iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: రూటు మార్చిన రతిక.. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే..!

  • Published Oct 23, 2023 | 12:02 PM Updated Updated Oct 23, 2023 | 12:02 PM

బిగ్ బాస్ ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కు షాకిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆమె హౌస్ లోకి రావడం ఇద్దరు, ముగ్గురికి తప్పితే పెద్దగా ఎవరికీ అంత నచ్చినట్లు అనిపించలేదు. కానీ, పైకి మాత్రం నవ్వుతూ రతికాకి స్వాగతం చెప్పారు. రతికా రోజ్ కూడా ఆమెకు తక్కువ ఓట్లు వేశారు కాబట్టే హౌస్ లోకి వచ్చింది అనే విషయాన్ని పైకి చూపించలేదు.

బిగ్ బాస్ ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కు షాకిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆమె హౌస్ లోకి రావడం ఇద్దరు, ముగ్గురికి తప్పితే పెద్దగా ఎవరికీ అంత నచ్చినట్లు అనిపించలేదు. కానీ, పైకి మాత్రం నవ్వుతూ రతికాకి స్వాగతం చెప్పారు. రతికా రోజ్ కూడా ఆమెకు తక్కువ ఓట్లు వేశారు కాబట్టే హౌస్ లోకి వచ్చింది అనే విషయాన్ని పైకి చూపించలేదు.

  • Published Oct 23, 2023 | 12:02 PMUpdated Oct 23, 2023 | 12:02 PM
Bigg Boss 7 Telugu: రూటు మార్చిన రతిక.. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ వెల్లివిరిస్తోంది. అటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో కూడా దసరా పండుగ సెలబ్రేషన్స్ చూశాం. అలాగే ఏడోవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కావడం చూసి ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాం. ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లోకి రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండో ఛాన్స్ ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను అంటూ మాటిచ్చింది. మళ్లీ ఆటతో టాప్ కి చేరుకుంటాను అంటూ స్టేజ్ మీద ప్రామిస్ కూడా చేసింది. అయితే లైఫ్ అయినా, ఆటైనా రెండో అవకాశం వస్తే.. ఎవరైనా చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. రతికా రోజ్ కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సండే ఎపిసోడ్ అయిపోయి నాగార్జున సెండాఫ్ చెప్పిన తర్వాత రతికా రోజ్ ని హౌస్ లోకి పంపారు. హౌస్ లోకి వచ్చీ రాగానే శివాజీని చూసింది. శివాజీ కూడా రతికాను చూసి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆమె వచ్చి శివాజీని గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అయ్యింది. హౌస్ లోని అందరూ వచ్చి రతికా రోజ్ కు స్వాగతం పలికారు. టేస్టీ తేజ అయితే ఆమెకు అన్నం తినిపించి మరీ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాడు. మరోవైపు తను, యావర్, ఇప్పుడు రతికాతో కలిపి ముగ్గురు తిండి కోసమే ఉన్నామేమో అన్నట్లు కామెంట్ చేశాడు. ఇంకి ప్రియాంక కూడా రతికాను హగ్ చేసుకుని వెల్ కమ్ చెప్పింది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఓట్ల గురించి చెప్పారా? ఎవరు నీకు ఓటేశారు తెలిసిందా? చూపించారా? అంటూ ప్రశ్నలు విసిరారు. వాటికి రతికా రోజ్ సమాధానం చెప్పకుండా దాటేసింది.

హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ప్రశాంత్ కాస్త దూరంగానే ఉన్నాడు. ఈసారి కూడా రతికా రోజ్.. ప్రశాంత్ తో మాట్లాడదు అనుకున్నారు. ప్రశాంత్ కూడా అంతే దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి రసగుల్లా తీసుకొచ్చి రతికాకి తినిపించాడు. ఆమె ఆ రసగుల్లా తింటూ అన్నా మల్లచ్చినా అంటూ ప్రశాంత్ సిగ్నేచర్ డైలాగ్ చెప్పింది. ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లి శివాజీతో మాట్లాడింది. అంతేకాకుండా శివాజీ కాళ్ల మీద పడింది. ఏదో కోపంలో అలా చేశాను. ఎలిమినేషన్ అనగానే మాటలు రాలేదు. మాట్లాడితే ఏడుపు వస్తోంది. ఏడవకూడదు అనుకున్నాను. నీతో అసలు మాట్లాడలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. కాళ్ల మీద పడగానే.. అలా చేయద్దు అంటూ శివాజీ వారించాడు. నువ్వు నా బిడ్డవి అంటూ చెప్పాడు. తప్పు చేశాను.. క్షమించు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని చెప్పింది. ఇదంతా చూసిన తర్వాత రతికా రోజ్ రీ ఎంట్రీతో రూటు మార్చింది అనే చెప్పాలి.

రతికా రోజ్ ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అనుకోవాలి. ఎందుకంటే ఆమె హౌస్ లోకి రావడానికి కారణం.. ఆమెకు తక్కువ ఓట్లు రావడం. అంటే హౌస్ లో ఉన్నవాళ్లు ఆమె హౌస్ లోకి రాకూడదు అంటూ ఓటేశారు. అందుకే ఆమె హౌస్ లోకి వచ్చింది. కాబట్టి.. ఇప్పుడు ఆమెను ఎవరైతే హౌస్ లోకి రావద్దు అన్నారో.. వారిపై రతికా రోజ్ రివేంజ్ ఏమైనా ప్లాన్ చేస్తుందా? మళ్లీ నెగిటివ్ అవుతుందనే భయంతో కామ్ గా ఉంటుందా? చూడాలి. అయితే శివాజీ కాళ్లు మొక్కడం కూడా గేమ్ లో భాగమనే చెబుతున్నారు. ఎందుకంటే.. శివాజీ ఫ్యాన్స్ ఓట్ల కోసం రతికా ఇప్పటి నుంచే స్ట్రాటజీ స్టార్ట్ చేసింది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి.. రతికా రోజ్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet