iDreamPost
android-app
ios-app

పదే పదే మాటలు మారుస్తున్న శివాజీ! నామినేషన్స్ లో..

  • Published Nov 21, 2023 | 12:02 PM Updated Updated Dec 11, 2023 | 1:24 PM

బిగ్ బాస్ హౌస్ లో యాక్టర్ శివాజీని అందరూ పెద్దయ్య అంటూ పెద్ద దిక్కులా భావిస్తూ ఉన్నారు. కానీ, ఆ పెద్దయ్య మాత్రం సమయం దొరికినప్పుడల్లా మాటలు మారుస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో యాక్టర్ శివాజీని అందరూ పెద్దయ్య అంటూ పెద్ద దిక్కులా భావిస్తూ ఉన్నారు. కానీ, ఆ పెద్దయ్య మాత్రం సమయం దొరికినప్పుడల్లా మాటలు మారుస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు.

  • Published Nov 21, 2023 | 12:02 PMUpdated Dec 11, 2023 | 1:24 PM
పదే పదే మాటలు మారుస్తున్న శివాజీ! నామినేషన్స్ లో..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట అంతా ఉత్కంఠగా సాగుతోంది. ఎవరికి వాళ్లు గెలుపు కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక వీకెండ్ తర్వతే హౌస్ లో అసలైన ఆట మొదలవుతుంది. నామినేషన్స్ లో అందరూ రకరకాల పాయింట్లు చెబుతూ రచ్చ రచ్చ చేశారు. అయితే నామినేషన్స్ సమయంలో అసలు ఆట మాత్రమే కాదు.. అసలు రంగు కూడా కనిపిస్తుంది. నిన్న నామినేషన్స్ లో శివాజీ అసలు రంగు ఏంటో ప్రేక్షకులకు మళ్లీ తెలిసింది. తాను చెప్పిన మాటను తానే పదే పదే మారుస్తూ వచ్చాడు. నిన్న కూడా మాట మారుస్తూ శివాజీ ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అసలు మాట ఏంటి? శివాజీ ఎందుకు మాట మారుస్తున్నాడు చూద్దాం.

నామినేషన్స్ లో శివాజీని గౌతమ్ నామినేట్ చేశాడు. ఆ సమయంలో గౌతమ్ చెప్పిన పాయింట్స్ కి సమాధానం చెప్పే క్రమంలో శివాజీ కొన్ని పాయింట్స్ ఫ్లిప్ చేశాడు. గౌతమ్ మాట్లాడుతూ.. “బ్యాలెన్సింగ్ గేమ్ తర్వాత మీరు స్ట్రాటజీ ప్రకారం గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అసలు యావర్ ఆట చూడనే లేదు. మళ్లీ యావర్ కోసం మీరు ఎలా గొడవకు దిగారు? మీరు రాంగ్ స్టాండ్ తీసుకున్నారు” అంటూ గౌతమ్ తాను అనుకున్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పాడు. అయితే శివాజీ మాత్రం ఆ పాయింట్స్ ని అంగీకరించలేదు. “నాది రాంగ్ స్టాండ్ అని నువ్వు ఎలా చెప్తావ్? నేను నాకోసం గొడవ పడ్డాను అనుకోవచ్చు కదా?” అంటూ గౌతమ్ ని ప్రశ్నించాడు.

అయితే ఆ ప్రశ్న అడగకుండా ఉంటే శివాజీ మీద ఆడియన్స్ అభిప్రాయం మారేది కాదేమో? కానీ, ఆ ప్రశ్న అగడంతో శివాజీ అసలు రంగు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆరోజు శోభాతో స్వయంగా శివాజీనే చెప్పాడు.  “నేను ఆ గేమ్ లో ఎందుకు గెలుస్తాను? నేను పిచ్చోడినా.. నేను ఎలా ఆడోనో నాకు తెలీదా? సరైన నిర్ణయం తీసుకో అని మాత్రమే నిన్ను అలర్ట్ చేస్తున్నాను” అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఆరోజు అలా చెప్పిన శివాజీ ఈరోజు తనకోసం గొడవ పడ్డాను అనుకోవచ్చు కదా అని ఎలా అడుగుతాడు? ఒకవేళ తనకోసం ఆ గొడవ పడితే ఆరోజు యావర్ కోసం అలా చేశాను అని ఎందుకు బిల్డప్ ఇచ్చాడు? యావర్ గెలిచినట్లు ప్రకటించగానే.. ఏదో తానే విన్ అయినట్లు ఎందుకు అంత హంగామా చేశాడు? అంటే శివాజీ ఒక మాట మీద ఉండటం లేదు.

పదే పదే మాట మారుస్తున్నాడు. అలాగే నేను ఎవరికీ నామినేషన్ గురించి, ఆట గురించి చెప్పను అని కామెంట్ చేస్తే.. అదే సమయంలో హోస్ట్ నాగార్జున పట్టించారు. నువ్వు ఇచ్చిన గైడెన్స్ తో నేగా రతిక నామినేషన్స్ లో చెలరేగిపోయింది అంటూ గాలి తీసేశారు. కానీ, ఇప్పటికీ శివాజీ మాత్రం పదే పదే మాట మారుస్తూనే ఉన్నాడు. నిన్న నామినేషన్స్ లో శివాజీ మీద క్లియర్ గా గౌతమ్ పైచేయి సాధించినట్లు తెలిసిపోయింది. శివాజీ పైకి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా దొరికిపోయాడు అనే విషయం అయితే క్లియర్ గానే ఉంది. మరి.. హౌస్ లో శివాజీ మారుస్తున్న మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet