iDreamPost
android-app
ios-app

రతికతో బ్రేకప్ పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. ఏం చెప్పాడంటే?

  • Published Nov 08, 2023 | 9:32 PM Updated Updated Nov 10, 2023 | 5:47 PM

రతిక రోజ్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఉన్న రిలేషన్ మళ్లీ ఇన్నాళ్లకు చర్చనీయాంశం అయ్యింది. ఈ మధ్య వారు రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీంతో వీరు మాజీ లవర్స్ అంటూ నెటిజన్స్ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనిపై తాజాగా రాహుల్ స్పందించారు.

రతిక రోజ్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఉన్న రిలేషన్ మళ్లీ ఇన్నాళ్లకు చర్చనీయాంశం అయ్యింది. ఈ మధ్య వారు రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. దీంతో వీరు మాజీ లవర్స్ అంటూ నెటిజన్స్ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనిపై తాజాగా రాహుల్ స్పందించారు.

  • Published Nov 08, 2023 | 9:32 PMUpdated Nov 10, 2023 | 5:47 PM
రతికతో బ్రేకప్ పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. ఏం చెప్పాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దిగ్విజయంగా కొనసాగుతోంది. హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకుంటున్న సంఘటనలతో షోను మరింత ఆసక్తిగా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా రతిక రోజ్ అంశం మరింత వైరల్ గా మారింది. దీనికి గల కారణం పల్లవి ప్రశాంత్, రతిక మధ్య చోటుచేసుకున్న ప్రేమాయణం, గొడవలు. దీంతో రతికకు తీవ్రమైన వ్యతిరేకత రాగా సీజన్ నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉంటే గతంలో రతిక, రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది, ఆ తర్వాత ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల వీరి లవ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ మధ్య దగ్గరగా ఉన్న వారి వ్యక్తిగత ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఇదే విషయమై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?

రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన పాటలతో ఉర్రూతలూగించే రాహుల్ కే సాధ్యం. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటతో యూనివర్సల్ గా గుర్తింపు పొందారు రాహుల్ సిప్లిగంజ్. ఏకంగా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడి ఔరా అనిపించాడు. ఈ పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాహుల్ సిప్లిగంజ్ రతికతో ఉన్న రిలేషన్ పై మొట్టమొదటి సారి స్పందించాడు. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, రతిక రోజ్ కొంత కాలం రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఓ మీడియా ఛానల్ రిపోర్ట్ రాహుల్ ను అడగగా తాను ఈ విధంగా సమాధానం చెప్పారు.

ప్రతి ఒక్కరి లైఫ్ లో పాస్ట్ అండ్ ప్రజెంట్స్ ఉంటాయని అన్నారు. భవిష్యత్ లో ఏమైతదో తెల్వదు. రతికతో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరు బాగా ఆడి టైటిల్ గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై రాహుల్ ఈ విధంగా స్పందించారు. ఇక ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారనే ప్రశ్నకు ఇప్పుడే చెప్పలేం అని తెలిపాడు. హౌస్ లో శివాజీ పెద్దమనిషిలా, భోలెషావళి తో మంచి ఎంటర్ టైన్ మెంట్ లభిస్తోందని తెలిపాడు. అదేవిధంగా పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఆడుతున్నాడంటూ తెలిపాడు. ఒకప్పుడు ఆడియెన్స్ మధ్య కూర్చుని బిగ్ బాస్ షోని వీక్షించిన ప్రశాంత్ ఇప్పుడు అదే షోలో కంటెస్టెంట్ గా ఉండగా ఆడియెన్స్ తనని చూస్తున్నారని తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom