iDreamPost
android-app
ios-app

Big Boss 7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని! ఏకంగా లక్షల్లో!

  • Published Dec 18, 2023 | 4:30 PM Updated Updated Dec 18, 2023 | 4:30 PM

రైతుగా ప్రయాణం సాగిస్తూనే సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ గా మారాడు సామాన్యుడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలన్నా తన బలమైన కోరిక.. ఎట్టకేలకు ఆ ఇంట్లోకి వెళ్లేలా చేసింది. తన ఆట తీరుతో కప్ కూడా గెలిచాడు.

రైతుగా ప్రయాణం సాగిస్తూనే సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ గా మారాడు సామాన్యుడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలన్నా తన బలమైన కోరిక.. ఎట్టకేలకు ఆ ఇంట్లోకి వెళ్లేలా చేసింది. తన ఆట తీరుతో కప్ కూడా గెలిచాడు.

  • Published Dec 18, 2023 | 4:30 PMUpdated Dec 18, 2023 | 4:30 PM
Big Boss 7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని! ఏకంగా లక్షల్లో!

‘ అన్నా నేను మళ్లీ వచ్చినా.. ఈ రైతు బిడ్డ బిగ్ బాస్‌లో ఉండాలంటే.. ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయండని’ సోషల్ మీడియాలో వేడుకుంటుంటే.. నిన్ను ఎవడు రానిస్తాడురా లోపలికి అన్న అవమానాలు పడ్డాడు. వాటిని సోపానాలుగా మార్చుకుని.. తాను కలలు కన్న అదే హౌజ్‌లోకి వెళ్లేందుకు ఎంతో కృషి చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి.. ఓ రైతు సత్తా ఏంటో చూపించాలని అనుకున్నాడు. (నిరూపించాడు కూడా). అందుకు సోషల్ మీడియాను ఆయుధంగా మలచుకున్నాడు. తన రిక్వెస్ట్ బిగ్ బాస్ టీంకి చేరేంత వరకు..తను వీడియోలు పెడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్‌కు రావాలన్న అతడి కష్టాన్ని గుర్తించింది బిగ్ బాస్ టీం.

బిగ్ బాస్ సీజన్ 7లో అత్యంత సామాన్యుడిగా, రైతు బిడ్డగా ఇంట్లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్‌లోకి వెళ్లడమే కాదూ.. అందరి మనస్సులు దోచి విజేతగా కప్ కొట్టుకుని విన్నర్‌గా బయటకు వచ్చాడు. ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి తన ఆట తీరుతో విజృంభించాడు. బాధ వచ్చినప్పుడుల్లా మగ పిల్లలు ఏడ్వకూడదన్న లోక నీతిని పాటించకుండా.. చిన్న పిల్లవాడిలా కన్నీరు పెట్టుకునేవాడు. తన కోపాన్ని, కప్ గెలవాలన్న తన కసిని టాస్కుల్లో చూపించేవాడు. నామినేషన్లలో కాస్త ఓవర్ గా రియాక్ట్ అయినా.. మళ్లీ తిరిగి వారితో కలిసిపోయాడు. అతడి తీరు, మాట, నడవడికతో ఆడియెన్స్ ముగ్దులయ్యారు. ఓట్లు వేసి గెలిపించారు.

ఇక స్టేజ్ పై నాగార్జున రైతు బిడ్డ గెలిచాడని ప్రకటించగానే.. సంబరాల్లో తేలిపోయారు ఫ్యాన్స్. అలాగే అతడు 35 లక్షల నగదు. వారానికి లక్ష చొప్పున.. 15 వారాలకు 15 లక్షల పారితోషికం, కారు, రూ. 15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నాడు. అయితే వీటిల్లో ట్యాక్స్ రూపేణా కొంత పోతుంది. ఇదిలా ఉంటే.. అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు ఘనంగా స్వాగతం పలికింది అశేష జనవాహిని. అయితే ఆ సందర్భంగా ఓ ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. యాదగిరి గుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వంగపల్లి దగ్గర రూ. 15 లక్షలు విలువ చేసే ఓపెన్ ఫ్లాట్ ను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పారు. తర్వలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. మరి ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడంపై.. అలానే అభిమాని రైతుబిడ్డకు భూమి బహుమానం ఇస్తానని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş