iDreamPost
android-app
ios-app

Shivaji- Shobha Shetty: శోభాపై శివాలెత్తిన శివాజీ.. ఎంతరా అది అంటూ..!

  • Published Dec 09, 2023 | 3:06 PM Updated Updated Dec 09, 2023 | 3:06 PM

బిగ్ బాస్ హౌస్ లో ఫన్నీ టాస్కులు కూాడా ఫుల్ గొడవలకు దారి తీస్తున్నాయి. ఏ చిన్న రీజన్ దొరికినా తెగ అరిచేస్తున్నారు. ముఖ్యంగా శివాజీ- శోభాశెట్టి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఫన్నీ టాస్కులు కూాడా ఫుల్ గొడవలకు దారి తీస్తున్నాయి. ఏ చిన్న రీజన్ దొరికినా తెగ అరిచేస్తున్నారు. ముఖ్యంగా శివాజీ- శోభాశెట్టి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటోంది.

  • Published Dec 09, 2023 | 3:06 PMUpdated Dec 09, 2023 | 3:06 PM
Shivaji- Shobha Shetty: శోభాపై శివాలెత్తిన శివాజీ.. ఎంతరా అది అంటూ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే వీక్ కి చేరుకుంటారు. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా ఈసారి 13 రోజులపాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉంచారు. తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎవరికి అయితే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్లే ఈ సీజన్ విన్నర్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. మరి.. ఈసారి ఫలానా కంటెస్టెంట్ విన్నర్ అవుతారంటూ చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఆట పరంగా మాత్రం హౌస్ మేట్స్ అంతగా ప్రదర్శనలు చేయడం లేదు. కానీ, గొడవలతో బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు.

ముఖ్యంగా గత రెండ్రోజులుగా శోభా శెట్టి- శివాజీకి అస్సలు పడటం లేదు. వారి మధ్య గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఐదు నిమిషాల సమయం దొరికినా కూడా శివాజీ.. ప్రియాంక- శోభా- అమర్ మీద నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా శోభా- ప్రియాంక పేర్లు వినగానే ఒంటికాలు మీద లేస్తున్నాడు. మరోవైపు శోభాశెట్టి కూడా శివాజీని టార్గెట్ చేస్తూనే ఉంది. ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయే సమయానికి అసలు శివాజీని అందరికీ చూపిస్తానంటూ మంగమ్మ శపథం కూడా చేసింది. అలా చేయకపోతే తన పేరు శోభాశెట్టినే కాదు అంటూ డైలాగ్ కూడా కొట్టేసింది. కేవలం అతని వయసుకు మాత్రమే గౌరవం ఇస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది.

శుక్రవారం ఎపిసోడ్లో అయితే వీళ్లిద్దరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. సంచాలక్ గా ఉండి ప్రియాంకకు సపోర్ట్ చేస్తోంది అంటూ శోభాశెట్టిపై శివాజీ ఫైర్ అయ్యాడు. అలా ఎలా సపోర్ట్ చేస్తావ్ నువ్వు అంటూ కేకలు వేశాడు. అందుకు శోభాశెట్టి కోపంగా కాకుండా చాలా కూల్ గా వెటకారంగా రియాక్ట్ అయ్యింది. ఆమె అలా వెటకారం చేస్తుంటే శివాజీకి ఇంకా మండిపోయింది. ఆడపిల్ల అనే అడ్వాంటేజ్ తీసుకుని నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటూ సీరియస్ అయ్యాడు. వీళ్ల మధ్య ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే గత రెండ్రోజులుగా శివాజీ మాత్రం ప్రియాంక- శోభాల విషయంలో నోరుజారుతూనే ఉన్నాడు. అసలు వీళ్లు ఆడపిల్లలేనా? నేను బయట ఇంత పిచ్చి తెలియితేటలు ఉన్న ఆడపిల్లలను అస్సలు చూడలేదు అంటూ సీరియస్ అయ్యాడు. యావర్- ప్రశాంత్ లతో అయితే వాళ్లు మిమ్మల్ని గెలవనివ్వర్రా.. ఆడనివ్వరు అసలు అంటూ కామెంట్ చేశాడు.

గౌరవం ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవా? ఆర్టిస్టులే కాదా.. ఇక్కడ ఇలా అరిచి వేషాలేస్తే జనాలకు నచ్చేస్తామా? ఎంతరా అది.. నా బిడ్డ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మరో సందర్భంలో ఇంకాస్త సీరియస్ కామెంట్స్ చేశాడు. శోభా గురించి మాట్లాడుతూ అదే మన ఇంట్లో పిల్ల అయి ఉంటే మాత్రం గొంతు మీద కాలేసి తొక్కేవాడిని అంటూ నోరు జారేశాడు. అంతేకాకుండా వీళ్లు అసలు ఏం ఆడపిల్లలు? వీళ్లకు పెళ్లిళ్లు అయితే ఎలా అడ్జస్ట్ అవుతారు? వచ్చేవాడు వీళ్లని ఎలా భరిస్తాడు అంటూ వాళ్ల వ్యక్తిగత జీవితం మీద కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి శివాజీ మాత్రం ఆట సంగతి పక్కన పెడితే శోభా- ప్రియాంక- అమర్ మీద సందర్భం ఉన్నా లేకపోయినా మాటలు మాత్రం జారుతూనే ఉన్నాడు. మరి.. శివాజీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet