iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్!

  • Published Oct 06, 2023 | 4:52 PM Updated Updated Oct 06, 2023 | 4:52 PM
  • Published Oct 06, 2023 | 4:52 PMUpdated Oct 06, 2023 | 4:52 PM
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట మరింత రసవత్తరంగా మారబోతోంది. వీకెండ్ లో గ్రాండ్ లాంఛ్ 2.0, వీకెండ్ ఎలిమినేషన్, హౌస్ ఫస్ట్ కెప్టెన్ ఎవరు కాబోతున్నారు అంటూ చాలానే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవతున్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా సీజన్ 7 తొలి కెప్టెన్ అయ్యి.. సూపర్ ఇమ్యునిటీని ఎవరు దక్కించుకున్నారు అంటూ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఉన్న లీకుల వీరుల వల్ల తొలి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు నెట్టింట పల్లవి ప్రశాంత్ పేరు  మారుమోగుతోంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తొలి కెప్టెన్ అయ్యాడంటూ చెబుతున్నారు.

మిమ్మల్ని గెలిపించేది మీ నవ్వే, దొరికితే దొంగ- దొరకకపోతే దొర, ఫ్రూట్ నింజా ఛాలెంజ్స్ లో మొత్తం నాలుగు జంటలు తర్వాతి ఛాలెంజ్ కు చేరుకున్నారు. చిట్టీ యాయిరే టాస్కుకు పల్లవి ప్రశాంత్- శివాజీ, సుబ్బు- గౌతమ్, అమర్- సందీప్, యావర్- తేజ జంటలు ఎంపికయ్యారు. జంటలో ఒకరు తమకు వచ్చిన లెటర్ ను, కెప్టెన్సీ కంటెండర్ షిప్ ని త్యాగం చేయాల్సి ఉంటుంది. సుబ్బు, శివాజీ, యావర్, అమర్ తమ లేఖలను, కంటెండర్ షిప్ ని త్యాగం చేశారు. ఆ తర్వాత సందీప్, ప్రశాంత్, తేజ, గౌతమ్ లకు రంగు పడుద్ది టాస్క్ పెట్టారు.

ఈ టాస్కులో ఎవరైతే తమ కలర్ ను ప్రత్యర్థుల షర్ట్ కు ఎక్కువ పూస్తారో వాళ్లే గెలుస్తారు. అయితే సర్కిల్ నుంచి బయటకు వెళ్లిపోయి సందీప్, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆట మొత్తం ప్రశాంత్- గౌతమ్ మధ్య జరిగింది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఎవరికి వాళ్లు విజయం సాధించాలి అంటూ గట్టిగా కృషి చేశారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడాడు. నిజానికి గౌతమ్ తో పోలిస్తే.. ప్రశాంత్ వీక్ అనే చెప్పాలి. కానీ, ఎక్కడా కూడా ప్రశాంత్ తగ్గలేదు. గౌతమ్ తో ఎంతో బాగా పోరాడాడు. బలంతోనే కాకుండా ప్రశాంత్ తెలివితో కూడా కొట్టాడు. తన వీపు గౌతమ్ కు అందకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ, గౌతమ్ మాత్రం కాస్త లాజిక్స్ లేకుండా ఆడినట్లే అనిపించింది. అయితే అధికారికంగా రైతుబిడ్డ ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పాలి అంటే సాంయంత్రం ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాలి.

కాళ్లు గడ్డాలు పట్టుకుని హౌస్ లోకి వచ్చాడు అంటూ ట్రోల్ చేసిన వాళ్లకి పల్లవి ప్రశాంత్ గట్టి రిప్లయ్ ఇచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో కూడా ప్రశాంత్ ని నీకేం తెలియదు, నీకు అర్థం కావట్లేదు అంటూ సిల్లీ కామెంట్స్ చేసిన సెలబ్రిటీలకు ప్రశాంత్ గట్టి సమాధానం చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో తొలి కెప్టెన్ అయ్యి తన సత్తా చాటాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏమీ రాదు అన్న వాళ్లతో కెప్టెన్ అని పిలిపించుకోబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet