iDreamPost
android-app
ios-app

మరి కొద్ది గంటల్లో బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ.. ఇంతలోనే నటి ఇంట తీవ్ర విషాదం!

  • Author Soma Sekhar Updated - 02:47 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Updated - 02:47 PM, Fri - 1 September 23
మరి కొద్ది గంటల్లో బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ.. ఇంతలోనే నటి ఇంట తీవ్ర విషాదం!

బిగ్ బాస్ 7.. ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ 7వ సీజన్ ప్రారంభం కాబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కాగా.. బిగ్ బాస్ 7 కు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బిగ్ బాస్ హౌస్ లోకి మరికొన్ని గంటల్లో అడుగుపెడుతున్న ఓ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీంతో ఆమె చివరి నిమిషంలో బిగ్ బాస్ నుంచి డ్రాప్ అయ్యింది.

పూజా మూర్తి.. కన్నడ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో కూడా ‘గుండమ్మ కథ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. వీటితో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన ‘సూపర్ క్వీన్’ అనే కార్యక్రమంలో కూడా పాల్గొంది. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా మూర్తిని బిగ్ బాస్ 7 లోకి కంటెస్టెంట్ గా ఆహ్వానించారు. పూజా సైతం హౌస్ లోకి వెళ్లేందుకు సిద్దం అయ్యింది. ఎంట్రీ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసింది పూజా. మరికొద్ది గంటల్లో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది అనగా.. ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

పూజా మూర్తి తండ్రి మరణించిన వార్త తెలియగానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకుండా డ్రాప్ అయ్యింది. పూజా తన సోషల్ మీడియాలో తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఒకవేళ కుదిరితే వెనక్కి వచ్చేయమని కోరుకుంటాను అంటూ రాసుకొచ్చింది. తన తండ్రి లేరన్న విషయం తెలిసి ప్రతీ క్షణం ఫీల్ అవుతున్నానని, ఏదో ఒకరోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని, మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయని సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అయ్యోపాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియా సంతాపం తెలియజేశారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler