iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: టాప్-6లో తొలి వికెట్ డౌన్.. హౌస్ నుండి అర్జున్ ఔట్..!

  • Published Dec 16, 2023 | 8:36 PM Updated Updated Dec 17, 2023 | 11:12 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠంగా ఎదురు చూసే రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా సాగింది. ఎప్పుడూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు కేవలం ఐదుగురు మాత్రమే ఫైనలిస్ట్ లో ఉండేవారు. కానీ ఈ సారి ఆరుగురు ఉన్నారు. మరి ఆరుగురిలో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరో ఇప్పుడు చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠంగా ఎదురు చూసే రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా సాగింది. ఎప్పుడూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు కేవలం ఐదుగురు మాత్రమే ఫైనలిస్ట్ లో ఉండేవారు. కానీ ఈ సారి ఆరుగురు ఉన్నారు. మరి ఆరుగురిలో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Published Dec 16, 2023 | 8:36 PMUpdated Dec 17, 2023 | 11:12 PM
Bigg Boss 7 Telugu: టాప్-6లో తొలి వికెట్ డౌన్.. హౌస్ నుండి  అర్జున్ ఔట్..!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కు శుభం కార్డు పడనుంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ హోరులో.. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనలిస్ట్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక టాప్ 6 ఫైనలిస్ట్‌లో నిలిచారు. అయితే ఇందులో శివాజీ, అమర్, ప్రశాంత్ మాత్రం టైటిల్ దిశగా పోటా పోటిగా రేసులో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అమర్, ప్రశాంత్‌ల మధ్య స్వల్ప ఓటింగ్ తేడా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంతా ఉల్టా పుల్టాగా నడిచిన ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైనల్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని ఊహించగా.. అలాంటిదేమీ చోటుచేసుకోలేదు.  గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో టాప్ 6లో తొలి ఎలిమినేషన్ జరిగింది. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.  నాగార్జున ఎప్పటిలాగే తనదైన మార్క్ హోస్టింగ్ తో అలరించాడు. ఇక టాప్ 6 కంటెస్టెంట్స్ లో తొలి వికెట్ పడింది. యాంకర్ సుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. రోబో ద్వారా ఎలిమినేషన్ చేపట్టింది.  ఆ రోబో అంబటి అర్జున్ వైపు తిరిగి ఫైర్ చేయడంతో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక అర్జున్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అర్జున్ అలా కాకుండా.. సీజన్ మొదటిరోజే హౌస్‌లోకి అడుగుపెడితే టాప్ 4 కంటెస్టెంట్‌గా ఉండేవాడు. అతడు కేవలం కండబలం ఉంటే కాదు, బుద్ది బలం కూడా ముఖ్యమని నిరూపించి.. ప్రతి టాస్కులోనూ అదరగొట్టేశాడు. నిజానికి అర్జున్ గత రెండు వారాల క్రితం ఎలిమినేట్ కావాల్సింది. కానీ, అప్పుడు అతడికి అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చింది. అయితే ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతనికి బదలుగా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పారు .

ఇక బిగ్ బాస్ షో సీజన్7 గ్రాండ్ ఫినాలే విన్నర్‌కు 50 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీతో పాటు ఓ బ్రేజా కార్, జాయ్ ఆలుక్కాస్ నుంచి రూ. 15 లక్షలు అందనున్నాయని తెలుస్తోంది. వీటికి తోడు ఓ ఫ్లాటు కూడా ఇస్తున్నారట. దీంతో బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్‌కు అటు ఇటూగా 90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తాజా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు హోస్ట్ నాగార్జునతో పాటు స్టేజ్ పై యాంకర్ సుమ తనయుడు రోషన్ , మాస్ మాహారాజా రవితేజ సందడి చేశారు. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో అర్జున్ ఎలిమినేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet