iDreamPost
android-app
ios-app

Bigg Boss Rathika: శివాజీ- ప్రశాంత్ లపై ఊహించని పోస్ట్ చేసిన రతికా రోజ్!

Bigg Boss Rathika: శివాజీ- ప్రశాంత్ లపై ఊహించని పోస్ట్ చేసిన రతికా రోజ్!

బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు. కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్లు మొదటి వారంలోనే ఇంటికి రావచ్చు.. హౌస్ లో అసలు సర్వైవ్ అవ్వరు అనుకున్న ప్లేయర్లు ఫైనలిస్టులు కావచ్చు. అలాగే ఫైనలిస్ట్ అవుతుందనే అంచనాలతో బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టిన హీరోయిన్ రతికా రోజ్ నాలుగో వారమే తిరిగి ఇంటికి వచ్చేసింది. అలా రావడమే కాకుండా.. నెగిటివిటీని వెంట తెచ్చుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రశాంత్- శివాజీ విషయంలో రతికా రోజ్ బాగా నెగిటివ్ అయింది. బయటకు వచ్చాక ఇప్పుడు వారి గురించి ఊహించని పోస్ట్ పెట్టింది.

హౌస్ లో రతికా రోజ్ తొలుత ఫ్రెండ్ అయింది పల్లవి ప్రశాంత్ కే. ఆ తర్వాత వారి ఇద్దరికీ చెడింది. తర్వాత రతికా రోజ్ నామినేషన్ కూడా చేసింది. పల్లవి ప్రశాంత్ కూడా రతికాకు దూరంగా ఉన్నాడు. తర్వాత తప్పైంది సారీ అంటూ క్షమాపణ కూడా చెప్పాడు. అయినా అప్పటికే రతికాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరోవైపు శివాజీతో మొదటి నుంచి అన్నా అన్నా అంటూ ఉన్న రతికా రోజ్ తర్వాత శివాజీతో కూడా దూరం జరిగింది. శివాజీ తనని ఒక పిల్లర్ లా యూజ్ చేసుకోవాలి అని చూశాడు అంటూ అమర్- సందీప్ వంటి వాళ్ల వద్ద కామెంట్స్ కూడా చేసింది. హౌస్ లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా వీళ్లు ఇద్దరితో రతిక ఏం మాట్లాడలేదు. ఎలిమినేట్ అయ్యి వచ్చే సమయంలో కూడా రతికా వీళ్లవైపు కూడా చూడలేదు.

స్టేజ్ మీద ఉండి కూడా వీళ్ల గురించి ప్రస్తావించలేదు. ఎలిమినేట్ అయ్యింది మొదలు.. గుడ్ బై చెప్పే వరకు కూడా హౌస్ లో అసలు ప్రశాంత్- శివాజీలు ఉన్నారని కూడా నాకు తెలియదు అన్నట్లు బిహేవ్ చేసింది. కానీ, ఇప్పుడు హౌస్ లో నుంచి వచ్చిన తర్వాత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఊహించని పోస్ట్ పెట్టింది. హౌస్ లో రతికా గురించి ప్రశాంత్- శివాజీ మాట్లాడుకున్న విషయాన్ని రతికా ప్రస్తావిచిందిం. వాళ్ల మాటలు ఇలా ఉన్నాయి.. “అన్నా నీకు రతికా గుర్తొస్తోందా? నాకు రాత్రి తెగ గుర్తొచ్చింది అన్న. అస్సలు నిద్ర కూడా పట్టలేదు. నాకూ గుర్తొంచ్చింది. కానీ, ఏం చేస్తాంరా చిన్నపిల్ల. అది చిన్న పిల్ల ఏందన్నా? బర్రెపిల్ల మస్త్ కోపం వస్తోంది నాకు. బయటకు వెళ్లాక కలుద్దాంలేరా.. బాధపడకు. నాకు అర్థమైంది నీ బాధ.

రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్న దానిని. నా మీద ఎందుకు అన్న అంత కోపం? నేనేం చేశాను. నామినేషన్ చేసినా కూడా మన అమ్మాయే కదా అని వెళ్లి మాట్లాడా. నన్ను నమ్మలేదు అన్నా. చిన్న పిల్లరా వదిలేయ్. నన్ను కలవదు అన్న బయటకు పోయాక” అంటూ వాళ్లు మాట్లాడుకున్న మాటలను రతికా రోజ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. “దటీజ్ సో స్వీట్.. నేను కూడా మీ ఇద్దరినీ మిస్ అవుతున్నాను” అంటూ కామెంట్ చేసింది. నిజానికి రతికా రోజ్ రియల్ లైఫ్ వేరు.. హౌస్ లో కనిపించింది వేరు అని చాలామంది లేటుగా తెలుసుకున్నారు. అయితే అప్పటికే రతిక ఎలిమినేట్ అయిపోయింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. అందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 8 వరకు ఆగాల్సిందే. రతికా రోజ్ ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Rathika misses Shivaji and Prashant! 2

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş