iDreamPost
android-app
ios-app

శోభాని ఎత్తుకుని బాత్ రూమ్ కి తీసుకెళ్లిన తేజ.. స్నానం చేయిస్తానంటూ..!

  • Published Nov 01, 2023 | 4:13 PM Updated Updated Nov 01, 2023 | 4:13 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అని ఒప్పుకోవాల్సిందే. హౌస్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో? ఎవరు ఎవరితో ఫ్రెండ్స్ అవుతున్నారో కూడా అర్థం కావడం లేదు. హౌస్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ అంటే తేజా- శోభా పేర్లే చెప్పేస్తారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అని ఒప్పుకోవాల్సిందే. హౌస్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో? ఎవరు ఎవరితో ఫ్రెండ్స్ అవుతున్నారో కూడా అర్థం కావడం లేదు. హౌస్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ అంటే తేజా- శోభా పేర్లే చెప్పేస్తారు.

  • Published Nov 01, 2023 | 4:13 PMUpdated Nov 01, 2023 | 4:13 PM
శోభాని ఎత్తుకుని బాత్ రూమ్ కి తీసుకెళ్లిన తేజ.. స్నానం చేయిస్తానంటూ..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎలాంటి టాస్కులు వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా ఈ సీజన్ లో అయితే బిగ్ బాస్ అసలు ఆటకు సంబంధం లేకుండా కొన్ని టాస్కులు పెడుతున్నాడు. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో అందరినీ ఒక టాస్కు బాగా ఆకట్టుకుంది. అదే ఆటవాళ్లని మహారాణుల్లా చూసుకోవాలని అబ్బాయిలకు ఇచ్చిన టాస్క్. అందులో మరీ ముఖ్యంగా శోభాశెట్టి- టేస్టీ తేజా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అర్జున్- తేజాలను శోభా ఒక ఆట ఆడుకుంది. హౌస్ లో ఉన్న అబ్బాయిలు అంతా అమ్మాయిలకు సేవలు చేస్తూ కష్టపడ్డారు.

గౌతమ్ కెప్టెన్ అయ్యాక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఈ వారం అమ్మాయిలకు ఫుల్ రెస్ట్ ఇస్తున్నాను. ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పాడు. ఆ మాట విన్న బిగ్ బాస్ ఒక ఫన్నీ టాస్కుని ఇచ్చాడు. గౌతమ్ ఈ వారం అమ్మాయిలకు రెస్ట ఇచ్చారని విన్నాను. అందుకే హౌస్ లో ఉన్న అమ్మాయిలను బజర్ మోగిన తర్వాత నుంచి మళ్లీ బజర్ మోగే వరకు రాణుల్లాగా ట్రీట్ చేయాలి అని చెప్పాడు. అలాగే వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ తినిపించాలి అన్నాడు. దొరికిందే ఛాన్స్ అని శోభా శెట్టి తేజాను ఓ ఆట ఆడుకుంది. బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు.. పళ్లు కూడా తోమించుకుంది. కిచెన్ లో నుంచి శోభాని తేజా ఎత్తుకుని బాత్ రూమ్ కి తీసుకెళ్లాడు.

బాత్ రూమ్ లో శోభాకు బ్రష్ కూడా చేయించాడు. హౌస్ లో తేజా ఎంటర్ టైనర్ అని అందరికీ తెలిసిందే. శోభా మాట్లాడుతూ ఒక భార్యకు బాగోకపోతే భర్త ఇలాంటి పనులు చేయిస్తాడు కదా అంటూ చెప్పుకొచ్చింది. అదే ఛాన్స్ అని తేజా పెళ్లా.. అయితే ఓకే. బిగ్ బాస్ మీరు కూడా మా పెళ్లికి రావాలి అంటూ కెమెరాకి చెప్పాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఫన్ క్రియేట్ చేస్తాడు. పళ్లు రుద్దుతూ అప్పుడే బజర్ కొట్టద్దు బిగ్ బాస్.. తర్వాత స్నానం ఉంది అంటూ ఒక అడల్ట్ జోక్ పేల్చాడు. ఈ డైలాగ్ ని ప్రోమోలో చూపించారు కానీ.. ఎపిసోడ్ లో మాత్రం కట్ చేశారు. లైవ్ లో చూపించే ఉంటారు. తర్వాత అర్జున్ ని కూడా శోభా ఆడుకుంది.

పుచ్చకాయ తినాలి అని చెప్పి అర్జున్ ని కట్ చేయమని చెప్పింది. పుచ్చకాయను ఎవరూ పైన వాష్ చేయరు. కానీ, పుచ్చకాయను కూడా అర్జున్ తో కడిగించింది. కాయను కడిగిన తర్వాత ఆ కాయ వద్దు నాకు ఇంకో పుచ్చకాయ కావాలి అంటూ మార్పించింది. మిగిలిన వాళ్లు కూడా అందరూ అమ్మాయిలకు సేవలు చేస్తూ కనిపించారు. పల్లవి ప్రశాంత్ ప్రియాంక్, అశ్వినీ, రతికాలకు తనిపిస్తూ కనిపించారు. యావర్ ప్రియాకకు సేవలు చేశాడు. రతికాకు బ్రెడ్ ఆమ్లెట్ తినిపించాడు. తేజా కూడా తన దోశలను రతికాకు పెట్టాడు. భోలే కూడా అశ్వినీ, రతికాకు సేవలు చేశాడు. మొత్తానికి ఈ టాస్కులో హౌస్ లో ఉన్న అమ్మాయిలను అబ్బాయిలంతా నిజంగానే రాణుల్లా ట్రీట్ చేశారు. దొరికిన ఛాన్స్ ని అమ్మాయిలు బాగానే వాడుకున్నారు. మరి.. శోభాకి తేజా సేవలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom