iDreamPost
android-app
ios-app

Shivaji: తప్పు తెలుసుకున్న శివాజీ.. శోభా- ప్రియాంకలకు క్షమాపణలు!

  • Published Dec 10, 2023 | 12:58 PM Updated Updated Dec 10, 2023 | 12:58 PM

14వ వారం హౌస్ లో చాలానే గొడవలు జరిగాయి. వాటిలో మరీ ముఖ్యంగా శివాజీ- శోభా శెట్టిల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అదే విషయంపై హోస్ట్ నాగార్జున కూడా గట్టిగానే క్లాస్ పీకారు.

14వ వారం హౌస్ లో చాలానే గొడవలు జరిగాయి. వాటిలో మరీ ముఖ్యంగా శివాజీ- శోభా శెట్టిల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అదే విషయంపై హోస్ట్ నాగార్జున కూడా గట్టిగానే క్లాస్ పీకారు.

  • Published Dec 10, 2023 | 12:58 PMUpdated Dec 10, 2023 | 12:58 PM
Shivaji: తప్పు తెలుసుకున్న శివాజీ.. శోభా- ప్రియాంకలకు క్షమాపణలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్స్ అందరూ తమ తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. అలాగే తోటి సభ్యుల మీద పైచేయి సాధించేందుకు కూడా పోరాడుతున్నారు. ఉన్న ఏడుగురిలో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే వీక్ కి చేరుకుంటారు. వాళ్లల్లో కేవలం ఒకరు మాత్రమే విన్నర్ అవుతారు. ఇప్పటికే శోభా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని చెబుతున్నారు. అంతేకాకుండా నెక్ట్స్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున అందరికీ క్లాసులు పీకిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శివాజీ ఇష్యూ బాగా హైలెట్ అయ్యింది. అతను అన్న మాటలకు ప్రియాంక, శోభాలకు సారీ కూడా చెప్పాడు.

హౌస్ లో శివాజీకి శోభా- ప్రియాంకలకు అస్సలు పడటం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శోభా- శివాజీ మధ్య గత వారం మొత్తం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. ఈ వీక్ లో కూడా శోభా గురించి శివాజీ చాలా కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా “అసలు వాళ్లు ఆడ పిల్లలేనా? అంత పిచ్చి తెలివితేటలు ఉన్న అమ్మాయిలను నేను బయట ఎక్కడా చూడలేదు. వీళ్లకు పెళ్లిళ్లు అయితే వచ్చేవాడు ఎలా భరిస్తాడు. అసలు అడ్జస్ట్ అవుతారా? మా ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే ఒకటి పీకేవాడిని.. ఇలాంటి అమ్మాయిలు ఉంటే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని” వంటి కామెంట్లు చేయడం చూశాం.

ఇవే కామెంట్స్ గూరించి నాగార్జున కూడా శివాజీకి క్లాస్ పీకాడు. అలా ఎలా మాట్లాడతావు? హౌస్ లో ఉన్న పెద్దవాడివి నువ్వే ఇలా మాట్లాడతావా? బయట ఉన్న అమ్మాయిలు అందరూ ఇప్పుడు నెగిటివ్ గా చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు శివాజీ కాస్త సీరియస్ గానే సమాధానం చెప్పాడు. నా సహనం చచ్చిపోయిందండి. ఎంతని చూస్తాను? నేను ముందే చెప్పాను.. నేను లైన్ క్రాస్ అవుతాను అని. ఎంతసేపు వాళ్లు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు. ప్రశాంత్ తో అయితే మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు. నేను మా ఇంట్లో ఆడపిల్లల గురించి చెప్పాను. అందరినీ దీనిలో ఎందుకు లాగుతారు? అంటూ ప్రశ్నించాడు. అయితే నాగార్జున మాత్రం అది ముమ్మాటికీ తప్పే అంటూ వ్యాఖానించాడు.

అంతేకాకుండా నేను నీ ప్లేస్ ఉంటే కచ్చితంగా సారీ చెప్తాను. నువ్వు కూడా సారీ చెప్తే బాగుంటుంది. కానీ, అది కేవలం నీ నిర్ణయం మాత్రమే అంటూ హోస్ట్ చెప్పుకొచ్చారు. అందుకు శివాజీ ఏమనుకున్నాడో ఏమో.. బయటకు వచ్చిన తర్వాత శోభా- ప్రియాంకలకు క్షమాపణ చెప్పాడు. అయితే అసలు మాట గురించి ప్రస్తావించలేదు. ఒకటి పీకే వాడిని అనే మాట మాత్రమే చెప్పి.. ఏదో కోపంలో అలా అనేశాను. మీ దగ్గర అనలేదు అంటూ సారీ అమ్మ అని చెప్పాడు. మొత్తానికి ఈ విషయాన్ని మరీ లాగకూడదు అని శివాజీ ఫిక్స్ అయ్యి సారీ చెప్పినట్లు అనిపించింది. హౌస్ లో ఆట గురించి మాత్రమే కాకుండా.. వారి పెళ్లిళ్లు, బయటి జీవితం గురించి శివాజీ కామెంట్స్ చేయడంతో బయట కూడా నెగిటివిటీ వచ్చింది. మరి శివాజీ.. శోభా- ప్రియాంకలకు క్షమాపణ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet