iDreamPost
android-app
ios-app

శోభాని ఆవహిస్తున్న మోనిత.. అమర్ ఆటను దారి తప్పిస్తోంది!

  • Published Dec 02, 2023 | 12:27 PM Updated Updated Dec 02, 2023 | 12:27 PM

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. అయితే శోభా మాత్రం అమర్ కోసం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, వాస్తవానికి శోభా వల్ల అమర్ ఆట దారి తప్పుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. అయితే శోభా మాత్రం అమర్ కోసం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, వాస్తవానికి శోభా వల్ల అమర్ ఆట దారి తప్పుతోంది.

  • Published Dec 02, 2023 | 12:27 PMUpdated Dec 02, 2023 | 12:27 PM
శోభాని ఆవహిస్తున్న మోనిత.. అమర్ ఆటను దారి తప్పిస్తోంది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఉత్కంఠగా సాగుతోంది. ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటూ దూసుకుపోతున్నారు. ఫినాలే వీక్ కి దగ్గర్లోకి వచ్చేశారు. ప్రస్తుంత హౌస్ లో అర్జున్ తొలి ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. మిగిలిన వాళ్లు కూడా ఫినాలే వీక్ కి చేరుకోవాలని తాపత్రయ పడుతున్నారు. తొలి ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ని అమర్ త్రుటిలో కోల్పోయాడు. అయితే పోరాడి ఓడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఆటలో మాత్రం అమర్ తడబడే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకు తన బెస్ట్ ఫ్రెండ్ శోభానే కారణం అని చెప్పచ్చు. ఆమె వల్లే అమర్ మిస్ గైడ్ అవుతున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వాళ్లది. ఎంత కలిసి ఆడినా కూడా ఆఖరికి మాత్రం విన్నర్ అయ్యేది ఒకళ్లే. ఇంక లాస్టుకు వచ్చేసరికి ఏ గ్రూపులూ ఉండవు, ఏ ఫ్రెండ్ షిప్పులు ఉండవు. ఎవరి ఆట వాళ్లు ఆడుకోవాల్సిందే. కానీ, శోభా మాత్రం అమర్ కోసం తెగ తాపత్రయ పడుతోంది. అమర్ ని కెప్టెన్ చేసే దాకా నిద్రపోను అని చెప్పిన శోభా.. కెప్టెన్సీ లేకపోయినా కూడా తన స్టాండ్ ని మార్చుకోవడం లేదు. ఎందుకు అంటే దానికి బలమైన కారణం ఉంది. ఈ వీక్ అమర్ నామినేషన్స్ లో లేడు. ప్రియాంక, శోభా ఉన్నారు. అమర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం శోభా చాలా కష్టపడుతోంది. అమర్ కి ఏదో సాయం చేసేస్తున్నట్లు నటిస్తోంది.

ముఖ్యంగా అమర్ దగ్గర ప్రియాంకను బుక్ చేయడానికి ఎంతో కష్టపడుతోంది. ప్రియాంక టాపిక్ ని బాగా హైలెట్ చేస్తోంది. అలా చేస్తే ప్రియాంకకు కాకుండా అమర్ ఫ్యాన్స్ తనకే ఓట్లు వేస్తారని భావిస్తోంది కావచ్చు. ఇంక గౌతమ్ పాయింట్లు ఇచ్చిన సమయంలో కూడా శోభా తన బుద్ధి చూపించుంకుంది. ఇస్తే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా. ఇలా ఏమనకు అని చెప్పి ఇవ్వడం ఏంటి అంటూ కామెంట్ చేసింది. నిజానికి అక్కడ అమర్ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. మధ్యలో ఏ సంబంధం లేని శోభా ఎంట్రీ ఇచ్చి డైలాగులు వదిలేసింది. తర్వాత మళ్లీ అదే టాపిక్ ని తీసుకొచ్చింది. అయినా మీ ఇద్దరికీ లేనిది మధ్యలో నాకెందుకులే అంటూ కామెంట్ చేసింది.

మొత్తానికి అమర్- ప్రియాంకల మధ్యలో పుల్లలు పెట్టే టాస్కులో శోభాశెట్టి సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఇక్కడ మంచి చేస్తున్నాను అనే ట్యాగ్ తో అమర్ కు శోభా చెడు చేస్తోంది. శోభా ఎక్కించడం వల్లే అమర్ గడిచిన మూడ్రోజులు ప్రియాంక టాపిక్ ని సాగదీస్తూ వచ్చాడు. ఆమె సర్దిచెప్పకపోగా పెట్రోలు పోసింది. ఆ టాపిక్ వల్ల అమర్ కు బ్యాడ్ అయ్యింది. ఎందుకు ప్రియాంకను టార్గెట్ చేస్తున్నారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. శోభా మాటలు వింటూ తన ఫ్రెండ్ అని గుడ్డిగా ఆమె చెప్పిన దారిలో వెళ్లిపోతున్నాడు. అది అమర్ ఆటకు చాలా చేటు చేస్తోంది. ఇప్పటికైనా అమర్ ఆ విషయాన్ని తెలుసుకుంటే మంచిది. అయితే శోభా తాను చేసేది తనకు కరెక్ట్ గానే ఉండచ్చు. కానీ, ఆడియన్స్ కి మాత్రం అది కరెక్ట్ అనిపించడం లేదు. మరి.. అమర్ విషయంలో శోభా చేసేది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom