iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన ఆట సందీప్- ప్రిన్స్ యావర్!

  • Published Dec 22, 2023 | 3:34 PM Updated Updated Dec 22, 2023 | 3:34 PM

Prince Yawar- Aata Sandeep On Pallavi Prashanth Arrest: పల్లవి ప్రశాంత్ ప్రస్తుంత రిమాండు ఖైదీగా ఉన్నాడు. అతని అరెస్టుపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ఆట సందీప్- ప్రిన్స్ యావర్ రియాక్ట్ అయ్యారు.

Prince Yawar- Aata Sandeep On Pallavi Prashanth Arrest: పల్లవి ప్రశాంత్ ప్రస్తుంత రిమాండు ఖైదీగా ఉన్నాడు. అతని అరెస్టుపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ఆట సందీప్- ప్రిన్స్ యావర్ రియాక్ట్ అయ్యారు.

  • Published Dec 22, 2023 | 3:34 PMUpdated Dec 22, 2023 | 3:34 PM
పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన ఆట సందీప్- ప్రిన్స్ యావర్!

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం రిమాండు ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. బిగ్ బాస్ అల్లర్ల కేసులో ప్రశాంత్ అరెస్టైన విషయం తెలిసిందే. కప్పు కొట్టిన కొన్ని గంటల్లోనే ప్రశాంత్ కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ర్యాలీ చేశాడని.. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కి బెయిల్ తెచ్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రశాంత్ కి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే శివాజీ కూడా ప్రశాంత్ నిందితుడు కాదు.. బాధితుడు అంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆట సందీప్, ప్రిన్స్ యావర్ కూడా ప్రశాంత్ అరెస్టుపై స్పందించారు.

పల్లవి ప్రశాంత్ అరెస్టుపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. అతడు తప్పు చేయలేదని ఎవరూ చెప్పడం లేదు. కానీ, ప్రశాంత్ పరిస్థితిని అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలంటూ కోరుతున్నారు. తెలిసీ తెలియక, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే కూడా తెలియని వాడంటూ చెప్పుకొస్తున్నారు. అంత మంది తనకోసం వస్తే వారిని పలకరించాలనే తపనలో ప్రశాంత్ అలా చేశాడు గానీ.. బస్సులు, కార్లు ధ్వంసం చేయడం అతని ఉద్దేశం కాదు అంటున్నారు. ఇప్పటివరకు శివాజీ స్పందించలేదంటూ ఫ్యాన్స్ అడుగుతూ వచ్చారు. శివాజీ కూడా ప్రశాంత్ అరెస్టుపై స్పందించాడు. మరోవైపు SPY బ్యాచ్ మేట్ యావర్ ఏమైపోయాడు అంటూ ప్రశ్నలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు యావర్ కూడా ప్రశాంత్ అరెస్టుపై స్పందించాడు. “ప్రశాంత్ అరెస్టు వీడియో చూశాను. అది చాలా డిప్రెస్సింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే.. మీతో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ప్రశాంత్ చాలా మంచివాడు. హౌస్ లో నేను అతడిని చాలా క్లోజ్ గా చూశాను. మా బాండ్ ఇంకా బాగా పెరిగింది. అందరూ ప్రశాంత్ కి సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రశాంత్ కి మీ సపోర్ట్, మన సపోర్ట్ చాలా అవసరం. నా ఫ్యాన్స్.. SPY ఫ్యాన్స్ అందరూ ప్రశాంత్ కి సపోర్ట్ చేయండి” అంటూ ప్రిన్స్ యావర్ రిక్వెస్ట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by 𝐏𝐫𝐢𝐧𝐜𝐞 𝐘𝐚𝐰𝐚𝐫 (@princeyawar)

మరోవైపు ఆట సందీప్ కూడా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించాడు. “నేను గత నాలుగు రోజులుగా సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాను. ప్రశాంత్ విషయంలో జరిగిన ఘటన ఎంతో బాధాకరమైంది. వాళ్ల పేరెంట్స్ ని కలిశాను. వాళ్లతో మాట్లాడాను. వాళ్లు ఎంతో మంచివాళ్లు, అమాయకులు, వాళ్లకు ఏమీ తెలియదు. ప్రశాంత్ వల్ల కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఫ్యాన్స్ ని కలవడం, పోలీసులు చెప్పినా మళ్లీ రిటన్ రావడం, ఊరి నుంచి కొంతమందిని తీసుకురావడం. 100 రోజులు ఇంట్లో ఉండి బయటకు వచ్చిన ప్రశాంత్ కు బయట ఏం జరుగుతోందో అతనికి తెలీదు. నాకోసం వచ్చిన వాళ్లను కలుద్దాం అని అనుకున్నాడు. నేను ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే.. మీరు నిజంగా జెన్యూన్ ఫ్యాన్స్ అయితే.. తప్పు ఒప్పుకుని సరెండర్ అయ్యి ప్రశాంత్ ను బయటకు తీసుకురండి. పాపం 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి.. బయటకు రాగానే ఇలా 14 రోజులు రిమాండులో ఉండేలా చేశారు. ప్రశాంత్ చెప్పాడా కార్లు పగలగొట్టండి, బస్సులు ధ్వంసం చేయండి అని. మీరు అసలు ఫ్యాన్స్ ఏనా? మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే వచ్చి లొంగిపోయి అతణ్ని బయటకు తీసుకురండి” అంటూ ఆట సందీప్ చెప్పుకొచ్చాడు. మరి.. యావర్, సందీప్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş