iDreamPost
android-app
ios-app

కొత్త సినిమా తీస్తున్న ‘స్పై’ సభ్యులు.. పేరేంటంటే..

  • Published Dec 28, 2023 | 10:55 AM Updated Updated Dec 28, 2023 | 11:13 AM

బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మంచి మిత్రులుగా మారిపోయారు శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌లు. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా అండదండగా ఉన్నారు.

బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మంచి మిత్రులుగా మారిపోయారు శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌లు. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా అండదండగా ఉన్నారు.

  • Published Dec 28, 2023 | 10:55 AMUpdated Dec 28, 2023 | 11:13 AM
కొత్త సినిమా తీస్తున్న ‘స్పై’ సభ్యులు.. పేరేంటంటే..

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగు ముగిసి దాదాపు పది రోజులు అవుతోంది. అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. గ్రాండ్‌ ఫినాలే రోజున చోటుచేసుకున్న సంఘటనల కారణంగా సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ జైలుకు సైతం వెళ్లివచ్చాడు. పల్లవి ప్రశాంత్‌ జైలు కెళ్లిన తర్వాత సీజన్‌లో అతడితో హౌస్‌లో ఉన్న వారు తమ మద్దతు తెలిపారు. పల్లవి ప్రశాంత్‌కు ఈ కష్ట సమయంలో అండగా ఉన్నారు. ఇక, ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్నపుడు మంచి మిత్రులుగా మారిన శివాజీ, యావర్‌లు కూడా ప్రశాంత్‌ జైలులో ఉన్న సమయంలో మద్దతుగానే ఉన్నారు.

జైలునుంచి వచ్చిన తర్వాత ప్రశాంత్‌ తనకు మద్దతుగా నిలిచిన వారిని కలిశాడు. వారితో స్పెషల్‌ లంచ్‌ సైతం చేశాడు. అంతేకాదు! స్పై టీమ్‌లోని ఇద్దరు సభ్యులు యావర్‌, ప్రశాంత్‌లు.. శివాజీ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ ఎమోషనల్‌ సంఘటనలు చాలానే జరిగాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. స్పై టీం అభిమానులకు శివాజీ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. స్పై టీం సభ్యులతో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. కొత్త సినిమా వివరాల గురించి పలు విషయాలను శివాజీ వెల్లడించారు.

big boss spy new movie

త్వరలో స్పై టీంలోని యావర్‌, ప్రశాంత్‌లతో కలిసి ఓ షార్ట్‌ మూవీ తీయబోతున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని అన్నారు. సినిమా టైటిల్‌ కూడా స్పై అని పెట్టినట్లు వెల్లడించారు. తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రశాంత్‌, యావర్‌ల అంత బాండింగ్‌ ఎవరితోనూ లేదని అన్నారు. వాళ్లిద్దరి కోసమే సినిమా తీస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అది షార్ట్‌ ఫిల్మ్‌లా వస్తుందా?.. ఫుల్‌ సినిమానా అన్న సంగతి త్వరలో చూస్తారని చెప్పారు. స్పై మూవీకీ ఓ డైరెక్టర్‌ లైన్‌ కూడా చెప్పాడని, రెండు మూడు నెలల్లోనే స్టోరీ సెట్స్‌ మీదకు వెళుతుందని తెలిపారు.

ప్రశాంత్‌, యావర్‌లకు కూడా ఈ విషయం చెప్పానన్నారు. యావర్‌ను సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేయమన్నానన్నారు. ప్రశాంత్‌కు దిష్టి తగిలిందని, అందుకే అరెస్ట్‌ అయ్యాడని అన్నారు. అరెస్ట్‌ అయిన మాత్రాన ఇక్కడ లైఫ్‌ మారిపోదని పేర్కొన్నారు. ‘‘ప్రశాంత్‌కు రెండు ముఖాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఈ సమాజంలో రెండు ముఖాలు లేని వాడు ఎవడు?. వాడి గెలుపు చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ సృష్టి అనేది అంతే.. ఎవరు? ఎప్పుడు? కలుస్తారో ఎవ్వరికీ తెలీదు. అంతా భగవంతుడి లీల. అందుకే నేను ప్రశాంత్‌, యావర్‌లను కలిశాను. స్పై సినిమా గురించి మిగిలిన విషయాలు త్వరలో చెప్తాను’’ అని అన్నారు. మరి, శివాజీ స్పై సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom