iDreamPost
android-app
ios-app

రతికా కన్నీరు రాహుల్ సిప్లిగంజ్ కోసమేనా? బ్రేకప్ స్టోరీ..

రతికా కన్నీరు రాహుల్ సిప్లిగంజ్ కోసమేనా? బ్రేకప్ స్టోరీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఇప్పటివరకు రతికా రోజ్ పై చాలా నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. ఆమె ఇంట్లో ఏం పనులు చేయడం లేదని.. పల్లవి ప్రశాంత్ ఆట కూడా చెడగొడుతోందంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ, ఒకే ఒక్క ఎపిసోడ్ తో రతికా రోజ్ గ్రాఫ్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుల్లో రతికాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. రతికా గుండెల్లో ఎంతో బాధ దాచుకుని ఈ బిగ్ బాస్ గేమ్ ఆడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. రతికాకు మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామంటూ చెబుతున్నారు. అసలు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం లేకపోలేదు. రతికా లవ్ బ్రేకప్ స్టోరీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాతే ఆమెపై సింపథీ పెరిగిపోతోంది.

రతికా రోజ్ కు లవ్ బ్రేకప్ అయింది అని బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ రోజే స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున చెప్పాడు. అయితే ఆ మాజీ ప్రియుడు మరెవరో కాదు.. స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటూ చెబుతున్నారు. అయితే అందుకు ఏమైనా ప్రూవ్స్ ఉన్నాయా అంటే? లేవనే చెప్పాలి. కానీ, రతికా స్టేజ్ మీద అడుగు పెట్టినప్పటి నుంచి గురువారం ఎపిసోడ్ లో మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుని ఏడ్చిన వరకు జరిగింది మొత్తం డీ కోడ్ చేసి రాహుల్ సిప్లిగంజ్.. రతికా మాజీ ప్రియుడు అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇలా చెబితే మీకు కాస్త కంఫ్యూజింగ్ అనిపించవచ్చు. ఆ డీకోడ్ ఏంటో మనం కూడా చేద్దాం రండి.

స్టేజ్ మీదకు రతికా వచ్చిన తర్వాత హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ బ్రేకప్ నుంచి బయటకు వచ్చావా? అంటూ అడుగుతాడు. అందుకు రతికా నవ్వుతూనే నాగార్జునకు కౌంటర్ ఇస్తుంది. ‘చేసిందంతా చేసి.. ఎంత బాగా అడుగుతున్నారో’ అంటూ కామెంట్ చేసింది. నేనేం చేశాను అంటూ నాగార్జున ప్రశ్నించగా.. “అంతా మీరే చేశారు.. ఏం తెలియనట్లు బ్రేకప్ నుంచి బయటకు వచ్చావా?” అంటూ అడుగుతున్నారని సమాధానం చెబుతుంది. నేను ఏం చేశానో చెప్పు అని నాగార్జున ప్రశ్నించగా.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొత్తం అర్థమవుతుంది అంటూ సమాధానం చెప్పకుండా స్కిప్ చేసింది. సరే.. మీ మాజీ ప్రియుడిని ఇమిటేట్ చెయ్యి అని నాగార్జున అడగ్గా.. అంటే ఇప్పుడు పాట పాడాలా? అని తిరిగి ప్రశ్నిస్తుంది. అంటే రతికా రోజ్ మాజీ ప్రియుడు ఒక సింగర్ అని అందరికీ అర్థమైపోయింది.

అంత మాత్రానికే రాహుల్ సిప్లిగంజ్ అని ఎలా చెబుతారు అనే అనుమానం రావచ్చు. గురువారం ప్రోమోలో రతికా రోజ్ తన మాజీ ప్రియుడిని తల్చుకుని ఫీలవుతుంది. ఆ సీన్ చూపించే సమయంలో బిగ్ బాస్ పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్నుమూయు వేళ అనే పాటను ప్లే చేశాడు. కానీ, ఎపిసోడ్ లో మాత్రం ఉడతా ఉడతా ఊచ్ అనే పాటను వేశారు. అందరూ ఈ పాట వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్.. రతికా మాజీ ప్రియుడు అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పునర్నవి భూపాలం కోసం పాడాడు. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది.. సంథింగ్ ఈజ్ ఫిషీ అనే అనుమానం వచ్చేలా BGMలు, సాంగ్లు వేశారు. అలాగే వాళ్లు కూడా స్క్రీన్ స్పేస్ కోసం కాస్త గట్టిగానే ప్రయత్నించారు. ఆ మొత్తాన్ని హౌస్టుగా ఉన్న నాగార్జునానే రివీల్ చేశారు.

రాహుల్ సిప్లిగంజ్– పునర్నవి భూపాలం మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అంటూ అప్పట్లో నాగార్జున చేసిన కామెంట్స్ కే.. రతికా ఈ సీజన్ లో కౌంటర్ ఇచ్చింది. మొత్తం మీరే చేశారు అంటూ నాగార్జునాకే చురకలు అంటించింది. హౌస్ లో బిగ్ బాస్ మాట్లాడుతున్నప్పుడు కూడా.. మీరు ఇప్పుడు దాకా పాటలు పాడారు. మీకొకటి వినిపించాలి అనుకుంటున్నాను అంటాడు. అందుకు రతికా నాకోసం పాట ఏమైనా పాడాడా ఏంటి? అంటూ ప్రశ్నిస్తుంది. ఇంక వీళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అంటే.. గతంలో రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. 2019లో హేయ్ పిల్లా అనే సాంగ్ లో రాహుల్ సరసన రతికా నటించింది. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం కుదిరినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్తా.. ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఆ తర్వాతే రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3కి వెళ్లాడు. బిగ్ బాస్ హౌస్ లో పునర్నవితో క్లోజ్ గా ఉండటం వల్లే వీరి మధ్య విబేధాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ బ్రేకప్ స్టోరీ విన్న తర్వాత రతికా రోజ్ పై నెట్టింట పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె తన గుండెల్లో ఎంతో బాధను దాచుకుంది అంటున్నారు. పైకి మాత్రం ఎంతో చక్కగా నవ్వుతూ.. అందరినీ నవ్విస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి రతికా- రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş