iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ- కెన్నీ కోడ్ లాంగ్వేజ్!.. కీలక విషయం లీక్!

  • Published Nov 08, 2023 | 7:42 PM Updated Updated Nov 08, 2023 | 7:42 PM

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ కెన్నీ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కెన్నీ కోడ్ లాంగ్వేజ్ ద్వారా తండ్రికి కీలక విషయాలను వెల్లడించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అప్పుడు సొహైల్, మెహబూబ్ ఇప్పుడు శివాజీ కెన్నీ అంటూ ఆరోపిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో శివాజీ కెన్నీ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కెన్నీ కోడ్ లాంగ్వేజ్ ద్వారా తండ్రికి కీలక విషయాలను వెల్లడించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అప్పుడు సొహైల్, మెహబూబ్ ఇప్పుడు శివాజీ కెన్నీ అంటూ ఆరోపిస్తున్నారు.

  • Published Nov 08, 2023 | 7:42 PMUpdated Nov 08, 2023 | 7:42 PM
బిగ్ బాస్ హౌస్ లో శివాజీ- కెన్నీ కోడ్ లాంగ్వేజ్!.. కీలక విషయం లీక్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రేక్షకాధరణతో దూసుకెళ్తోంది. హౌస్ లోని కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకుంటున్న కోపాలు, భావోద్వేగాలు షోపై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తున్నాయి. ఇప్పటికే పది వారాలు పూర్తైన బిగ్ బాస్ లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ఆయన కొడుకు మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్యామిలీ వీక్ నేపథ్యంలో తండ్రిని కలిసేందుకు వచ్చాడు కెన్నీ. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య చోటుచేసుకున్న రహస్య సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కెన్నీ కోడ్ లాంగ్వేజ్ తో కీలక సమాచారాన్ని లీక్ చేశాడని చర్చించుకుంటున్నారు. అంతేగాక బిగ్ బాస్ సీజన్ 4లో సొహైల్, మెహబూబ్ మధ్య జరిగిన కోడ్ లాంగ్వేజ్ మాదిరిగానే శివాజీ- కెన్నీ వ్యవహారం ఉందంటూ ఆరోపిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి తండ్రిని కలిసేందుకు వచ్చిన కెన్నీని చూసి శివాజీ భావోద్వేగానికి లోనయ్యాడు. గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తర్వాత తండ్రీ కొడుకులు సోఫాలో కూర్చున్నారు. ఈ సమయంలో కెన్నీ తండ్రితో మాట్లాడుతూ.. హౌస్ లో ఎవరు రెచ్చగొట్టినా ఓవర్ గా రియాక్ట్ అవ్వొద్దు. రానున్న ఫైనల్ వీక్స్ లో మరింత రెచ్చగొడతారని సలహా ఇచ్చాడు. ఈ సంభాషణ జరుగుతుండగా… కెన్నీ చేతిని శివాజీ వేలితో గోకాడు. కెన్నీ తండ్రి తొడపై చేయి వేసి ఏదో రాసినట్లుగా ఉంది. శివాజీ గోకడాన్ని బిగ్ బాస్ హౌస్లోని కెమెరాలు హైలెట్ చేశాయి. దీంతో ఆ వ్యవహారం వైరల్ గా మారింది. శివాజీ-కెన్నీ కోడ్ లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. టైటిల్ రేసులో ఎవరున్నారు. పోటీ ఎవరి మధ్య అనే విషయాలను కెన్నీ లీక్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

కాగా బిగ్ బాస్ సీజన్ 4 లో సొహైల్, మెహబూబ్ మధ్య కూడా ఇలాంటి వ్యవహారమే చోటుచేసుకుంది. ఫైనల్స్ కు ముందు అప్పటికే ఎలిమినేట్ అయిన మెహబూబ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటి నుంచి వచ్చిన వారు నేరుగా హౌస్ లోని వారిని కలవకుండా గ్లాస్ అడ్డం పెట్టి ఉంచారు. ఆ సమయంలో మెహబూబ్ సోహైల్ తో మాట్లాడుతూ.. అద్దం మీద సోహైల్ కి ఏదో హింట్ ఇస్తున్నట్లుగా వేళ్ళతో సైగలు చేశాడు. సొహైల్ మూడో స్థానంలో ఉన్నట్లుగా మెహబూబ్ కోడ్ లాంగ్వేజ్ లో చెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫైనల్ లో సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బు తీసుకుని హౌస్ నుంచి నిష్క్రమించాడని చర్చ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో శివాజీ, కెన్నీ మధ్య జరిగిన కోడ్ లాంగ్వేజ్ ఉందంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş