iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ పై రతిక ఫైర్.. హౌస్ లో అసలు ఏం చేస్తున్నావ్ అంటూ..!

  • Published Sep 11, 2023 | 4:51 PM Updated Updated Sep 11, 2023 | 4:51 PM
  • Published Sep 11, 2023 | 4:51 PMUpdated Sep 11, 2023 | 4:51 PM
ప్రశాంత్ పై రతిక ఫైర్.. హౌస్ లో అసలు ఏం చేస్తున్నావ్ అంటూ..!

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఫన్ డే అని చెబుతారు. కానీ, నిజానికి నామినేషన్స్ రోజే హౌస్ లో అసలైన ఫన్ ఉంటుంది. తొలివారం ఫేస్ టూ ఫేస్ నామినేషన్స్ కాకపోవడంతో పెద్దగా ఆసక్తి రేకెత్తించలేదు. కానీ, ఈ వారం మాత్రం నామినేషన్స్ ఫుల్ హీట్ గా సాగాయి. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై హౌస్ లో ఉన్న వాళ్లంతా రెచ్చిపోయినట్లు కనిపించింది. అందరూ ఫైర్ అవడం ఒకెత్తు అయితే.. రతికా రోజ్ కూడా ప్రశాంత్ పై సీరియస్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి.. రతికా ఎందుకు పల్లవి ప్రశాంత్ పై సీరియస్ అయింది అనుకుంటున్నారు.

నిజానికి ఈ నామినేషన్స్ లో చాలా మంది పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశారు. ఒకరి తర్వాత ఒకళ్లు వారి కారణాలు చెప్పారు. ఆ కారణాల్లో ముఖ్యంగా అతను సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలా చెప్పారు. ప్రతిసారి రైతుబిడ్డ అనే కార్డు తీసుకువచ్చి సింపథీ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. అసలు ఎందుకు అతను ప్రతిసారి అలా మాట్లాడుతాడు అంటూ ప్రశ్నించారు. పల్లవి ప్రశాంత్ అలా రైతుబిడ్డ అంటే తమపై నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుందని ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు మొదటి నుంచి భయపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా అతనికి చెప్పింది లేదు. కానీ, ఈసారి నామినేషన్స్ లో మాత్రం అందరూ ఓపెన్ అయ్యారు. డాక్టర్ గౌతమ్ కూడా తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాడు.

ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేస్తే నీకు లక్ష రూపాయలు వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ డబ్బుని తాను తీసుకోనని.. ఎవరైనా రైతులకు ఇస్తానంటూ పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఈ సమాధానాన్ని అమర్ దీప్ ఖండించాడు. నువ్వు ఎందుకు ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా లాగేవ్యక్తికి ఇవ్వవు అని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఆట సందీప్ కూడా తన అభిప్రాయాన్ని వినిపించాడు. ఇక్కడ ఉన్న వారంతా రైతు బిడ్డలే అని చెప్పాడు. తమ తాతలు కూడ వ్యవసాయం చేశారన్నారు. కానీ, తాము ఎప్పుడూ అలా చెప్పుకోవడం లేదని చెప్పారు. ఇలా రైతు బిడ్డ అనే పదంవాడి సింపథీ ఓట్లు కొట్టేయాలని చూడద్దు అన్నట్లుగా ఇంట్లోని సభ్యులు చెప్పారు. ఈ సమయంలో రతికా రోజ్ కూడా పల్లవి ప్రశాంత్ పై సీరియస్ అవుతుంది. అమర్ దీప్, గౌతమ్, ఆట సందీప్ చెబుతున్న వ్యాఖ్యలతో ఆమె కూడా ఏకీభవించినట్లు కనిపించింది. రైతుబిడ్డ అని చెప్పుకోవడం రతికాకి కూడా ఇష్టం లేదు అన్నట్లుగా కనిపించింది.

అందరూ ఒకటై తనపై విరుచుకుపడటంతో పల్లవి ప్రశాంత్ తన కష్టాన్ని చెప్పుకోవాలని చూశాడు. తాను ఎంతో కష్టపడి హౌస్ లోకి వచ్చినట్లు పల్లవి ప్రశాంత్ చెప్పాడు. స్టూడియో గేటు బయట కుక్కలా కాపలాకాశానని చెప్పాడు. ఈ పాయింట్ దగ్గరే రతికా రోజ్ ఫైర్ అయింది. అలా కుక్కలానిల్చున్నావు. మరి అవకాశం వచ్చాక నువ్వు ఏం చేస్తున్నావ్? అంటూ ప్రశ్నించింది. ఆమె నుంచి ఈ ప్రశ్న వస్తుందని పల్లవి ప్రశాంత్ మాత్రమే కాదు.. ఇంట్లోని సభ్యులు, ప్రేక్షకులు కూడా ఊహించలేకపోయారు. అయితే రతికా రోజ్ అలా అడగ్గానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరూ ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ ఒక టీమ్ అని అనుకున్నారు. అలాంటిది రతికా ప్రశాంత్ పై ఫైర్ కావడంతో సీన్ అంతా రివర్స్ అయినట్లు అయింది. పల్లవి ప్రశాంత్ కి మంచి చేయడం కోసమే ఆమె అలా మాట్లాడి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయినా బిగ్ బాస్ లో ఎంత కలిసి ఆడినా.. చివరకు అది ఇండివిడ్యవల్ గేమ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎంత ఫ్రెండ్ అయినా.. ఎవరికి వాళ్లు గెలవాలి అనే చూస్తారు. పల్లవి ప్రశాంత్ పై రతికా సీరియస్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom