iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ కొడుకు! అబ్బా.. కన్నీరు పెట్టించేశారు!

  • Published Nov 07, 2023 | 12:56 PM Updated Updated Nov 07, 2023 | 12:59 PM

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తో యుద్ధవాతావరణం నెలకొంది. గొడవలు, కేకలతో అట్టుడికిపోయింది. కానీ, ఫ్యామిలీ వీక్ తో బిగ్ బాస్ హౌస్ టూ ఎమోషనల్ అయిపోయింది.

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తో యుద్ధవాతావరణం నెలకొంది. గొడవలు, కేకలతో అట్టుడికిపోయింది. కానీ, ఫ్యామిలీ వీక్ తో బిగ్ బాస్ హౌస్ టూ ఎమోషనల్ అయిపోయింది.

  • Published Nov 07, 2023 | 12:56 PMUpdated Nov 07, 2023 | 12:59 PM
బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ కొడుకు! అబ్బా.. కన్నీరు పెట్టించేశారు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. 9 వారాలు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా పదోవారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్స్ లో హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. నామినేషన్స్ చేసుకునే వాళ్లు కొట్టుకోవాల్సింది.. రాజమాతలే ఎక్కువ గొడవలు పడ్డారు. ఈ వీక్ అమ్మాయిలు నామినేషన్స్ లో ఉండరు అనుకున్న వారికి షాకిస్తూ.. ముగ్గురిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎంచుకోమన్నారు. 2 ఓట్లు ప్రియాంకకు, 2 ఓట్లు రతికాకి రావడంతో.. నిర్ణయాధికారం కెప్టెన్ కి ఇచ్చారు. శోభాశెట్టి రతికాని నామినేషన్స్ లో పెట్టింది. ఇంక నామినేషన్స్ లో హీటెక్కిన హౌస్, హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ ఎమోషనల్ గా ఏడిపించేశాడు. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో లీకులు వస్తున్నాయి. తాజాగా ప్రోమోతో బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. హౌస్ లోకి శివాజీ పెద్ద కుమారుడు వచ్చాడు. ఈ ప్రోమో మాత్రం చాలా ఎమోషనల్ గా సాగింది.

తాజాగా బిగ్ బాస్ ప్రోమో చూసి ఆడియన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ లో జరగబోయే ఫ్యామిలీ వీక్ శివాజీతో స్టార్ట్ చేశారు. హౌస్ లోకి శివాజీ కుమారుడిని ఒక డాక్టర్ లా పంపించారు. శివాజీని మెడికల్ రూమ్ కి రావాలంటూ అనౌన్స్ చేశారు. లోపలికి వచ్చిన తర్వాత చేయి ఎలా ఉంది? రెగ్యూలర్ గా ఎక్సర్ సైజెస్ చేస్తున్నారా? అంటూ అడిగాడు. అయితే శివాజీ మాత్రం వచ్చింది తన కొడుకు అని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే అప్పుడే ఫ్యామిలీ వీక్ ఉంటుంది అనుకోలేదు కాబట్టి.. ఎవరో డాక్టరే వచ్చింది అనుకున్నాడు. అంతా ఇంకో నాలుగు రోజుల్లో సెట్ అయిపోతుంది అంటూ చెప్పిన తర్వాత శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు.

వెంటనే ఆ డాక్టర్ నాన్న అని శివాజీని పిలుస్తాడు. అయితే శివాజీకి ఏం అర్థం కాదు. ఏంటి డాక్టర్ నాన్న అంటున్నాడు అంటూ చూస్తాడు. అప్పుడు ఫేస్ మాస్క్, క్యాప్ తీస్తాడు. ఇన్ని రోజుల తర్వాత కన్నకొడుకుని బిగ్ బాస్ హౌస్ లో చూసి శివాజీ ఎంత ఎమోషనల్ అయిపోయాడు. వెంటనే కొడుకుని పట్టుకుని ఏడ్చేశాడు. గట్టిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత మెడికల్ రూమ్ నుంచి కొడుకుని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చాడు. మై సన్ అంటూ అందరికీ పరిచయం చేశాడు. శివాజీ కుమారుడిని చూసి అందరూ షాకయ్యారు. అందరూ పరిగెత్తు కుంటూ వచ్చి అతడిని పరిచయం చేసుకుంటారు. హౌస్ మేట్స్ అంతా శివాజీ వాళ్ల అబ్బాయితో మాట్లాడారు. భోలే అయితే ఇంక నువ్వు బయటకు వెళ్లిపోవచ్చు.. అచ్చు నీకులాగానే ఉన్నాడు అంటూ చెప్పాడు.

అసలు చిన్నోడు వస్తాడు అనుకున్నాను నువ్వు వచ్చావ్ అన్నాడు. అందుకు అతను నేను యూనివర్సిటీకి వెళ్లిపోతున్నాను. ఇంక ఎన్ని నెలలకు కలుస్తామో తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాట వినగానే శివాజీ ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రోమో చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. అసలు ఇలాంటి ఒక ప్రోమో ఏ సీజన్లో చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ వీక్ ప్రోమోతో బిగ్ బాస్ అందరినీ ఏడిపించేశారు. అంతా ఇది కదా నాన్న ప్రేమంటే అంటూ ఎమోషనల్ అవుతున్నారు. మరి.. ఈ ఎమోషనల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio