iDreamPost
android-app
ios-app

రతిక, ప్రశాంత్‌ల రిలేషన్‌పై.. ప్రశాంత్‌ తల్లి ఆసక్తిర వ్యాఖ్యలు!

రతిక, ప్రశాంత్‌ల రిలేషన్‌పై.. ప్రశాంత్‌ తల్లి ఆసక్తిర వ్యాఖ్యలు!

కామన్‌ మ్యాన్‌గా బిగ్‌బాగ్‌ బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్‌. హౌస్‌లో ఏకాకి పక్షిలా మారిపోయాడు. హౌస్‌ మేట్స్‌ అందరూ అతడికి వ్యతిరేకంగానే ఉన్నా.. తను మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆడియన్స్‌ కూడా పల్లవి ప్రశాంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. హౌస్‌మేట్స్‌ నామినేట్‌ చేస్తున్నా.. ఎలిమినేట్‌ అవ్వటం లేదు. ఓటింగ్‌లో ప్రశాంత్‌ టాప్‌లో నిలుస్తూ వస్తున్నాడు. సాధారణ వ్యక్తిగా హౌస్‌లోకి అడుగుపెట్టి.. అసాధారణంగా మారిపోయాడు. ప్రశాంత్‌ క్రేజ్‌ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పీక్‌లోకి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలోనే కుమారుడికి లభిస్తున్న ఆదరణ చూసి ప్రశాంత్‌ తల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. ప్రశాంత్‌ తల్లిగా గర్వపడుతున్నానన్నారు. ప్రశాంత్‌కు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టమని అన్నారు. అతడు ఓ పాట తీస్తే.. దాన్ని వేరే వాళ్లు అమ్ముకున్నారని చెప్పారు. ఆ సమయంలో తన కుమారుడు చాలా బాధపడ్డాడని అన్నారు. యాక్టింగ్‌ మీద ప్రశాంత్‌కు ఉన్న ఇష్టం చూసి, అప్పు చేసి మరీ ఐ ఫోన్‌ కొనిచ్చామన్నారు. ఆ ఫోన్‌తో వీడియోలు చేస్తూ బిగ్‌బాస్‌ వరకు వచ్చాడని తెలిపారు. ఆ ఫోన్‌ తన బిడ్డ జీవితాన్ని మార్చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.

రతిక, ప్రశాంత్‌ల మధ్య ఏమీ లేదని అన్నారు. తన కుమారుడు అందరినీ అక్కా, చెల్లెలిగా చూస్తాడని అన్నారు. రతికే ప్రశాంత్‌ను వాడుకుంటోందంటూ మండిపడ్డారు. ప్రశాంత్‌తో మంచిగా ఉంటే అతడి ఓట్లు తనకు వస్తాయని రతిక అలా చేస్తోందన్నారు. తన కొడుక్కి ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉందని అన్నారు. మరి, రతిక తన కుమారుడ్ని వాడుకుంటోందన్న ప్రశాంత్‌ తల్లి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet