గౌతమ్ లను మాట్లాడుకున్నాడు కదా.. తేజా మీద గెలవడానికి. అలాంటి వ్యక్తి గురించి ఒక మాట జోక్ గా అనడంలో తప్పు లేదనే చెప్పచ్చు. అయితే విషయం తెలిసిన తర్వాత కూడా అమర్ అంతలా రియాక్ట్ అవ్వలేదు. కానీ, శోభా మాత్రం చిందులు వేసింది. ఇంక తేజా కూడా నోటికి పని చెప్పాడు. హే పోవే అంటూ కేకలు వేశాడు.

సంబంధంలేని వాటిల్లో ఎందుకు వేలు పెడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. నేను ఒకటి చెబితే దానిని ఇంకోలా పోట్రే చేస్తున్నావ్ అంటూ హైపర్ అయ్యాడు. తేజా అంతలా రియాక్ట్ అయ్యే సరికి హౌస్ మేట్స్ కి కూడా ఏం అర్థం కాలేదు. ఎప్పుడూ లేనిది ఏంటి తేజా ఇలా రియాక్ట్ అయ్యాడు అనుకున్నారు. నిజానికి ఇలాంటి రియాక్షన్ తేజా దగ్గర ఎప్పుడో రావాల్సింది. కాకపోతే ఇంత లేట్ అయింది. ఇన్నాళ్లు శోభా విషయంలో తేజాకి ఉన్న నెగిటివ్ పాయింట్ ఇదే. ఆమె తప్పుచేసి తేజా మీద కేకలు వేసినా కూడా చాలా కూల్ గా ఉంటున్నాడు అని. ఈసారి మాత్రం ఇచ్చి పడేశాడు. పైగా చివర్లో టేస్టీ తేజాని కూల్ చేస్తూ.. సారీ ఏం చెప్పకులే అంటూ సెటైర్లు కూడా వేసింది. మరి.. శోభాపై తేజా కేకలు వేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet