iDreamPost
android-app
ios-app

ట్రాక్ తప్పిన ప్రియాంక.. ఇంత చెత్త ఆట?

  • Published Nov 14, 2023 | 12:51 PM Updated Updated Nov 14, 2023 | 12:51 PM

ప్రియాంక జైన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. కానీ, కొన్ని రోజులుగా ఆమె ఆట గాడి తప్పినట్లు అనిపించింది. నామినేషన్స్ లో కూడా ఆ విషయం స్పష్టమైంది.

ప్రియాంక జైన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరికీ తెలుసు. కానీ, కొన్ని రోజులుగా ఆమె ఆట గాడి తప్పినట్లు అనిపించింది. నామినేషన్స్ లో కూడా ఆ విషయం స్పష్టమైంది.

  • Published Nov 14, 2023 | 12:51 PMUpdated Nov 14, 2023 | 12:51 PM
ట్రాక్ తప్పిన ప్రియాంక.. ఇంత చెత్త ఆట?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ నామినేషన్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ఆట చివరి దశకు చేరుకోవడంతో ఎవరికి వాళ్లు తమ సత్తా చాటేందుకు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా నామినేషన్స్ లోనే తమ ఆర్గుమెంట్ స్కిల్స్ ని బయటపెడుతున్నారు. తాజా నామినేషన్స్ లో అందరి ఆట ఒకెత్తు అయితే.. అశ్వినీ ఆట ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే అశ్వినీలో ఇంత మంచి డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయని ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు తనలో ఉన్న టాలెంట్ తానే వేస్ట్ చేసుకుందనే చెప్పాలి. ప్రియాంకలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ నే అదరగొట్టేసింది. మాటలు, ఎక్స్ ప్రెషన్స్, డిఫెండింగ్ లో చెలరేగిపోయింది. అయితే ఒకానొక పాయింట్ లో ప్రియాంక వరస్ట్ గా బిహేవ్ చేసినట్లు అనిపించింది.

సోమవారం జరిగిన నామినేషన్స్ లో ప్రియాంక జైన్.. రతికా రోజ్, అశ్వినీలను నామినేట్ చేసింది. రతికా విషయంలో తన పాయింట్ ని క్లియర్ గా చెప్పింది. నువ్వు ఎదుటివారిని రెచ్చగొట్టి కొన్ని పాయింట్స్ తీసి వాటిని హైలెట్ చేయాలి అని చూస్తున్నావ్. అది ఇక్కడ వర్కౌట్ కాదు. డామినేట్ అనే పదాన్ని వాడి హైలెట్ అవ్వాలని చూస్తున్నావ్. ఇక్కడ ఎవరూ ఎవరినీ డామినేట్ చేయరు, చేయలేరు అంటూ చెప్పుకొచ్చింది. ఆ మాటలకు రతికా రోజ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. రాజమాతల టాస్కు గురించి మాట్లాడింది. అలాగే తాను డామినేట్ అనే పదాన్ని వాడలేదు అంటూ డిఫెండ్ చేసుకుంది. అయితే రతికా రోజ్ ఎక్కువగా కావాలనే ఓవర్ గా రియాక్ట్ అయ్యిందనే బావన కలిగింది.

ఇంక నెక్ట్స్ ప్రియాంక.. అశ్వినీని నామినేట్ చేసింది. “నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అర్థం కాదు. డామినేట్ అనే పదాన్ని బాగా వాడి వాడి వైరల్ చేయాలి అని చూస్తున్నావ్. లాస్ట్ వీక్ నీ రూడ్ బిహేవియర్ చూసే నిన్ను నామినేట్ చేస్తున్నాను” అంటూ తన పాయింట్స్ చెప్పుకొచ్చింది. అయితే ప్రియాంక చెప్పిన పాయింట్స్ ని అశ్వినీ యాక్సెప్ట్ చేయలేదు. తన వాదనను బలంగా వినిపించింది. అలాగే తన మాటలు, చేతలతో కూడా ప్రియాంకను అశ్వినీ డామినేట్ చేసింది. రాజమాతల టాస్కు అప్పుడు ఏడ్చిన అశ్వినీనేనా ఇప్పుడు ఇలా ఆర్గ్యూ చేస్తోంది అంటూ అంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తను అంత బాగా డిఫెండ్ చేసుకుంది. ఒక పాయింట్ దగ్గర ప్రియాంక కూడా సైలెంట్ అయిపోయింది. అశ్వినీ తనని డామినేట్ చేస్తున్న విషయాన్ని కూడా ప్రియాంక గుర్తించింది. అలాగే మధ్యలో రతికా రోజ్ కూడా మాట్లాడటంతో ప్రియాంక కోపంతో ఊగిపోయింది. ఆ తర్వాత తలపై బాటిల్ పగలగొట్టే సమయంలో ప్రియాంక తన కోపాన్ని తీర్చుకుంది. అశ్వినీ తలపై బలంగా బాటిల్ ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత బాటిల్ నెక్ పార్ట్ తన చేతిలో ఉంది. దానిని కూడా ఎంతో విసురుగా నేలకు కొట్టింది.

నిజానికి ప్రియాంక చాలా రూడ్ గా ప్రవర్తించినట్లు అనిపించింది. అప్పుడు అశ్వినీ ఎందుకు అంత గట్టిగా కొట్టావ్? కొంచం మెల్లగా కొట్టచ్చు కదా అని అడిగితే అందుకు నేను మామూలుగానే కదా కొట్టాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత, ముఖ కవళికలు చూసిన తర్వాత ప్రియాంక మామూలుగా కొట్టింది అంటే ఎవరూ నమ్మరు. ఆ బాటిల్స్ ని తయారు చేసింది పంచదారతో అని డిస్క్లైమర్ కూడా వేశారు. అయితే ఎంత పెలుసుగా ఉండే వస్తువు అయినా కూడా బాగా ఫోర్స్ గా కొడితే కచ్చితంగా నొప్పి కలుగుతుంది. అశ్వినీ కూడా దెబ్బ తగిలింది కాబట్టే రియాక్ట్ అయినట్లు అనిపించింది. కానీ, ప్రియాంక మాత్రం ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ ప్రవర్తన చూసిన తర్వాత ప్రియాంక ఆట ట్రాక్ తప్పుతున్న భావన కలుగుతోంది. మరి.. ప్రియాంక ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabet