iDreamPost
android-app
ios-app

యావర్- ప్రశాంత్ మధ్య చిచ్చు పెట్టిన శివాజీ.. వాటే స్ట్రాటజీ!

  • Published Oct 04, 2023 | 12:07 PM Updated Updated Oct 04, 2023 | 12:07 PM
  • Published Oct 04, 2023 | 12:07 PMUpdated Oct 04, 2023 | 12:07 PM
యావర్- ప్రశాంత్ మధ్య చిచ్చు పెట్టిన శివాజీ.. వాటే స్ట్రాటజీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కొత్త ఆట మొదలైంది. సీజన్ లో మొదటి కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న హౌస్ మేట్ కాన్సెప్ట్ కి బిగ్ బాస్ ముగింపు పలికాడు. ఇంక అంతా సాధారణ సీజన్స్ మాదిరి కెప్టెన్సీ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. తొలి కెప్టెన్ అయ్యేందుకు హౌస్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ 5 జంటలుగా విడిపోయి పోరాడుతున్నారు. తొలి ఛాలెంజ్ కి సంబంధించి గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్లు మేము ముందు పూర్తి చేశాం అంటే మేము ముందు పూర్తి చేశాం అంటూ నానా యాగి చేస్తున్నారు.

బిగ్ బాస్ కూడా పెద్ద మెలిక పెట్టాడు. యావర్- శోభాశెట్టి గేమ్ ఆడాలి.. అలాగే సంచాలకులుగా వ్యవహరించాలి. చివర్లో ఎవరు ముందు పూర్తి చేశారు అనే విషయాన్ని బిగ్ బాస్ కి చెప్పాలి. అలా అయితేనే గొడవలు జరుగుతాయని.. ఎవరి నిజ స్వరూపం అంటే ఏంటో అందరికీ తెలస్తుందని ఆ స్ట్రాటజీ వాడినట్లు అనిపించింది. అనుకున్నట్లుగానే విజేతల విషయంలో కాస్త గట్టిగానే గొడవ జరిగింది. శోభాశెట్టిది ఫౌల్ అని యావర్ అనగానే దెబ్బకు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అలా సంచాలకులు చాలాసార్లు గొడవలు పడ్డారు. మిగిలిన వాళ్లు వీళ్ల మీద అరిచారు. అమర్ అయితే తమకు జరిగిందని.. శివాజీ- ప్రశాంత్ వాళ్లు తమకు అన్యాయం జరిగిందని గట్టిగా గొడవ చేశారు. ఇంక శోభా సంచాలకురాలిగా ఉండి తమకు అన్యాయం చేసిందని ప్రియాంక ఎవరి వర్షన్ వాళ్లు చెబుతున్నారు.

ఈ ఆట మంగళవారం ఎపిసోడ్ లో పూర్తి కాలేదు. బుధవారం ఎపిసోడ్ కి కూడా ప్రొలాంగ్ అయింది. అందుకు సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తిగా సాగింది. ఎందుకంటే టాస్క్ పూర్తైన దగ్గరి నుంచి శివాజీ కాస్త తేడాగానే ప్రవర్తిస్తున్నాడు. ఫౌల్ ఉందని యావర్ చెప్పగానే స్టాండ్ ని కాలితో తన్ని వెళ్లిపోయాడు. ఇంక తాజాగా అస్సలు యావర్ నిర్ణయాలే తప్పు.. అతను పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా నీకు ప్రశాంత్ అంటే నచ్చదు అంటూ పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు. ప్రశాంత్ కూడా యావర్ మీద కోపంతో అమర్ దీప్ వాళ్ల దగ్గర కూర్చుని యావర్ ది తప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. మరోవైపు శివాజీ వెళ్లి శోభాని ఓదార్చుతున్నాడు. ఇదంతా చూస్తుంటే యావర్ ని శివాజీ తన నెక్ట్స్ టార్గెట్ గా తీసుకున్నాడు అనిపిస్తోంది.

ప్రశాంత్ అంటే నీకు నచ్చదు అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ మాట అనగానే యావర్ విలవిల్లాడిపోయాడు. అయితే ఈ టాస్కులో యావర్ తప్పుకూడా ఉంది. కానీ, అంత పెద్ద మాట అనేముందు ఆలోచించుకుంటే బాగుండేది. ఇంక హౌస్ మేట్స్ అంతా కూడా యావర్ ది తప్పు అంటూ గట్టిగానే చెబుతున్నారు. ఈ పాయింట్ మీద యావర్ కు నామినేషన్స్ గట్టిగానే పడతాయి. అలాగే ఇప్పటి వరకు ఉన్న పేరు మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు అంటూ అమర్ కామెంట్స్ చేస్తున్నాడు. ప్రోమో చివర్లో చూస్తే శివాజీ వెళ్లి యావర్ ను ఓదార్చుతూ కనిపించాడు. అయితే ఇది చూడగానే పిర్ర గిల్లి జోలపాడటం అంటే ఇదేనేమో అనే సామెత గుర్తొస్తుంది. అనాల్సింది అనేసి చివర్లో వెళ్లి ఊరుకే బేటా అంటూ ఓదారుస్తూ కనిపించాడు. మరి.. యావర్- ప్రశాంత్ మధ్య శివాజీ పెట్టిన చిచ్చు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş