iDreamPost
android-app
ios-app

తేజాతో క్లోజ్ కావడంపై శోభా సతమతం.. ప్రియుడు వదిలేస్తే..!

  • Published Nov 02, 2023 | 12:22 PM Updated Updated Dec 15, 2023 | 6:23 PM

బిగ్ బాస్ లో పాల్గొంటే కచ్చితంగా కెరీర్ లో భారీ మార్పులు జరగడం ఖాయం. అయితే అది పాజిటివ్ వైపు జరుగుతుందా? నెగిటివ్ వైపు జరుగుతుందా? అనేది మాత్రం వారి ఆటపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు శోభాశెట్టిలో కొత్త భయం ప్రారంభమైంది.

బిగ్ బాస్ లో పాల్గొంటే కచ్చితంగా కెరీర్ లో భారీ మార్పులు జరగడం ఖాయం. అయితే అది పాజిటివ్ వైపు జరుగుతుందా? నెగిటివ్ వైపు జరుగుతుందా? అనేది మాత్రం వారి ఆటపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు శోభాశెట్టిలో కొత్త భయం ప్రారంభమైంది.

  • Published Nov 02, 2023 | 12:22 PMUpdated Dec 15, 2023 | 6:23 PM
తేజాతో క్లోజ్ కావడంపై శోభా సతమతం.. ప్రియుడు వదిలేస్తే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకుల్లో కూడా కొత్త ఆలోచన, అనుమానం ఒకటి మొదలైంది. అది ఎవరి గురించో కాదు.. శోభాశెట్టి విషయంలోనే అలా జరుగుతోంది. తాజాగా శోభాశెట్టి- తేజాతో కూర్చుని మాట్లాడుతున్న సమయంలోనే ఈ డౌటనుమానం మొదలైంది. నిజానికి ఈ అనుమానం మొదలైంది శోభాలోనే. అది ప్రేక్షకుల బుర్రల్లో కూడా నాటుకుపోయింది. అదేంటంటే.. ఈ సీజన్ తర్వాత మరో జంట విడిపోబోతోందా? ఇది మనం అనుకుంటున్న మాట కాదు.. స్వయంగా శోభానే తన నోటితో ఈ విషయాన్ని డిస్కస్ చేసింది.

బిగ్ బాస్ వల్ల ఎంతటి క్రేజ్ వస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా కెరీర్ లో అటు ఇటుగా ఉన్న వారికి ఇది మంచి స్టేజ్ అవుతుంది. అయితే నాణేనికి రెండోవైపు కూడా ఉంటుంది. బిగ్ బాస్ వల్ల కెరీర్లు పాడు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ తర్వాత విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో జంట చేరోబోతోందా? అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. శోభాశెట్టి- తేజాతో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఈ అనుమానాన్ని లేవనెత్తింది. తన ప్రియుడు ఆమెను వదిలేస్తాడేమో? అంటూ భయపడింది. ఇన్ని రోజులు లేనిది కొత్తగా ఈ రోజు ఎందుకు శోభాలో ఈ భయం మొదలైంది అంటూ ప్రేక్షకులు కూడా తికమక పడుతున్నారు.

తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ.. “నమ్మకం ఉంది. అలాగే భయం కూడా ఉంది. అతను అర్థం చేసుకుంటాడు. వెల్ అండర్ స్టాండింగ్. ఒకవేళ ఏమైనా వాడికి నచ్చని విధంగా ప్రవర్తిస్తే.. ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు నీతో(తేజా) ఇలా ఉన్నాను అది నచ్చకపోవచ్చు. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే నేను తట్టుకోలేను. నేను అస్సలు తీసుకోలేను. గుర్తొస్తున్నాడు బాగా” అంటూ శోభాశెట్టి ఎమోషనల్ అయ్యింది. కళ్ల నీళ్లు పెట్టుకుంటూ తేజాతో ఈ విషయాన్ని వెల్లడించింది. శోభా మాటలపై తేజా స్పందించాడు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇలా అనుకుంటున్నావ్? నాదే ముంది కామెడీ పీస్ గాడిని అంటూ శోభాని ఓదార్చే ప్రయత్నం చేశాడు.

శోభా- తేజా మరీ హద్దుదాటి ప్రవర్తించినట్లు ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే హౌస్ లో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ముందురోజు ఎపిసోడ్ లో శోభా చెప్పిందని ఆమెను ఎత్తుకుని బాత్ రూమ్ కి తీసుకెళ్లి పళ్లు తోమాడు. తర్వాత స్నానం చేయించాలి అంటూ జోకులు కూడా వేశాడు. ఆ తర్వాత ఎపిసోడ్ లోనే శోభా ఇలా మాట్లాడటం చూస్తుంటే.. ఆమె మైండ్ లో ఒక అనుమానం ప్రారంభమైందనే చెప్పాలి. పైకి ఓవరాల్ ఆట గురించి చెప్పుకొచ్చినా కూడా.. తేజాతో మరీ క్లోజ్ అవుతున్నాను అనే భావన శోభాలో కలిగినట్లు అనిపిస్తోంది. అందుకే అలాంటి ఒక భయం శోభాలో ప్రారంభమైంది. మరి.. శోభా శెట్టి భయపడటంలో అర్థం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet